Lopalliki Ra Cheptha 4th Single Tik Tok Chedama.. Released by

Thammudu has been crafted as a pure theatrical experience – Director Sriram Venu
After delivering the blockbuster Sankranthiki Vasthunnam, Sri Venkateswara Creations is back with another promising entertainer, “Thammudu”. Starring Nithiin in the lead role, the film is directed by Sriram Venu and produced by Dil Raju and Shirish. Actresses Laya, Varsha Bollamma, and Sapthami Gowda play key roles. Thammudu is all set for a grand worldwide theatrical release on July 4th. The film’s release trailer was launched yesterday in Hyderabad with great enthusiasm.
Cinematographer KV Guhan said, “Working under Dil Raju’s banner feels like working from home. Three DOPs worked on Thammudu, but audiences won’t notice any difference while watching. Not just us technicians, even the actors gave their best. I’ve seen the film – it’s going to be a blockbuster.”
Editor Prawin Pudi said, “I’ve previously worked with Dil Raju, Nithiin, and Sriram Venu. This is my third film with Sriram, and he has crafted fresh characters with a unique narrative. We spent even more time discussing this project than we did for Vakeel Saab. He gave me complete creative freedom.”
Lyricist Jonnavithula Ramalingeswara Rao said, “I consider myself blessed to have written the ‘Jai Bagalaamukhii’ song set against the Pagadalamma Jathara backdrop. Composer Ajaneesh did a brilliant job with it. I’m glad director Sriram Venu came up with the idea to include this devotional song, and the producers supported it wholeheartedly. While working on the song, I witnessed how hard the entire team was working. I hope Thammudu showers success like a golden rain.”
Actress Hariteja said, “I play a significant role in Thammudu. I remember director Sriram Venu narrating my character even while battling a fever. This role stands apart from all my previous work. We all put in a lot of effort, and the joy of seeing that hard work translate into success is priceless.”
Child actor Baby Deetya said, “I want to thank the direction team for selecting me in the audition and giving me this role. I’m also grateful to the director and my father. The technicians and artists took great care of me. Thammudu is an amazing film – you’re all going to love it!”
Music Director Ajaneesh Loknath said, “Working on Thammudu has been a special experience. At one point during narration, the director spoke about self-respect and integrity – it brought tears to my eyes. The scenes Sriram Venu described inspired me to compose a different kind of music. After working on this film, I wished I had a sister. This is a film meant to be experienced in theaters.”
Actress Sapthami Gowda said, “I play the character ‘Ratna’ in the film. I’m thankful to director Sriram Venu and producers Dil Raju and Shirish for selecting me. The direction team supported me greatly to help me do justice to the role. It was a pleasure working with Nithiin. We’ve all worked hard on this project for two years. The film is just three days away from release, and I hope audiences will support Thammudu by watching it in theaters.”
Actress Varsha Bollamma said, “More than me, it was our director Sriram Venu who believed I could do justice to my role in Thammudu. Without any expectations, he gave me this opportunity. I walked into his office straight from the airport without makeup, and he looked at me and said I was perfect for the role. Working with Nithiin was a happy experience. I kept annoying him with endless jokes. Laya is such a sweet person and a true inspiration to many of us.”
She added, “I’m excited about Dil Raju’s newly announced platform Dil Raju Dreams. I believe it will give hope to thousands of aspiring talents.
During the forest shoot, the technicians worked harder than us. My heartfelt thanks to them. There are some films that you regret missing in theatres. Thammudu is one such film that deserves a big-screen experience.”
Actress Laya said, “When I first heard the script, I knew it was something different. I’ve never played a character like this before, nor have I experienced such emotions even in my personal life – because I’m an only child with no siblings. They say it took two years to make this film, but even if it had taken ten, I would have done it for such a meaningful story. Audiences have always supported me and my previous work with immense love, and I hope they show the same affection for Thammudu.
Producer Shirish said, “Thanks to every single person who worked on Thammudu. All credit for the success this film is going to achieve on July 4th belongs to Sriram Venu. We producers contributed only a little, the hard work is entirely his. Let’s celebrate again when this film becomes a hit. Just like Nithiin rejoiced over the success of Jayam and Gundejaari Gallanthayyinde, Thammudu will bring him even greater joy. As producers, we promise him that.”
