శబ్దం టెక్నికలీ చాలా రోజుల తర్వాత చూసిన టాప్ నాచ్ ఫిల్మ్- నాని

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎనర్జిటిక్ ఫెరోషియస్ ‘భైరవం’ థీమ్ సాంగ్ రిలీజ్
అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, చార్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్, టీజర్ కి వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్ తో ‘భైరవం’మూవీపై హ్యూజ్ బజ్ నెలకొంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ నిర్మించారు, పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గడా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఈరోజు, మేకర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భైరవం థీమ్ సాంగ్ను విడుదల చేశారు.
ఫిబ్రవరి 26 రానున్న మహా శివరాత్రి శుభ సందర్భంగా విడుదలైన ఈ పాట ఆధ్యాత్మిక శక్తి, డైనమిక్ ఫోర్స్ బ్లెండ్ తో అదిరిపోయింది. శ్రీచరణ్ పాకాల వండర్, భక్తి రెండింటి కలయికతో సాంగ్ రూపొందించారు. చైతన్య ప్రసాద్ రాసిన సాహిత్యం, శివుని దైవిక సారాన్ని అందంగా ప్రజెంట్ చేసి, లోతుగా ప్రతిధ్వనించే ఎమోషన్స్ ని అందించింది.
ఈ పాటకు శంకర్ మహదేవన్ అద్భుతమైన వోకల్స్ గొప్ప శక్తిని నింపింది. బెల్లంకొండ శ్రీనివాస్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తూ, శివుని ఫియర్, స్ట్రెంత్ రెండింటినీ కనబరిచారు. అతని ఎక్స్ ప్రెస్షన్స్, మూమెంట్స్ డివైన్ ఎనర్జీని అందించాయి. తన పాత్ర శివ తాండవం ప్రేరణ స్ఫూర్తితో మెస్మరైజ్ చేస్తోంది. క్యారెక్టర్ ఇంటెన్స్ పవర్ అద్భుతంగా వుంది.
ఒక ఆలయం ముందు చిత్రీకరించబడిన విజువల్స్ అద్భుతంగా వున్నాయి. పాటకు ఆధ్యాత్మికతని జోడిస్తాయి. మహా శివరాత్రి ఉత్సవాలు ఇప్పటికే ప్రారంభమవుతున్నందున, ఈ పాట భైరవం పై అంచనాలను మరింత పెంచింది.
ఈ చిత్రంలో నారా రోహిత్, మనోజ్ మంచు, అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ హరి కె వేదాంతం, ఎడిటింగ్ చోటా కె ప్రసాద్. ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాశారు.
భైరవం సమ్మర్ థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై
సాంకేతిక సిబ్బంది:
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాత: Kk రాధామోహన్
సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గడ (పెన్ స్టూడియోస్)
సినిమాటోగ్రాఫర్: హరి కె వేదాంతం
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
డైలాగ్స్: సత్యర్షి, తూమ్ వెంకట్
లిరిక్స్: భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, తిరుపతి
ఫైట్ మాస్టర్స్: రామకృష్ణ, నటరాజ్ మాడిగొండ
పబ్లిసిటీ డిజైనర్: సుధీర్
PRO: వంశీ-శేఖర్