Ranabaali-Never Forget The Truth Documentary Series: Third Episode The Men

Karuppu to release in theaters from May 14
సూర్య, RJ బాలాజీ, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మాగ్నమ్ ఓపస్ ‘కరుప్పు’ మే 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘కరుప్పు’ కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది.
సూర్య పవర్ఫుల్ అవతార్‌లో కనిపించిన ‘కరుప్పు’ ఫస్ట్ లుక్ టీజర్ సంచలనం క్రియేట్ చేసింది.
తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 2026 మే 14న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ సూర్య ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది.
ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి జికె విష్ణు సినిమాటోగ్రఫీ.
తారాగణం: సూర్య, త్రిష, ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి, శ్శివాడ, సుప్రీత్ రెడ్డి
రచన & దర్శకత్వం: RJ బాలాజీ
సినిమాటోగ్రఫీ – జికె విష్ణు
సంగీతం – సాయి అభ్యంకర్
యాక్షన్ అన్బరివ్ – విక్రమ్ మోర్
ఎడిటర్ – ఆర్.కళైవానన్
ప్రొడక్షన్ డిజైన్ – అరుణ్ వెంజారామూడు
నిర్మాతలు: ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు
పీఆర్వో – వంశీ-శేఖర్
