25% Collection of AAY movie to Donate for AP Flood Victims
NTR’s brother-in-law, Narne Nithiin, who captivated the Telugu audience with the film Mad, has recently brought the fun entertainer AAY to the audience. Directed by Anji K. Maniputhra and starring Nayan Sarika as the heroine, the film was produced by Bunny Vas and Vidya Koppineedi and released on August 15, with popular producer Allu Aravind presenting it.
Set against the backdrop of the Godavari region, the comedy entertainer has been well-received by audiences. The movie generated buzz even before its release and is now performing well at the box office, moving towards a blockbuster status. Alongside praise from viewers and critics, movie celebrities like Man of Masses NTR, Icon Star Allu Arjun, and the Thandel team have also lauded the film unit for their work.
The film was a huge success and continues its hold at the box office with new releases. With good occupancy and decent collections, the film is performing well. Now, the team’s noble gesture has become the talk of the town. Producer Bunny Vas and Geetha Arts has announced that 25% of Producer’s share from AAY collections from today till weekend will be donated to flood victims through Janasena Party.
It is known that heavy rains in Andhra Pradesh have led to widespread flooding, creating challenging conditions across the region. In light of this, the team has announced this decision comes. The flood has impacted many lives and caused considerable disruption. By supporting the flood victims, Bunny Vas and Team AAY emphasize their solidarity with the affected communities and encourage others to contribute to relief efforts.
The decision is expected to provide significant support to those affected by the floods in Andhra Pradesh. Inspired by Pawan Kalyan’s commitment to social responsibility, Bunny Vas and the team have chosen to contribute in this meaningful way.
AAY కలెక్షన్లలో 25 శాతం విరాళం.. జన సేన ద్వారా ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు సాయం
నార్నే నితిన్ హీరోగా వచ్చిన ఆయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్గా నటించారు. ఈ చిత్రాన్ని బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ఆగస్టు 15న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
గోదావరి ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఆడియెన్స్, విమర్శకుల నుండి ప్రశంసలతో పాటు, మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తండేల్ టీమ్ ఆయ్ యూనిట్‌ను అభినందించారు.
ఈ చిత్రం ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీ, డీసెంట్ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈరోజు నుండి వారాంతానికి వచ్చే ఆయ్ కలెక్షన్లలో నిర్మాత వాటాలో 25% జనసేన పార్టీ ద్వారా వరద బాధితులకు అందజేస్తామని నిర్మాత బన్నీ వాస్, గీతా ఆర్ట్స్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతమంతా అల్లకల్లోలం అయిన సంగతి తెలిసిందే. వరదల వల్ల ఎంతో మందికి నీడ లేకుండాపోయింది. ఎంతో మందికి ఆహారం అందకుండా పోతోంది. వరద బాధితులకు అండగా నిలిచేందుకు నిర్మాత బన్నీ వాస్ ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వరదల వల్ల నష్టపోయిన వారికి సాయంగా ఆయ్ టీం నిలిచింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ఉండే సామాజిక బాధ్యత నుంచి స్పూర్తి పొంది బన్నీ వాస్ అండ్ టీమ్ వరద బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.