Producer Dil Raju said, “The film looks so great on screen thanks to the dedication of our technicians, DOP Guhan, editor Prawin Pudi, VFX supervisor, art director Shekhar, and others. They beautifully translated Sriram Venu’s vision onto the screen.
The ‘Jai Bagalaamukhii’ song added a unique vibe to the film. My thanks to lyricist Jonnavittula for that. Composer Ajaneesh Loknath elevated the film with his music. Sriram Venu has been on a long journey with us – he gave us superhits like MCA and Vakeel Saab. He might have leaned on us for those films, but Thammudu is entirely his own effort. This success will belong to him.
He added, “From the beginning, Karthik and Satya have been traveling with Sriram. Along with Nithiin, five strong female leads, Laya, Sapthami Gowda, Varsha Bollamma, Swasika, and Deetya played significant roles. Their characters will be remembered for a long time. In fact, we could call them heroes alongside Nithiin based on their performance. Though Nithiin was disappointed with a few of his recent films, Thammudu will be his big comeback. After Sankranthiki Vacham, this will be our banner’s next hit. We made Game Changer with Ram Charan, but we couldn’t deliver the hit we hoped for. We’ll be announcing a new project with Charan soon – and that will be the superhit we owe him.”
Actor Nithiin said, “Thammudu releases in theatres on July 4th. This film needs to be a success – for director Sriram Venu, for the fans who love my work, and for those who’ve been waiting for my comeback. I know my recent films didn’t entertain you, but Thammudu will definitely make you smile.
I’ll talk more on July 4th about how hard Sriram Venu worked on this. From now on, I promise to only come to you with good scripts. Thanks to all the technicians who worked on this film.
He added, “Our co-stars shot for 80 days in a forest – with half the shoots at night and the other half during the day. They pushed through fevers, food poisoning, injuries – you name it – and were always ready on set by 7 AM. Without their dedication, this film wouldn’t have been completed. Whenever I felt down, Raju and Shirish would lift my spirits with encouraging words. Thammudu is a film made for the big screen. I urge everyone to go experience it in theatres on July 4th.”
Director Sriram Venu said, Dil Raju and Shirish are like family to me. Shirish believed in Thammudu more than I did. Even if I was feeling low, he would say things like, “That scene is fantastic – you nailed it.” That one line of encouragement meant the world to me. I told them from the beginning that this film is designed for a theatrical experience – and they gave me full creative freedom. Though Raju garu was busy, Shirish always made time to support us, ensuring we had everything we needed. I believe I’ve lived up to the trust they placed in me.”
He added, “Nithiin was unconditionally supportive – he perfectly delivered the character I had envisioned. My daughter Deetya acted in the film, and my wife and daughter were with me throughout the shoot. Having family by my side during filming gave me strength, and I felt it deeply while making this movie. You’ll see a whole new side of Laya in this film – she worked extremely hard. Varsha is like a daughter to me; she even learned kickboxing for her role. Each of the main artists learned a new skill for the film. Every key role has action involved, and the emotional weight is carried by the women in the film. DOPs Sethu, Sameer Reddy, and Guhan delivered brilliant visuals. Composer Ajaneesh was so emotionally connected to the scenes that he redid the background score twice to make it better.
I’ll speak more about Thammudu after July 4th.”
Cast: Nithiin, Laya, Varsha Bollamma, Sapthami Gowda, Swasika Vijay, Baby Sriram Deetya, and others
Technical Team:
Cinematography – K.V. Guhan
Editing – Prawin Pudi
Music – B. Ajaneesh Loknath
PRO – Vamsi Kaka, GSK Media
Banner – Sri Venkateswara Creations
Producers – Dil Raju, Shirish
Writer & Director – Sriram Venu
తమ్ముడు” సినిమాను థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ కోసం డిజైన్ చేశాం – మూవీ రిలీజ్ ట్రైలర్ లాంఛ్ వేడుకలో దర్శకుడు శ్రీరామ్ వేణు
“సంక్రాంతికి వస్తున్నాం” బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ “తమ్ముడు”. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “తమ్ముడు” సినిమా రిలీజ్ ట్రైలర్ ను హైదరాబాద్ లో ఘనంగా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో
డీవోపీ కేవీ గుహన్ మాట్లాడుతూ – దిల్ రాజు గారి బ్యానర్ అంటే నాకు హోమ్ బ్యానర్ లాంటిది. “తమ్ముడు” సినిమాకు ముగ్గురు డీవోపీలం పనిచేశాం. అయితే మీరు సినిమా చూస్తున్నప్పుడు ఆ తేడా ఎక్కడా కనిపించదు. టెక్నీషియన్స్ గా మేమే కాదు ఆర్టిస్టులు కూడా ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా నేను చూశాను. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అన్నారు.
