Dharmasthala Niyojakavargam is set for a worldwide grand theatrical release

Ramcharan Started Dubbing For Peddi
పెద్ది డబ్బింగ్ ప్రారంభించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ సినిమా వేసవిలో గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో బజ్ నెక్స్ట్ లెవల్ కి చేసుకుంది. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఫస్ట్ షాట్ గ్లింప్స్, బ్లాక్ బస్టర్ ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి కి ట్రెమండస్ రెస్పాన్స్ తో రికార్డులను బద్దలు కొట్టాయి.
తాజాగా రామ్ చరణ్ ‘పెద్ది’ డబ్బింగ్ ప్రారంభించారు. పెద్ది పాత్రలో చరణ్ చెప్పిన ‘ఏమది’ డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.
వీడియోలో ”బుచ్చి.. చికిరి పాటలో మోహిత్ చౌహాన్ వాయిస్ కి నువ్వు ఎంత యాక్టింగ్ చేశావంటే.. నువ్వు పాడావా ఆయన పాడాడా? అనే డౌట్ వచ్చిందయ్యా.. నాకు డబ్బింగ్ లో కూడా అలా యాక్టింగ్ చేయమని చెప్పకు. డబ్బింగ్ నేనే చెప్పానండి” అని బుచ్చిబాబుతో చరణ్ చెప్పడం నవ్వులు పూయించింది. ఈ వీడియో ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పెద్ది సెకండ్ సింగిల్ ‘రై రై రారా’ మార్చి 2న రిలీజ్ కాబోతోంది.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఆస్కార్-విజేత స్వరకర్త AR రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ R రత్నవేలు డీవోపీ, జాతీయ అవార్డు గెలుచుకున్న ఎడిటర్ నవీన్ నూలి ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్.
పెద్ది ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
తారాగణం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సాన
సమర్పకులు: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా
సంగీతం: ఏఆర్ రెహమాన్
DOP: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్
