నవ్విస్తూ ఆలోచింపజేసే “ఆయ్”
ఆయ్ మూవీ రివ్య్వూ
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లుగా GA2 పిక్చర్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా నిర్మించిన చిత్రం ‘ఆయ్’. రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మైమ్ గోపి ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులలో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు (ఆగస్ట్ 15, 2024) ఈ చిత్రం ప్రీమియర్స్ స్ర్కీనింగ్ అయ్యాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
కార్తీక్ (నార్నే నితిన్) అమలాపురం పక్కన ఓ చిన్న పల్లెటూరుకు చెందిన కుర్రాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన అతను వర్క్ ఫ్రం హోం చేసేందుకు సొంత ఊరికి వస్తాడు. అనుకోకుండా పక్క ఊరికి చెందిన పల్లవి (నయన్ సారిక)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. స్నేహితులు హరి(అంకిత్ కొయ్య), సుబ్బు(రాజ్ కుమార్ కసిరెడ్డి) సహాయంతో ఆమె వెంట పడుతూ ఆమెను ప్రేమలో పడేస్తాడు. అయితే పల్లవికి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. తెగించి ఇంటికి వెళితే పల్లవి మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన విషయం కార్తీక్ కి తెలుస్తుంది. అయితే ప్రేమించిన కార్తీక్ ను కాదని పల్లవి మరో పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్ధమైంది? చివరికి పల్లవి, కార్తీక్ కలిశారా? వేరే కులం అంటే అసలు పడని పల్లవి తండ్రి దుర్గ(మైమ్ గోపి) కార్తీక్ పల్లవిల ప్రేమ గురించి తెలిసి ఏం చేశాడు? చివరికి ఏం జరిగింది? అనేదే ఈ సినిమా కథ.
నటీనటుల పెర్ పామెన్స్
మ్యాడ్ చిత్రం ద్వారా పరిచయం అయిన నితిన్ కి “ఆయ్” రెండో సినిమా. ఈ సినిమాలో అమ్మాయి ప్రేమ కోసం పరితపించే ప్రేమికుడిగా చక్కటి నటన కనబర్చాడు. ఈ సినిమా నితిన్ కెరీర్ కి ప్లస్ అవుతుంది. నితిన్ ఫ్రెండ్స్ గా నటించిన రాజ్ కుమార్, అంకిత్ తమదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేశారు. హీరోయిన్ నయన సారిక ఫర్వాలేదనిపించింది. వినోద్ కుమార్, మైమ్ గోపి, సురభి ప్రభావతి, శ్రీవాణి త్రిపురనేని సహా మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం
ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ సినిమాటోగ్రఫీ. విజువల్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని ఎలివేట్ చేసే విధంగా ఉంది. నిర్మాణపు విలువలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. కథ సింఫుల్ గా అనిపిస్తుంది. కానీ కామెడీ ఎపిసోడ్స్‌పై ఫోకస్ చేసిన దర్శకుడు అంజి ఆడియన్స్ ని నవ్వించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు.
విశ్లేషణ
హీరో అతని ఫ్రెండ్స్ పరిచయం వారి క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసిన విధానం ఆసక్తికరంగా అనిపిస్తుంది. పల్లవితో కార్తీక్ ప్రేమలో పడటం ఆమెతో కలిసి సరదా సరదా పనులు చేస్తూ ఉండడం లాంటి సన్నివేశాలు బాగున్నాయి. ఫ్రీ ఇంటర్ బ్యాంక్ ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించి సెకండాఫ్ పై అంచనాలు నెలకొనేలా చేసింది. సెకండాఫ్ మొదలైన తర్వాత కార్తీక్ ని ప్రేమించిన పల్లవి వేరే వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందనే విషయాన్ని చెప్పిన విధానం బాగుంది. ఈ సినిమాని యూనిట్ ముందు నుంచి ఒక ఫన్ బాత్ అన్నట్టుగానే ప్రమోట్ చేస్తూ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే సినిమా మొత్తాన్ని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసారు.
ఫైనల్ గా … కులం కన్నా స్నేహం గొప్పది అనే మెసేజ్ ఈ సినిమాలో ఉంది. నవ్విస్తూనే… ఆలోచింపేజేసే మెసేజ్ తో తెరకెక్కిన ఈ సినిమాని మిస్ అవ్వద్దు.
రేటింగ్ – 3/5