ఎడిటర్ ప్రవీణ్ పూడి మాట్లాడుతూ – దిల్ రాజు గారు, నితిన్ గారు, శ్రీరామ్ వేణు గారితో నేను గతంలో పనిచేశాను. శ్రీరామ్ వేణు గారితో నాకిది మూడో మూవీ. చాలా మంచి క్యారెక్టర్స్ డిజైన్ చేసుకుని వాటి ద్వారా నావెల్టీ ఉన్న మూవీని శ్రీరామ్ వేణు గారు రూపొందించారు. వకీల్ సాబ్ మూవీ చేస్తున్నప్పటి కంటే ఎక్కువ గంటలు డైరెక్టర్ గారితో నేను డిస్కషన్స్ చేశాం. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేయించుకున్నారు. అన్నారు.
గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ – “తమ్ముడు” సినిమాలో పగడాలమ్మ జాతర నేపథ్యంలో జై బగళాముఖీ పాట రాసే అవకాశం రావడంతో నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. ఈ పాటను అజనీష్ ఎంతో ప్రతిభావంతంగా కంపోజ్ చేశాడు. అమ్మవారి పాటను ఈ సినిమాలో చిత్రీకరించాలని ఆలోచన దర్శకుడు శ్రీరామ్ వేణు గారికి రావడం గొప్ప విషయం. ఇందుకు నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ పాటకు పనిచేస్తున్నప్పుడు తమ్ముడు సినిమా కోసం టీమ్ అంతా ఎంత కష్టపడుతున్నారో తెలిసింది. తమ్ముడు సినిమా మీద కనకవర్షం కురవాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటి హరితేజ మాట్లాడుతూ – “తమ్ముడు” సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా కోసం వెళ్లినప్పుడు డైరెక్టర్ గారు జ్వరంతో ఉండి కూడా క్యారెక్టర్ నెరేట్ చేశారు. ఇది నేను ఇప్పటిదాకా చేసిన అన్ని క్యారెక్టర్స్ లోకి డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా షూటింగ్ లో కష్టపడ్డాం అయితే ఆ కష్టం తర్వాత సక్సెస్ రూపంలో రాబోతున్న సంతోషం ఎంతో విలువైనదిగా భావిస్తాను. అన్నారు.
బేబి దిత్య మాట్లాడుతూ – “తమ్ముడు” మూవీలో నన్ను ఆడిషన్ లో సెలెక్ట్ చేసిన డైరెక్షన్ టీమ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే నన్ను ఈ క్యారెక్టర్ లో నటింపజేసిన డైరెక్టర్, మా నాన్న గారికి థ్యాంక్స్. నన్ను బాగా చూసుకున్న టెక్నీషియన్స్, ఆర్టిస్టులకు థ్యాంక్స్. “తమ్ముడు” మూవీ అమేజింగ్ గా ఉంటుంది. మీరంతా బాగా ఇష్టపడతారు. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ మాట్లాడుతూ – “తమ్ముడు” మూవీకి పనిచేసిన ఎక్సిపీరియన్స్ చాలా ప్రత్యేకం. ఈ సినిమాలో ఒక సందర్భంలో డైరెక్టర్ గారు సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి, మన ఇంటిగ్రిటీ గురించి చెప్పారు. ఆ టైమ్ లో నాకు కన్నీళ్లు వచ్చాయి. శ్రీరామ్ వేణు గారు చెప్పిన సీన్స్ నుంచే కొత్త తరహా మ్యూజిక్ చేసే స్ఫూర్తి కలిగింది. ఈ సినిమాకు వర్క్ చేశాక నాకొక సోదరి ఉంటే బాగుండేది అనిపించింది. థియేట్రికల్ గా ఎక్సిపీరియన్స్ చేయాల్సిన చిత్రమిది. ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ కాకండి. అన్నారు.
