అన్నపూర్ణ స్టూడియోస్ పళ్ళబురుసు నుంచి హైలో హైలో హైలెస్సా సాంగ్ రిలీజ్

Shiva Gadi Zindagi Movie Title and Song Launched Grandly
The title and song of the upcoming Telugu film ‘Shiva Gadi Zindagi’, produced by Sindhu Surya under the banner of Aishwarya Cine Creations, were launched in a grand manner. Sachin Ram Pratap and Hasini Devarakonda are playing the lead roles, while Vinay Reddy Chandupatla is directing the film.
The movie’s title was launched by producer Suresh Babu, while the song was released by ReelOn CEO Dasaratham Bitla, Royal Enfield Dealer Principal Poola Sandeep Kumar Naidu, and senior journalist Shiva Mallala, who attended the event as chief guests. The guests congratulated the entire team and wished the film great success.
A Reflection of Every Common Man’s Life
‘Shiva Gadi Zindagi’ is being made as a blend of comedy, emotion, drama, friendship and love, offering a complete package of entertainment. The story revolves around the different situations, incidents and emotions that an ordinary person encounters in life.
The director has crafted the narrative in such a way that every scene has a strong reason, every character has significance, and every emotion has a meaningful connection. The film aims to present the ups and downs of life in a natural and relatable manner.
Speaking at the title and song launch, director Vinay Reddy Chandupatla said:
“‘Shiva Gadi Zindagi’ is not merely the story of one individual. It is a beautiful reflection of the life of every common person in our society. We have tried to portray the ups and downs of life, friendship, love and emotions in a very natural manner. I believe the story will connect with everyone.
I would like to extend my special thanks to Pavani Vasa for singing the song, which I wrote, with great emotion, and to Sai for providing wonderful music. My heartfelt thanks to all the chief guests who attended our title and song launch event and blessed our team.”
Producer Sindhu Surya said:
“This film, being produced under the banner of Aishwarya Cine Creations, is very special to us. Director Vinay Reddy Chandupatla is bringing his vision to the screen in a wonderful manner. Hero Sachin Ram Pratap, heroine Hasini Devarakonda, along with all the actors and technicians, are working extremely hard for the film.
JP Reddy’s cinematography and Sai’s music will be among the major attractions of the movie. We are making the film in a way that appeals to audiences across sections. We will bring this entertaining and emotionally engaging film before audiences soon.”
Actor Viva Reddy, who is part of the film, thanked the director and producer for giving him the opportunity. He said that the film would bring good recognition to everyone involved.
He added that the movie combines entertainment with situations that are close to everyday life and that its emotional content would touch the hearts of audiences.
Cast:
Sachin Ram Pratap, Hasini Devarakonda, Viva Reddy and others are part of the cast.
Technical Crew:
Banner: Aishwarya Cine Creations
Producer: Smt. Sindhu Surya
Hero: Sachin Ram Pratap
Heroine: Hasini Devarakonda
Writing, Direction & Lyrics: Vinay Reddy Chandupatla
Music: Sai
Cinematography: JP Reddy
Singer: Pavani Vasa
Co-Director: Krishna Prasad UppU
Assistant Director: Sanju Reddy
Production Support: David Studios (David Raju)
Publicity Designer: Viva Reddy
Music Label: Kisra
PRO: Ashok Dayyala
ఘనంగా ‘శివ గాడి జిందగీ’ మూవీ టైటిల్, సాంగ్ లాంచ్!
ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సింధుసూర్య నిర్మిస్తున్న నూతన చిత్రం ‘శివ గాడి జిందగీ’. సచిన్ రామ్ ప్రతాప్, హాసిని దేవరకొండ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి వినయ్ రెడ్డి చందుపట్ల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను నిర్మాత సురేష్‌బాబు లాంచ్ చేశారు. సాంగ్‌ను అతిథులుగా పాల్గొన్న రీల్ఆన్ సీఈఓ దాశరథం బిట్ల, రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్ ప్రిన్సిపల్ పూల సందీప్ కుమార్ నాయుడు, ప్రముఖ జర్నలిస్టు శివ మల్లాల విడుదల చేశారు. చిత్ర యూనిట్‌కు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రతి సగటు మనిషి జీవితానికి ప్రతిరూపం!
