
Vilaya Thandavam Tittle Poster Unveiled
It’s well known that different, content-oriented subjects are currently receiving immense appreciation. Young hero Karthik Raju who shot to fame with the thriller Atharva is coming up with yet another intriguing project. Parvathi Arun and “Pushpa” fame Jagadeesh Prathap Bandari also play key roles in the film, which is produced by Mandala Dharma Rao and Gumpu Bhaskar Rao under the GMR Movie Makers banner. The film marks the directorial debut of VS Vasu. The movie is titled powerfully Vilaya Thandavam, and the same was revealed through this poster. Puri Akash and Bheemaneni Srinivasa Rao unveiled the title poster.
The title poster depicts a traditional, divine figure standing in a pool of blood, adorned with anklets and dressed in a red garment, alluding to an intense, ritualistic dance. The background features symbolic severed limbs and heads, creatively representing the ferocious form of the goddess Kali. The tagline, “When patience dies, Rudra Kaali rises,” highlights the film’s theme of divine retribution and feminine power.
While speaking at the title launch, *Akash Puri said,* “The title ‘Vilaya Thandavam’ is extremely powerful. My thanks to the team for inviting me to this event. Just looking at the title poster gives me goosebumps. I sincerely wish Karthik Raju earns another good name with this film and that it turns out to be a big hit.”
*Bheemaneni Srinivasa Rao said* , “Karthik Raju acted in my film ‘Kousalya Krishnamurthy’. He always chooses different and unique stories. His passion for cinema is remarkable. I hope ‘Vilaya Thandavam’ brings him another big success. I really liked the title poster. Nowadays, people are increasingly appreciating content-driven films. I believe ‘Vilaya Thandavam’ will become a huge success as well.”
*Lead actor Karthik Raju expressed* , “These days, audiences embrace films with strong concepts and content. This film is crafted from a unique point and story by director Vasu, everyone will be stunned when the teaser and trailer are out. Parvathi, Jagadeesh, and I portray pivotal roles. The producers have been like family, and I hope this film brings great success to all of us.”
*Producer Mandala Dharma Rao shared* , “I was surprised when I first heard the story from director Vasu. ‘Vilaya Thandavam’ boasts a phenomenal story, as reflected by the power of this poster. More updates will be revealed soon.”
*Producer Gumpu Bhaskar Rao stated* , “Director Vasu’s story deeply impressed us. Despite all challenges, we never compromised on the film, and we eagerly await the blessings of the media and audience.”
*Director VS Vasu said* , “This film’s journey began thanks to my friend Sanjay. My heartfelt thanks to the producers who stood by me and gave me this opportunity. I also thank Gowra Hari, Akash Puri, and Bheemaneni Srinivasa Rao for being here with us today. The title poster of ‘Vilaya Thandavam’ is impressing everyone. I am grateful to Karthik Raju for being a part of this journey. Our film will shortly be coming before the audience, and I hope everyone supports and appreciates it.”
*Music director Gyani said,* “Having previously worked with Karthik Raju on ‘Atharva,’ our journey continues with ‘Vilaya Thandavam,’ and I’m glad to be a part of this project.”
*Choreographer Aata Sandeep remarked* , “The title ‘Vilaya Thandavam’ stands out, and the poster itself hints at the film’s scale. I got an excellent opportunity to choreograph, and I thank the team for this chance.”
*Choreographer Kapil said,* “Thanks to the ‘Vilaya Thandavam’ team for this opportunity. Having known Atharva and Gyaani, I wish the director and producer great acclaim and profit with this film.”
*Cast:* Karthik Raju, Parvathi Arun, Jagadeesh (Pushpa fame Keshava), and others.
*Technical Crew:*
Banner: GMR Movie Makers
Producers: Mandala Dharma Rao, Gumpu Bhaskar Rao
Director: VS Vasu
Cinematography: Suresh Rugutu
Music: Gyani
Editor: Vamshi Krishna
Art Director: Hari Varma
Fight Master: Wing Chun Anji
Dance Masters: Ata Sandeep, Kapil
Poster Design: Ajay (AJ Ads)
PRO: Sai Sathish
*యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు హీరోగా ‘విలయ తాండవం’.. ఘనంగా టైటిల్ పోస్టర్ లాంఛ్ ఈవెంట్*
డిఫరెంట్ స్టోరీ, కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌లకు ప్రస్తుతం లభిస్తున్న ఆదరణ అందరికీ తెలిసిందే. అలాంటి ఓ వినూత్నమైన కథాంశంతో ప్రస్తుతం ఓ చిత్రం రూపు దిద్దుకుంటోంది. యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1 గా మందల ధర్మా రావు, గుంపు భాస్కర రావు ‘విలయ తాండవం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను బుధవారం (అక్టోబర్ 1) నాడు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమానికి ఆకాష్ పూరి, భీమనేని శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో..