హీరోయిన్ సప్తమి గౌడ మాట్లాడుతూ – ఈ సినిమాలో రత్న అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ పాత్ర కోసం నన్ను సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారికి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ గారికి థ్యాంక్స్. రత్న క్యారెక్టర్ లో నేను బాగా నటించేందుకు సపోర్ట్ చేసిన డైరెక్షన్ టీమ్ అందరికీ థ్యాంక్స్. హీరో నితిన్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ మూవీ కోసం మేమంతా 2 ఇయర్స్ కష్టపడ్డాం. మరో మూడు రోజుల్లో మా మూవీ మీ ముందుకు వస్తోంది. “తమ్ముడు” సినిమాను థియేటర్స్ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ – “తమ్ముడు” మూవీలో నేను నటించగలను అని నాకంటే ఎక్కువ నమ్మిన వ్యక్తి మా డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు. ఈ పొట్టిపిల్ల ఏం చేస్తుందని అనుకోకుండా ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఏ మేకప్ లేకుండా ఫ్లైట్ దిగి శ్రీరామ్ గారి ఆఫీస్ కు వెళ్లాను. నన్ను చూసి ఇలా ఓకే అని క్యారెక్టర్ కు సెలెక్ట్ చేశారు. హీరో నితిన్ గారితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఎన్నో జోక్స్ చెప్పి ఆయనను విసిగించారు. లయ గారు స్వీట్ పర్సన్. ఆమె మాలాంటి ఎంతోమందికి ఇన్సిపిరేషన్. దిల్ రాజు గారు ఇటీవల దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేశారు. లక్షలాది మందికి ఆ ప్లాట్ ఫామ్ హోప్ ఇస్తుందని ఆశిస్తున్నా. అడవిలో షూటింగ్ చేస్తున్నప్పుడు మా కంటే టెక్నీషియన్స్ ఎక్కువ శ్రమించారు. వారికి థ్యాంక్స్ చెబుతున్నా. మనం కొన్ని సినిమాలు థియేటర్స్ లో మిస్సయితే బాధపడతాం. ఆ సినిమాలను థియేటర్స్ లోనే ఎక్సిపీరియన్స్ చేయాలి. అలా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమానే “తమ్ముడు”. అన్నారు.
నటి లయ మాట్లాడుతూ – ఈ మూవీ స్క్రిప్ట్ చెప్పినప్పుడు డిఫరెంట్ గా ఉందని అనుకున్నా. ఇలాంటి క్యారెక్టర్ నేను ఇప్పటిదాకా చేయలేదు. నా పర్సనల్ లైఫ్ లో కూడా ఇలాంటి ఎమోషన్స్ ఎక్సిపీరియన్స్ చేయలేదు. ఎందుకంటే మా ఇంట్లో నేను సింగిల్ చైల్డ్ ను. బ్రదర్స్, సిస్టర్స్ ఎవరూ లేరు. ఈ సినిమా కోసం 2 ఏళ్లు అయ్యింది అని అంటున్నారు. పదేళ్లు టైమ్ పట్టినా ఇలాంటి మంచి సినిమా పనిచేస్తాం. నా గత చిత్రాలు చూసి నన్ను ప్రేక్షకులు ఎంతగా అభిమానించారో, అదే ప్రేమను “తమ్ముడు” మూవీ మీద చూపిస్తారని కోరుకుంటున్నా. అన్నారు
నిర్మాత శిరీష్ మాట్లాడుతూ – “తమ్ముడు” మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమా జూలై 4న సాధించబోయే సక్సెస్ క్రెడిట్ మొత్తం శ్రీరామ్ వేణుకే దక్కాలి. ఈ సినిమాకు మేము పడిన కష్టం తక్కువ. ఈ సినిమా సక్సెస్ నీది. మనం ఘన విజయాన్ని అందుకోబోతున్నాం. ఇలాంటి వేదక మీదే మళ్లీ సెలబ్రేట్ చేసుకుందాం. నితిన్ కెరీర్ లో జయం, గుండెజారి గల్లంతయ్యిందే మూవీస్ సక్సెస్ కు ఎంత సంతోషపడ్డాడో, “తమ్ముడు” మూవీ విజయం అంతకు రెట్టింపు ఆనందాన్నిస్తుంది. ప్రొడ్యూసర్స్ గా మేము నితిన్ కు ఆ ప్రామిస్ ఇస్తున్నాం. అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – “తమ్ముడు” మూవీ ఔట్ పుట్ ఇంత బాగా రావడానికి టెక్నీషియన్స్ కష్టమే కారణం. డీవోపీ గుహన్ గారు, ఎడిటర్ ప్రవీణ్ పూడి, వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్, ఆర్ట్ చేసిన శేఖర్..