కామెడీ, ఎమోషన్, డ్రామా, ఫ్రెండ్షిప్, లవ్ వంటి అన్ని రకాల వినోద అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఒక సామాన్య మనిషి తన జీవితంలో ఎదుర్కొన్న రకరకాల పరిస్థితులు, సంఘటనలు, భావోద్వేగాల సమాహారంగా ఈ చిత్రం సాగనుంది. ప్రతీ సన్నివేశానికి ఒక బలమైన కారణం, ప్రతీ పాత్రకు ఒక ప్రాధాన్యత, ప్రతీ ఎమోషన్‌కు ఒక అనుబంధం ఉండేలా దర్శకుడు ఈ కథను మలచడం విశేషం.
లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు వినయ్ రెడ్డి చందుపట్ల మాట్లాడుతూ…
“‘శివ గాడి జిందగీ’ అనేది కేవలం ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు… ఇది మన సమాజంలోని ప్రతి సగటు మనిషి జీవితానికి ఒక చక్కటి ప్రతిరూపం. జీవితంలో వచ్చే ఎత్తుపల్లాలు, స్నేహం, ప్రేమ, భావోద్వేగాలను చాలా సహజంగా చూపే ప్రయత్నం చేశాం. ప్రతి ఒక్కరినీ ఈ కథ ఆకట్టుకుంటుంది. అలాగే నేను రాసిన పాటను భావయుక్తంగా పాడిన పావని వాస గారికి, అద్భుతమైన సంగీతాన్ని అందించిన సాయి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా టైటిల్, సాంగ్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన ముఖ్య అతిథులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.
నిర్మాత సింధు సూర్య మాట్లాడుతూ:
“ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది. దర్శకుడు వినయ్ రెడ్డి గారు అనుకున్న కథను చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. హీరో సచిన్ రామ్ ప్రతాప్, హీరోయిన్ హాసిని దేవరకొండలతో పాటు ప్రతీ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. జేపీ రెడ్డి గారి ఛాయాగ్రహణం, సాయి గారి సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రేక్షకులందరికీ నచ్చేలా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే మీ ముందుకు తీసుకువస్తాం” అని అన్నారు.
ఈ సినిమాలో నటిస్తున్న వివారెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా అందరికి మంచి పేరు తీసుకు వస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ప్రతి జీవితానికి దగ్గరగా ఉంటుంది. ప్రతి ఒక్కరి గుండెను టచ్ చేస్తుంది. ” అని అన్నారు.
నటీనటులు: . సచిన్ రామ్ ప్రతాప్, హాసిని దేవరకొండ, వివారెడ్డి, తదితరులు.
సాంకేతిక వర్గం (Cast & Crew):
బ్యానర్: ఐశ్వర్య సినీ క్రియేషన్స్ (Aishwarya Cine Creations)
నిర్మాత: శ్రీమతి సింధు సూర్య
హీరో: సచిన్ రామ్ ప్రతాప్
హీరోయిన్: హాసిని దేవరకొండ
రచన – దర్శకత్వం – సాహిత్యం: వినయ్ రెడ్డి చందుపట్ల
సంగీతం: సాయి
సినిమాటోగ్రఫీ: జేపీ రెడ్డి
గాయని: పావని వాస
కో-డైరెక్టర్: కృష్ణ ప్రసాద్ ఉప్పు
అసిస్టెంట్ డైరెక్టర్: సంజు రెడ్డి
ప్రొడక్షన్ సపోర్ట్: డేవిడ్ స్టూడియోస్ (డేవిడ్ రాజు)
పబ్లిసిటీ డిజైనర్: వివారెడ్డి
మ్యూజిక్ లేబుల్: కిస్రా
పీఆర్ఓ: అశోక్ దయ్యాల
