Anakapalli is an Action-Family Drama with a Strong Message –

Nagababu as a Rangarajan in CASTE – FL Unveiled
CASTE మూవీ నుంచి రంగరాజన్ గా నాగబాబు పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్
వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి ప్రధాన పాత్రల్లో ఎకె జంపన్న రచన & దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘CASTE’.
ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రంలో నాగబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రని రంగరాజన్ గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
నల్ల దుస్తుల్లో, మెడలో రుద్రాక్షమాల, నుదుటిపై తిలకం ధరించి, ఇంటెన్స్ గా చూస్తున్న నాగబాబు లుక్ పవర్ ఫుల్ గా వుంది.
ఈ గెటప్ ఆయన పాత్రలోని కమాండ్, అథారిటీ చూపిస్తోంది. ఇందులో ఆయన పాత్ర నిర్భయంగా, కులాలకు అతీతమైన మానవత్వంతో ఉండబోతుంది.
ఈ చిత్రంలో కశికా కపూర్, దివి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.
మేకర్స్ త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.
తారాగణం: వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి, కశికా కపూర్, దివి, నాగబాబు, పృద్వి తదితరులు
దర్శకత్వం: ఎకె జంపన్న
నిర్మాత: తోట లక్ష్మీ కోటేశ్వర రావు
బ్యానర్: గోల్డెన్ ప్రొడక్షన్స్
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
పీఆర్వో: వంశీ శేఖర్