ఇలా టెక్నీషియన్స్ శ్రీరామ్ వేణు విజన్ ను స్క్రీన్ మీదకు అద్భుతంగా తీసుకొచ్చారు. జై బగళాముఖీ పాటతో మా సినిమాకు ఒక వైబ్ వచ్చింది. ఆ పాట రాసిన జొన్నవిత్తుల గారికి థ్యాంక్స్. అజనీష్ లోకనాథ్ తన మ్యూజిక్ తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. మాతో శ్రీరామ్ వేణు సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ఏంటో మాకు పూర్తిగా తెలుసు. మా దగ్గర ఎంసీఏ, వకీల్ సాబ్ లాంటి సూపర్ హిట్స్ చేశాడు. ఆ మూవీస్ కు మా దగ్గర నుంచి ఏదైనా సపోర్ట్ తీసుకున్నాడేమో గానీ “తమ్ముడు” సినిమాకు మాత్రం తను సోలోగా కష్టపడ్డాడు. ఈ మూవీ సాధించబోయే సక్సెస్ క్రెడిట్ శ్రీరామ్ వేణుదే. కార్తీక్, సత్య..వీళ్లిద్దరు శ్రీరామ్ వేణుతో మొదటినుంచీ ట్రావెల్ చేస్తున్నారు. నితిన్ తో పాటు ఐదుగురు వుమెన్స్ లయ, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక, దిత్య..స్ట్రాంగ్ రోల్స్ చేశారు. వీళ్ల క్యారెక్టర్స్ ఎప్పటికీ గుర్తుంటాయి. నితిన్ తో పాటు వీళ్లు ఐదుగురినీ హీరోలుగా అనౌన్స్ చేయొచ్చు. అంత బాగా పర్ ఫార్మ్ చేశారు. నితిన్ గత కొన్ని చిత్రాలు సక్సెస్ కాలేదని బాధలో ఉన్నాడు. కానీ “తమ్ముడు” ఆయనకు కమ్ బ్యాక్ మూవీ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మా బ్యానర్ కు మరో హిట్ “తమ్ముడు” ఇవ్వబోతోంది. రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ చేశాం. చరణ్ తో సూపర్ హిట్ చేయలేకపోయామనే లోటు ఉంది. త్వరలోనే రామ్ చరణ్ తో ఓ సూపర్ హిట్ మూవీ చేయబోతున్నాం. త్వరలో ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాం. అన్నారు.
హీరో నితిన్ మాట్లాడుతూ – “తమ్ముడు” మూవీ జూలై 4న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా శ్రీరామ్ వేణు గారి కోసం, నా సినిమాలను ఇష్టపడే అభిమానులు, నాకు సక్సెస్ రావాలని కోరుకునేవారి కోసం ఘన విజయం సాధించాలి. నా గత చిత్రాలు మీకు ఆనందాన్ని కలిగించలేదు. కానీ ఈ సినిమా తప్పకుండా సంతోషపెడుతుంది. ఈ చిత్రం కోసం శ్రీరామ్ వేణు ఎంత కష్టపడ్డాడో జూలై 4న మాట్లాడతాను. నా గత మూవీస్ నిరాశపర్చాయి. ఇక నుంచి మంచి స్క్రిప్ట్స్ తో మీ ముందుకు వస్తానని ప్రామిస్ చేస్తున్నా. “తమ్ముడు” మూవీకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కు థ్యాంక్స్. అలాగే నా కో స్టార్స్ 80 డేస్ ఫారెస్ట్ లో షూటింగ్ చేశారు. అందులో సగం నైట్ షూట్స్, సగం డే షూట్స్ ఉంటాయి. అడవిలో జ్వరం వచ్చినా, ఫుడ్ పాయిజన్ అయినా, గాయాలు అయినా ఓర్చుకుని నటించారు. ఉదయం 7 గంటలకు షూట్ అంటే సెట్ లో టైమ్ కు ఉండేవారు. వీళ్లు లేకుంటే సినిమా కంప్లీట్ అయ్యేది కాదు. నేను కొంచెం దిగులుగా ఉంటే రాజు గారు శిరీష్ గారు నాకు బూస్ట్ ఇచ్చేలా మాట్లాడేవారు. ఇది థియేట్రికల్ గా మీకు మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చే సినిమా. జూలై 4న థియేటర్స్ కు వెళ్లి మూవీ చూడండి. అన్నారు.
