అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గల్లీ గ్యాంగ్ స్టార్స్
Galli Gangstars movie review and rating
నటీనటులు :
సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక, Rj బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి
టెక్నీషియన్స్ :
నిర్మాణం – ఏ బి డి ప్రొడక్షన్స్
నిర్మాత – డా. ఆరవేటి యశోవర్ధన్
స్టొరీ మరియు దర్శకత్వం – వెంకటేష్ కొండిపోగు, ధర్మ
డి ఓ పి – ఎడిటర్ – రచయత – దర్శకత్వ పర్యవేక్షణ – ధర్మ
సంగీత దర్శకుడు – సత్య, శరత్ రామ్ రవి
పి ఆర్ ఓ – మధు VR
కథ
నెల్లూరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన సినిమా గల్లీ గ్యాంగ్ స్టార్స్. గాంధీ, తప్పెట్లు, మూగోడు, చెత్తోడు, కర్రోడు మరియు క్వార్టర్ అనే పేర్లతో నెల్లూరు గల్లీలో పెరుగుతున్న అనాధలు. ఆ గల్లీ ని ఎప్పటినుంచో తన గుప్పెట్లో పెట్టుకున్న గోల్డ్ రెడ్డి అనే రౌడీషీటర్… అక్కడ ఉన్న అనాధల్ని తీసుకెళ్లి వాళ్లతో డ్రగ్ అమ్మించడం వంటి నేరాలు చేయిస్తూ ఉంటాడు. గోల్డ్ రెడ్డి కింద పనిచేస్తున్న గాంధీ… లక్ష్మీ ని ప్రేమిస్తూ ఉంటాడు. గాంధీ ప్రేమిస్తున్న లక్ష్మీని గోల్డ్ రెడ్డి ఏడిపిస్తాడు. అదే విధంగా ఆ గల్లీ ప్రజలని భయపెడుతూ ఉంటాడు. ఈ గల్లీ కుర్రాళ్ళకి సత్య అని చదువుకున్న యువకుడు తోడు అవుతాడు. తన మాటలలో గోల్డ్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని అర్థం చేసుకున్న గల్లీ కుర్రాళ్ళు గల్లీ గ్యాంగ్ స్టార్స్ గా ఎలా మారారు? ఈ ఆరుగురు అనాధలు ఎలా కలిశారు? గోల్డ్ రెడ్డిని ఎలా ఎదిరించారనే అంశాలతో సినిమా తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
నటీనటుల పెర్ ఫామెన్స్
అందరూ కొత్త వారైనా కూడా మంచి నటనను కనబరిచారు. సంజయ్ శ్రీ రాజ్ గాంధీ గా మంచి పాత్ర పోషించాడు. ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక, Rj బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి అందరూ కూడా తమ పాత్రకు తగిన న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం
ఏ బి డి ప్రొడక్షన్స్ పై డా. ఆరవేటి యశోవర్ధన్ నిర్మాతగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్ తో సినిమాను నిర్మించారు. ధర్మ రచయిత, ఎడిటర్, డిఓపిగా తన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించాడు. ధర్మ దర్శకత్వ పర్యవేక్షణలో వెంకటేష్ కొండిపోగు దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా డిఓపిగా ధర్మ సినిమాటోగ్రఫీ వర్క్ బాగా చేశాడు. సత్య శరత్ రామ్ రవి సంగీత సారధ్యంలో ఇచ్చిన పాటలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
ధర్మ ఎంచుకున్న కథ కథనం సత్య, శరత్ రామ్ రవి ఇచ్చిన పాటలు, టెక్నికల్ వాల్యూస్, ఎడిటింగ్ మరియు సినిమాటోగ్రఫీ, లొకేషన్స్
మైనస్ పాయింట్స్ :
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ ఆఫ్ రొటీన్ గా అనిపించే కొన్ని సన్నివేశాలు
రేటింగ్ : 2.75/5