WhatsApp Romeo First Look Released
Under the banner of BS Production House, “WhatsApp Romeo,” an entertainment movie starring Harsha Roshan and Harika in lead roles and Kamna Jethmalani in a prominent role, is directed by Bhaskar Ram and produced by Bhikshamayya. The first look of the film was unveiled today in Hyderabad.
Speaking on the occasion, director Bhaskar Ram said, “WhatsApp Romeo… a story about universal love. Technically, I have worked on pan-world movies like Baahubali and KGF, alongside legendary directors like Rajamouli and Prashanth Neel. I have also worked in the technical departments of Bollywood and Hollywood movies. This is my second movie as a director in Telugu; my first movie is currently in post-production. The Marathi movie I directed, Dil.. Dosti.. Duniyaadari, is set to release this month, and I received the Best Debut Director award at SRICA 2023, the Satyajit Ray Cinema Iconic Award, for it. As for this film, just as a mother’s heart is pure, a child’s heart is equally pure. When guided properly, children can create wonders. Our movie, WhatsApp Romeo, is a story about such a child. Unlike the traditional notion of Romeo as a reckless youth, our Romeo’s character is quite different, possessing a mindset that loves everyone. After several auditions, we felt only Harsha Roshan could do justice to this role. We are filming this movie in both Telugu and Tamil, with dubbing in Hindi and other languages. This is an Amazon Prime pre-approved project, and we will complete it in three schedules across beautiful locations in Madhya Pradesh, Hyderabad, and Visakhapatnam.”
Producer Bhikshamayya Sangem added, “This is a unique subject. We are currently shooting in Bhopal, Madhya Pradesh, and we are confident that this film will captivate everyone.”
The event was attended by Dr. Roja Bharathi, actor Harsha Roshan, actress Harika, Rajeev, and others.
Details:
- Banner: BS Production House
- Cast: Harsha Roshan (Hero), Harika (Heroine), Mythili (Debut), Kamna Jethmalani, Alok Jain, Shivraj Valvekar, Gopal Shyam, Madhu Sudhan, and others.
- Writer & Director: Bhaskar Ram
- Producers: Bhikshamayya Sangem
- Music Director: Jayavardhan
- DOP: Ranjith M.
వాట్సప్ రోమియో ఫస్ట్ లుక్ విడుదల
బిఎస్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై హర్ష రోషన్, హారిక హీరో హీరోయిన్లు గా కామ్నాజెఠ్మలానీ ప్రధాన పాత్రలో భాస్కర్ రామ్ దర్శకత్వంలో, భిక్షమయ్య గారు నిర్మిస్తున్న ఎంటర్టైన్మెంట్ మూవీ ,వాట్సప్ రోమియో. ఈ చిత్రం నేడు ఫస్ట్ లుక్ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.- ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు భాస్కర్ రామ్ మాట్లాడుతూ – వాట్స్ అప్ రోమియో..వీడి ప్రేమ అందరికీ..మూవీ డైరెక్టర్ని.టెక్నికల్ గా బాహుబలి.. కె జి ఎఫ్..లాంటి పాన్ వరల్డ్ మూవీస్ లో..రాజమౌళి గారు..ప్రశాంత్ నీల్ గారు లాంటి దిగ్ దర్శకులతో,టెక్నికల్ విభాగం లో కలిసి వర్క్ చేయటం జరిగింది..అలాగే బాలీవుడ్, హాలీవుడ్ మూవీస్ కి కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేయటం జరిగింది..తెలుగు లో డైరెక్టర్ గా ఇది నా సెకండ్ మూవీ..నా ఫస్ట్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది..మరాఠీ లో నేను డైరక్ట్ చేసిన దిల్..దోస్తీ..దునియాదారీ అనే మూవీ ఈ మంత్ లోనే రిలీజ్ కి ఉంది..ఈ మూవీ కి గాను బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా SRICA 2023..సత్యజిత్ రే సినిమా ఐకానిక్ అవార్డు అందుకోటం జరిగింది.. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే..ఈ సృష్టి లో తల్లి మనసు ఎంత స్వచమైనదో,పిల్లల మనసు కూడా అంతే స్వచ్చ మైనది.పిల్లలను ప్రాపర్ గా గైడ్ చేస్తే,వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేస్తారు.సృష్టిస్తారు.అలాంటి ఓ పిల్లాడి కథే మా వాట్సప్ రోమియో..(వీడి ప్రేమ అందరిదీ)..రోమియో అంటే ఒక ఆకతాయి కుర్రాడి గానే మన అందరికీ తెలుసు..కానీ మా మూవీ లో రోమియో పాత్ర చాలా భిన్నం గా వుంటుంది..ప్రతి ఒక్కరినీ ప్రేమించే మనస్తత్వం మా రోమియోది..ఈ పాత్ర కోసం ఎంతో మందిని ఆడిషన్స్ చేశాం..ఎప్పుడైతే.. మా హీరో హర్ష్ రోషన్‌ని కలిశామో..కేవలం ఈ అబ్బాయి ఐతేనే..ఈ పాత్ర కు న్యాయం చేయగలడు అనిపించింది..ఈ సినిమాని మేము తెలుగు తమిళ భాషల్లో చిత్రికరిస్తున్నాం.అలాగే హిందీ ఇతర భాషల్లో..డబ్బింగ్ చేస్తున్నాం..ఇది అమేజాన్ ప్రైమ్ ప్రీ అప్రూవల్ ప్రాజెక్టు .ఈ మూవీ మొత్తం మధ్య ప్రదేశ్, హైదరాబాద్,విశాఖపట్నం ల లోని అందమైన లొకేషన్స్ లో ..మొత్తం మూడు షెడ్యూల్స్ లో పూర్తి చేస్తాం అని అన్నారు .
చిత్ర నిర్మాత బిక్షమయ్య సంగెంమాట్లాడుతూ ఇదొక వెరైటీ సబ్జెక్ట్. భోపాల్ మధ్యప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటున్నాం. ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను .అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రోజా భారతి, హీరో హర్ష రోషన్, హీరోయిన్ హారిక, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
బ్యానర్: BS ప్రొడక్షన్ హౌస్
నటీనటులు : హర్ష రోషన్ (హీరో) హారిక (హీరోయిన్)
మైథిలి(పరిచయం)
కామ్నా జెఠ్మలానీ
అలోక్ జైన్
శివరాజ్ వాల్వేకర్
గోపాల్ శ్యామ్
మధు సూధన్
తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
రచయిత & దర్శకుడు – భాస్కర్ రామ్
నిర్మాతలు – బిక్షమయ్య సంగం
సంగీత దర్శకుడు – జయవర్ధన్
DOP – రంజిత్ ఎమ్