*ఆకాష్ పూరి మాట్లాడుతూ* ..‘‘విలయ తాండవం’ టైటిల్ ఎంతో పవర్ ఫుల్‌గా ఉంది. ఈ ఈవెంట్‌కు నన్ను ఆహ్వానించిన టీంకు థాంక్స్. టైటిల్ పోస్టర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. కార్తీక్ రాజుకి మరోసారి ఈ చిత్రంతో మంచి పేరు రావాలని, సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు
*భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ* .. ‘కార్తీక్ రాజు నేను తీసిన ‘కౌసల్యా కృష్ణమూర్తి’ చిత్రంలో నటించారు. కార్తీక్ ఎప్పుడూ డిఫరెంట్ కథల్నే ఎంచుకుంటారు. సినిమా పట్ల ఆయనకు ఎంతో ప్యాషన్ ఉంది. ఈ ‘విలయ తాండవం’తో మరోసారి కార్తీక్ రాజుకి హిట్ రావాలి. టైటిల్ పోస్టర్ అయితే నాకు చాలా నచ్చింది. కంటెంట్ బేస్డ్ చిత్రాల్ని జనాలు ఇప్పుడు ఎక్కువగా ఆదరిస్తున్నారు. అలానే ‘విలయ తాండవం’ మూవీని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
*హీరో కార్తిక్ రాజు మాట్లాడుతూ* .. ‘ప్రస్తుతం కంటెంట్ ఉన్న చిత్రాలనే జనాలు ఆదరిస్తున్నారు. మంచి కాన్సెప్ట్ ఉంటేనే జనాలు థియేటర్లకు వస్తున్నారు. డైరెక్టర్ వాసు సరికొత్త పాయింట్, కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్ వచ్చాక అందరూ ఆశ్చర్యపోతారు. ఈ మూవీలో నేను, పార్వతి, జగదీష్ చాలా ముఖ్యమైన పాత్రల్ని పోషించాం. నిర్మాతలైన ధర్మా రావు, గుంపు భాస్కర రావు నాకు ఫ్యామిలీ మెంబర్లలా మారిపోయారు. ఈ మూవీతో మా అందరికీ పెద్ద విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*నిర్మాత మందల ధర్మా రావు మాట్లాడుతూ* .. ‘డైరెక్టర్ వాసు మాకు ఈ కథను చెప్పినప్పుడే ఆశ్చర్యపోయాను. అద్భుతమైన కథతో ‘విలయ తాండవం’ మూవీని నిర్మించాం. ఈ పోస్టర్ చూస్తేనే కథ ఎంత పవర్ ఫుల్‌గా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే మరిన్ని అప్డేట్లతో ఆడియెన్స్ ముందుకు వస్తామ’ని అన్నారు.
*నిర్మాత గుంపు భాస్కర రావు మాట్లాడుతూ* .. ‘డైరెక్టర్ వాసు చెప్పిన కథ మాకు చాలా నచ్చింది. కథలో దమ్ముంది అని నాకు అర్థమైంది. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే మేం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని నిర్మించాం. మాకు మీడియా, ఆడియెన్స్ నుంచి ఆశీస్సులు లభిస్తాయని కాంక్షిస్తున్నాను’ అని అన్నారు.
*దర్శకుడు వీఎస్ వాసు మాట్లాడుతూ* .. ‘మా స్నేహితుడు సంజయ్ వల్లే ఈ మూవీ ప్రయాణం మొదలైంది. నాకు అండగా నిలిచి అవకాశం ఇచ్చిన నా నిర్మాతలకు థాంక్స్. మా కోసం ఈ రోజు ఇక్కడకు వచ్చిన గౌర హరి, ఆకాష్ పూరి, భీమనేని శ్రీనివాసరావు గార్లకు థాంక్స్. ‘విలయ తాండవం’ టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. నాకు ఈ ప్రయాణంలో సహకరించిన కార్తీక్ రాజుకి థాంక్స్. త్వరలోనే మా చిత్రం ఆడియెన్స్ ముందుకు రానుంది. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
*మ్యూజిక్ డైరెక్టర్ గ్యానీ మాట్లాడుతూ* .. ‘కార్తిక్ రాజుతో ఇది వరకు నేను ‘అథర్వ’ మూవీకి పని చేశాను. అప్పటి నుంచి మా జర్నీ కొనసాగుతూనే ఉంది. ‘విలయ తాండవం’ సినిమాకు పని చేస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
*కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాట్లాడుతూ* .. ‘‘విలయ తాండవం’ టైటిల్ చాలా బాగుంది. పోస్టర్‌ను చూస్తే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అర్థం అవుతుంది. ఈ మూవీలో నాకు మంచి కొరియోగ్రఫీ అందించే అవకాశం వచ్చింది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన టీంకు థాంక్స్’ అని అన్నారు.
*కొరియోగ్రాఫర్ కపిల్ మాస్టర్ మాట్లాడుతూ* .. ‘‘నాకు అవకాశాన్ని ఇచ్చిన ‘విలయ తాండవం’ టీంకు థాంక్స్. అథర్వ, గ్యానీలతో నాకు మంచి పరిచయం ఉంది. ఈ మూవీతో దర్శక, నిర్మాతలకు మంచి పేరు, లాభాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*తారాగణం* : కార్తీక్ రాజ్, పార్వతి అరుణ్, జగదీష్ (పుష్ప ఫేమ్ కేశవ) తదితరులు
*సాంకేతిక బృందం*
బ్యానర్ : GMR మూవీ మేకర్స్
నిర్మాతలు : మండల ధర్మ రావు, గుంపు భాస్కర్ రావు
దర్శకుడు : VS వాసు
DOP : సురేష్ రుగుతు
సంగీతం : జ్ఞాని
ఎడిటర్ : వంశీ కృష్ణ
ఆర్ట్ డైరెక్టర్ : హరి వర్మ
ఫైట్ మాస్టర్ : వింగ్ చున్ అంజి
డాన్స్ మాస్టర్ : ఆట సందీప్, కపిల్
పోస్టర్లు : అజయ్ (AJ Ads)
PRO : సాయి సతీష్