The Award 1996 is a movie that society needs -Mr. Suresh Babu
A Weaver is as important to a body as a farmer is to a nation. The film “The Award 1996” directed by young director Badugu Vijay Kumar of Bhudan Pochampally is about how talented artisans in the field of handloom are being cheated by brokers. Based on true events, this film is being produced by Chirandasu Dhanunjaya under the banner of Mega Maze Entertainments and presented by Srikanth C.
On this occasion, Mr. Suresh Babu, Head of Suresh Productions, released the trailer of “The Award 1996” at Ramanaidu Studio in Hyderabad. After watching the trailer, Suresh Babu congratulated the director, producer, actors and technicians of the film. And he said… The Award 1996 trailer is very good. This film was made with a good heart. It is appreciated that handloom artisans inform the society about their problems. It has a social dimension and appeals to the audience. Later, Suresh Babu inquired about other details related to the film unit. Producer Dhanunjay expressed his happiness that Suresh Babu released the trailer of his debut movie. He said that he felt fortunate that Suresh Babu, a very experienced producer, liked the trailer and inquired about the film. He said that there are many things in the movie that will impress the audience more than the trailer. He said that the award will be brought before the audience soon. In this film, Shivaram Reddy and Sai Chandana acted as a couple and Bunny Abiran acted in a pivotal role. Linga Goud is the cinematographer and Prashanth Mark has composed the music. Editing by Raj Chennuri and Pawan.
ది అవార్డ్ ట్రైలర్ ను విడుదల చేసిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు
దేశానికి రైతన్న ఎంత ముఖ్యమో.. దేహానికి నేతన్న అంతే ముఖ్యం. అలాంటి చేనేత రంగంలో ప్రతిభా వంతులైన కళాకారులు దళారుల చేతుల్లో ఎలా మోసపోతున్నారనే కథాంశంతో భూదాన్ పోచంపల్లికి చెందిన యువ దర్శకుడు బడుగు విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ” ది అవార్డ్ 1996″ . పలు యదార్థ సంఘటన ఆధారంగా మెగా మేజ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై శ్రీకాంత్ సి సమర్పణలో చిరందాసు ధనుంజయ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత శ్రీ సురేష్ బాబుగారి చేతుల ది అవార్డ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఆధ్యంతం వీక్షించిన సురేష్ బాబు గారు… దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను అభినందించారు. ఈ సందర్భంగా సురేష్ బాబుగారు మాట్లాడుతూ… ది అవార్డు 1996 ట్రైలర్ చాలా బాగుంది. మంచి హృదయంతో ఈ సినిమా తీశారు. చేనేత కళాకారులు, వారి సమస్యలను సమాజానికి చూపించాలనుకోవడం అభినందనీయం. సోషల్ రిలవెంట్ టాఫిక్ ఇది, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది అన్నారు. అనంతరం చిత్ర యూనిట్ కు సంబంధించిన ఇతర వివరాలను సురేష్ బాబు గారు అడిగి తెలుసుకున్నారు. తమ మూవీ ట్రైలర్ ను సురేష్ బాబు విడుదల చేయడం పట్ల నిర్మాత ధనుంజయ్ ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో అనుభవం ఉన్న నిర్మాత సురేష్ బాబుకు ట్రైలర్ నచ్చడం, సినిమా గురించి అడిగి తెలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ట్రైలర్ కంటే సినిమాలో ప్రేక్షకులకు ఆకట్టుకునే ఎన్నో అంశాలున్నాయన్నారు. త్వరలోనే ది అవార్డ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. ఈ చిత్రంలో శివరామ్ రెడ్డి, సాయి చందన జంటగా నటించగా బన్నీ అభిరన్ కీలక పాత్ర పోషించారు. సంగీతం: ప్రశాంత్ మార్క్ , సినిమాటోగ్రాఫర్: లింగా గౌడ్, ఎడిటింగ్: రాజ్ చెన్నూరి, పవన్