ప్రేక్షకుల మనసులని గెలిచి సక్సెస్ ఫుల్ గా 25 రోజులు పూర్తి చేసుకున్న
Prestigious venue to host red carpet event of Devara
Devara, starring man of masses NTR, is directed by the masterful Koratala Siva. This movie promises to be a global spectacle. Devara is a highly anticipated film presented by Nandamuri Kalyan Ram while it is bankrolled under the banner of NTR Arts and Yuvasudha Arts. Mikkilineni Sudhakar and Hari Krishna K are the producers. Janhvi Kapoor is cast as the leading lady, while versatile star Saif Ali Khan, is set to entertain in a key role.
Following chartbuster songs, recently the makers unveiled the film’s epic trailer at a grand launch event in Mumbai. The trailer for “Devara Part 1” has captured massive attention across the globe, racking up millions of views on YouTube in various languages. The buzz around the film is reaching new heights as the team gears up for a series of innovative promotional strategies designed to elevate anticipation even further.
The film’s premiere at Beyond Fest on September 26 at 6:30 PM PST will take place at the iconic Egyptian Theatre in Hollywood, Los Angeles. This prestigious venue, renowned for its rich cinematic history, will host the red carpet event, marking a significant milestone as “Devara” becomes the first Indian film to be showcased there.
The event promises to be a star-studded affair, with numerous Hollywood celebrities expected to attend. The presence of these high-profile figures, alongside the Devara team, is anticipated to further amplify the film’s visibility on the global stage. This spotlight on such a renowned platform could significantly enhance the film’s reach and reception.
The film also stars Prakash Raj, Srikanth, Shine Tom Chacko, Ajay, Getup Srinu, and others. Sreekar Prasad is handling the editing works, R. Rathnavelu is acting as the cinematographer, and Sabu Cyril is the production designer. Devara will be released globally on September 27th in multiple languages, including Telugu, Tamil, Hindi, Kannada, and Malayalam.
బియాండ్ ఫెస్ట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’ రెడ్ కార్పెట్ ప్రీమియర్.. ఈజిప్షియన్ థియేటర్, హాలీవుడ్, లాస్ ఏంజెల్స్‌లో ప్రీమియర్ కానున్న తొలి ఇండియా సినిమాగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్న చిత్రం
మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచలనాలను క్రియేట్ చేస్తోంది. అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు శిరిల్ వంటి స్టార్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు.
దేవర రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో ‘దేవర పార్ట్ 1’లోని సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. రీసెంట్గా ముంబైలో గ్రాండ్ లెవల్లో ట్రైలర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ ట్రైలర్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అన్నీ భాషల్లో కలిపి మిలియన్స్ వ్యూస్‌తో ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు చేరుకున్నాయి. డిఫరెంట్ ప్లానింగ్‌తో సాగుతోన్న ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకీ పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో దేవర ప్రీమియర్ షోను సెప్టెంబర్ 26 సాయంత్రం ఆరున్నర గంటలకు బియాండ్ ఫెస్ట్‌లో హాలీవుడ్, లాస్ ఏంజిల్స్‌లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్లో ప్రదర్శించనున్నారు. బియాండ్ ఫెస్ట్ ఘనమైన సినిమా చరిత్రను కలిగిన ప్రతిష్టాత్మకమైన సినిమా వేదిక.ఇలాంటి వేదికలో రెడ్ కార్పెట్ ఈవెంట్ జరగటం గొప్ప విషయం. అలాగే ఇక్కడ ప్రీమియర్ కాబోతున్న తొలి ఇండియన్ సినిమాగా దేవర అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
ఈ రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. దేవర టీమ్‌తో పాటు హై ఫై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు పాల్గొంటుండటం అనేది ప్రపంచ వేదికపై దేవర ఖ్యాతిని మరింత ఇనుమడింప చేయనుంది.
ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. ఇంకా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, సాబు శిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న దేవర చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.