గ్రాండ్ గా “ఆదిపర్వం” ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఈ నెల 8న సినిమా విడుదల
రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై ఏఐ ఎంటర్ టైన్ మెంట్స్ కలయికలో నిర్మించిన చిత్రం “ఆదిపర్వం”. ఈ సినిమాలో మంచు లక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో కీలక పాత్రను ఆదిత్య ఓం పోషిస్తున్నారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథతో గ్రాఫిక్స్ ప్రధానంగా “ఆదిపర్వం” చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. “ఆదిపర్వం” సినిమా ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 500కు పైగా థియేటర్స్ లో “ఆదిపర్వం” సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మంగళవారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…
డైరెక్టర్ సంజీవ్ మేగోటి మాట్లాడుతూ – మహాభారతంలో 18 పర్వాలు. మా సినిమా మొదలై 18 నెలలు అవుతోంది. ఈ నెల 8వ తేదీన “ఆదిపర్వం” తెలుగు, కన్నడలో రిలీజ్ చేస్తున్నాం. మరో వారం రోజుల తర్వాత తమిళం, మలయాళంలో విడుదల చేస్తాం. చిన్న చిత్రంగా మొదలై బిగ్ మూవీగా మారింది “ఆదిపర్వం”. ఈ చిత్రంలో గ్రాఫిక్స్, యాక్షన్ ఆకట్టుకుంటాయి. మంచు లక్ష్మీ గారికి పేరు తెచ్చే చిత్రమవుతుంది. అలాగే హనుమంతు క్యారెక్టర్ లో ఆదిత్య ఓం నటన హైలైట్ గా నిలుస్తుంది. మా సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈనెల 8వ తేదీన రిలీజ్ అవుతున్న చిత్రాల్లో “ఆదిపర్వం” ది బెస్ట్ మూవీగా నిలుస్తుంది. అన్నారు.
నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ – టీజర్ చూసే ప్రేక్షకులు సినిమాకు వెళ్లాలా వద్దా అని డిసైడ్ అవుతున్నారు. “ఆదిపర్వం” కంటెంట్ లో ప్రేక్షకుల్ని ఆకర్షించే అంశాలు ఉన్నాయి. డివోషనల్, యాక్షన్ వంటి అన్ని ఎలిమెంట్స్ కలిపి ఈ సినిమాను సంజీవ్ గారు రూపొందించారు. “ఆదిపర్వం” పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ – సినిమాకున్న 24 క్రాఫ్టులు ఎవరి కాంట్రిబ్యూషన్ వారు చేస్తే పర్పెక్ట్ మూవీ వస్తుందని చెప్పేందుకు “ఆదిపర్వం” నిదర్శనం. సంజీవ్ చాలా మంచి డైరెక్టర్. ఈ సినిమాతో మరో గొప్ప ప్రయత్నం చేశారు. నిర్మాతకు డబ్బులు తీసుకొచ్చే సినిమా కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
యాక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ – “ఆదిపర్వం” సినిమాలో చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. అవి సినిమాకు ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమా తర్వాత సీక్వెల్ ప్లాన్ కూడా మా డైరెక్టర్ గారు చేస్తున్నారు. “ఆదిపర్వం” సినిమాను ఈ నెల 8వ తేదీన తప్పకుండా థియేటర్స్ లో చూస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
యాక్టర్ శివ కంఠమనేని మాట్లాడుతూ – “ఆదిపర్వం” సినిమాలో క్షేత్రపాలకుడి క్యారెక్టర్ లో నటించాను. ఇలాంటి మంచి రోల్ ఇచ్చిన డైరెక్టర్ సంజీవ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. మంచు లక్ష్మి గారితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. సినిమా చాలా బాగా వచ్చింది. మీ సపోర్ట్ “ఆదిపర్వం”కు అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
బిగ్ బాస్ ఫేమ్ మధు(బేబక్క) మాట్లాడుతూ – “ఆదిపర్వం” వంటి మంచి ప్రయత్నం చేసిన ఈ టీమ్ అందరికీ మీ సపోర్ట్ ఇవ్వాలి. మంచి సినిమాలను ఆదరించే మీడియా సపోర్ట్ కూడా ఉంటుందని ఆశిస్తున్నా. “ఆదిపర్వం” టీమ్ కు ఈ నెల 8వ తేదీన పెద్ద సక్సెస్ దక్కాలి. అన్నారు.
బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల మాట్లాడుతూ – ముందుగా “ఆదిపర్వం” టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ సినిమా ట్రైలర్, టీజర్ చాలా బాగున్నాయి. తెలుగు నుంచి వస్తున్న మరో గొప్ప సినిమాగా “ఆదిపర్వం” నిలుస్తుందని కోరుకుంటున్నా. అన్నారు.
యాక్టర్ జెమినీ సురేష్ మాట్లాడుతూ – “ఆదిపర్వం” సినిమాలో మంచి క్యారెక్టర్ లో నటించే అవకాశం ఇచ్చారు దర్శకుడు సంజీవ్ గారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. ఎప్పుడూ సంజీవ్ గారితో మాట్లాడినా దగ్గరి మిత్రుడు అనే ఫీల్ కలుగుతుంది. యూత్ సినిమాకు రావడం చాలా ముఖ్యం. మంచి సినిమా వచ్చినప్పుడు యూత్ థియేటర్స్ లో ఎంజాయ్ చేయాలి. “ఆదిపర్వం” సినిమాను కూడా ప్రేక్షకులు ఈ ఫ్రైడే థియేటర్స్ లో చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో ఆదిత్య ఓం మాట్లాడుతూ – ప్రతి నటుడికి, ఫిలిం మేకర్ కు ప్రేక్షకుల దగ్గర నుంచి వచ్చే స్పందనే ఆక్సీజన్ లాంటిది. “ఆదిపర్వం” సినిమాను మీరంతా థియేటర్స్ లో చూసి ఆ ప్రాణవాయువు మాకు అందిస్తారని కోరుకుంటున్నా. ఈ సినిమాలో హనుమంతు అనే కీ రోల్ చేశాను. ఇలాంటి మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చిన దర్శకుడు సంజీవ్ గారికి థ్యాంక్స్. “ఆదిపర్వం”లో మీరు థ్రిల్ అయ్యేలా యాక్షన్, డివోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సినిమాకు చిన్నా పెద్దా తేడా లేదు. కంటెంట్ బాగున్న సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ నెల 8న “ఆదిపర్వం” థియేటర్స్ లో చూడండి. అన్నారు.
నటీనటులు – మంచు లక్ష్మి, ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి, హ్యారీ జోష్, జబర్దస్త్ గడ్డం నవీన్, యోగి ఖత్రి , మధు నంబియార్, బీఎన్ శర్మ, బృంద, స్నేహ అజిత్, అయోషా, జ్యోతి, దేవి శ్రీ ప్రభు, శ్రావణి, గూడా రామకృష్ణ, రాధాకృష్ణ తేలు, రవి రెడ్డి, లీలావతి, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీరామ్, తదితరులు
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ – ఎస్ ఎన్ హరీశ్
మ్యూజిక్ – మాధవి సైబ, ఓపెన్ బనాన ప్రవీణ్, సంజీవ్, బి.సుల్తాన్ వలి, లుబెక్ లీ, రామ్ సుధీ(సుధీంద్ర)
ఎడిటింగ్ – పవన్ శేఖర్ పసుపులేటి
ఫైట్స్ – నటరాజ్
కొరియోగ్రఫీ – సన్ రేస్ మాస్టర్
ఆర్ట్ డైరెక్టర్ – కేవీ రమణ
ప్రొడక్షన్ మేనేజర్స్ – బిజువేముల రాజశేఖర్ రెడ్డి, కొల్లా గంగాధర్, కంభం ప్రకాష్ రెడ్డి
కో డైరెక్టర్ – సిరిమల్ల అక్షయ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – ఘంటా శ్రీనివాసరావు
సహ నిర్మాతలు – గోరెంట శ్రావణి, రవి మొదలవలస, ప్రదీప్ కాటకూటి, రవి దశిక, శ్రీరామ్ వేగరాజు.
పీఆర్ఓ- మూర్తి మల్లాల
పీఆర్ డిజిటల్ టీమ్ – కడలి రాంబాబు, దయ్యాల అశోక్
నిర్మాణం – అన్వికా ఆర్ట్స్, ఏఐ(అమెరికా ఇండియా) ఎంటర్ టైన్ మెంట్స్
రచన, దర్శకత్వం – సంజీవ్ మేగోటి