డైరెక్టర్ శ్రీరామ్ వేణు మాట్లాడుతూ – రాజు గారు, శిరీష్ గారు నాకు ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్లు. నాకంటే “తమ్ముడు” సినిమాను ఎక్కువగా నమ్మిన వ్యక్తి శిరీష్ గారు. నేను ఎప్పుడైనా దిగాలుగా ఉంటే అన్నం ఉడికిందంటే ఒక మెతుకు చూస్తే చాలు ఈ సీన్ చాలు అద్భుతంగా చేశావ్ అంటూ ఎంకరేజ్ చేసేవారు. “తమ్ముడు” సినిమాను ఇలా థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ కోసం డిజైన్ చేశానని చెప్పినప్పుడు ప్రొడ్యూసర్స్ గా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. రాజు గారు బిజీ వల్ల మాకు టైమ్ కేటాయించకున్నా శిరీష్ గారు ప్రతిసారీ మా యోగక్షేమాలు కనుక్కునేవారు. మాకు కావాల్సింది ప్రొవైడ్ చేసేవారు. రాజుగారు, శిరీష్ గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నాను. హీరో నితిన్ గురించి చెప్పాలంటే ఈ సినిమా కోసం ప్రతి విషయంలో అన్ కండీషనల్ గా సపోర్ట్ చేశారు. నేను అనుకున్న క్యారెక్టర్ ను ఎంతో బాగా పర్ ఫార్మ్ చేశాడు. మా పాప దిత్య మూవీలో నటించింది. ఈ సినిమా షూటింగ్ లో నా వైఫ్, పాప నాతోనే ఉన్నారు. షూటింగ్ టైమ్ లో ఫ్యామిలీ మన దగ్గరే ఉంటే ఎంత సపోర్ట్ వస్తుందో నేను ఈ సినిమాకు ఎక్సిపీరియన్స్ చేశాను. ఈ మూవీలో మీరు కొత్త లయ గారిని చూస్తారు. ఆమె ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. వర్ష నాకు కూతురు లాంటిది. ఈ సినిమా కోసం కిక్ బాక్సింగ్ నేర్చుకుంది. ఈ మూవీ కోసం మెయిన్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరూ ఒక విద్య నేర్చుకున్నారు. ఈ సినిమాలో కీ రోల్స్ అన్నింటికీ యాక్షన్ పార్ట్ ఉంటుంది. ఈ సినిమాలోని ఫ్యామిలీ ఫిల్లర్ లాంటిది. వాళ్లమీదే ఎమోషన్ క్యారీ అవుతుంటుంది. డీవోపీలుగా చేసిన సేతు, సమీర్ రెడ్డి గారు, గుహన్ గారు బ్రిలియంట్ విజువల్స్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ సీన్స్ చూసి తను బాగా కనెక్ట్ అయ్యి బెటర్ మెంట్ కోసం రెండుసార్లు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. జూలై 4 తర్వాత “తమ్ముడు” మూవీ గురించి మాట్లాడుతాను. అన్నారు.
నటీనటులు – నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్, బేబీ శ్రీరామ్ దిత్య, తదితరులు
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ – కేవీ గుహన్
ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి
మ్యూజిక్ – అజనీష్ లోకనాథ్
పీఆర్వో – వంశీ కాకా, జీఎస్ కే మీడియా
బ్యానర్ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత – దిల్ రాజు, శిరీష్
రచన -దర్శకత్వం – శ్రీరామ్ వేణు