Raakaasa Announces ₹100 Flat Ticket Offer Across Single Screens in

Sampradayini Suppini Suddapusani Motion Poster Unveiled
శివాజీ, లయ, శ్రీ శివాజీ ప్రొడక్షన్స్, ప్రొడక్షన్ నెంబర్. 2 మూవీ టైటిల్ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ -మోషన్ పోస్టర్ రిలీజ్
శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పై రెండవ ప్రాజెక్టుగా సుధీర్ శ్రీరామ్ రచన దర్శకత్వంలో వింటేజ్ బ్లాక్ బస్టర్ కపుల్ నటుడు శివాజీ, లయ జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మరోసారి ఈటీవీ విన్ తో కలిసి శివాజీ పనిచేస్తున్నారు. 90’s వెబ్ సిరీస్ లో శివాజీతో కలిసి నటించిన బాల నటుడు రోహన్, అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృధ్వీ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. 90 వెబ్ సిరీస్లో శివాజీ, రోహన్ మధ్య వచ్చే ఈ బీజీఎం వైరల్ అయ్యింది. ఈ టైటిల్ పెట్టడం మరింత ఆసక్తి పెంచింది.
ఈ చిత్రంలో పంచాయతీ సెక్రెటరీ శ్రీరామ్ గా కనిపించనున్నారు. టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో శివాజీ, లయ సీరియస్ గా నడుస్తూ ముందుకు వస్తుండగా రోహన్ సెల్ఫీ తీసుకుంటూ కనిపించడం క్యురియాసిటీ పెంచింది.
మేకర్స్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ చాలా క్రియేటివ్ గా వుంది. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో జరిగే కథలో ఒక క్రైమ్ ఎలిమెంట్ కూడా వున్నట్లు మోషన్ పోస్టర్ లో చాలా ఎక్సయిటింగ్ గా ప్రజెంట్ చేయడం సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఈ చిత్రానికి రంజిన్ రాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కెమెరామెన్ రిత్విక్ రెడ్డి, బాలు మనోజ్.డి ఎడిటర్.
నటీనటులు:శివాజీ, లయ, అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృధ్వీ, ప్రిన్స్, జబర్దస్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాసు, కరణ్ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : శ్రీ శివాజీ ప్రొడక్షన్స్
నిర్మాత : శివాజీ సొంటినేని
రచన – దర్శకత్వం : సుధీర్ శ్రీరామ్
సంగీత దర్శకుడు : రంజిన్ రాజ్
ఎడిటర్ : బాలు మనోజ్.డి
కెమెరామెన్ : రిత్విక్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ప్రసాద్ లింగం, ధీరజ్.పి
కో డైరెక్టర్ : గుడివాక శివ కుమార్
ప్రొడక్షన్ కంట్రోలర్ : బాలాజీ శ్రీను కరెడ్ల
పీఆర్వో : వంశీ-శేఖర్
