ప్రేక్షకుల మనసులని గెలిచి సక్సెస్ ఫుల్ గా 25 రోజులు పూర్తి చేసుకున్న
Senior film journalist Dheeraj Appaji, handed over financial assistance to victory fan Banot Srinivas
Banot Srinivas, a fan of actor Victory Venkatesh from Khammam, was seriously injured in an accident three months ago. Due to financial constraints, he could not afford expensive private hospital treatment and was in a critical condition.
The Andhra Pradesh Venkatesh Helping Hands team, led by founder member Karri Venkatesh, provided financial assistance of Rs. 35,000 to Banot Srinivas through senior film journalist Dheeraj Appaji. One of the founder members of Andhrapradesh Venkatesh Helping Hands, Karri Venkatesh, other die-hard fans of victory Venkatesh, Vaasam Mutthu, pericharla Ganapathiraju, and Annavaram participated in this charity event.
Karri Venkatesh spoke on the occasion, “This is the 20th program undertaken by the Andhra Pradesh Venkatesh Helping Hands team. We are providing support not only to our group members but also to all Venkatesh fans in need. We have formed this team by reducing unnecessary expenses at theaters and help fellow fans’ families.” He thanked Dheeraj Appaji for gracing the occasion!!
వెంకటేష్ అభిమానుల పాలిట సంజీవిని.. ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్
ఖమ్మంకి చెందిన బానోత్ శ్రీనివాస్ సినీ నటుడు విక్టరీ వెంకటేష్. వీరాభిమాని. ఆయనకి 3నెలల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖరీదైన ప్రావివేట్ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకునే స్తోమత లేకపోవడం వలన ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న “ఆంధ్ర ప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్” టీం తక్షణ కర్తవ్యంగా మానవతా దృక్పథంతో… సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు ధీరజ్ అప్పాజీ చేతుల మీదుగా 35000/- ఆర్ధిక సాయం అందించారు. హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన కర్రి వెంకటేష్ సారథ్యంలో వాసం ముత్తు, పెరిచర్ల గణపతి రాజు, అన్నవరం సమక్షంలో బాధితుడు భానోత్ శ్రీనివాస్ కి ఈ మొత్తాన్ని నగదు రూపంలో అందజేశారు.
ఈ సందర్భంగా కర్రి వెంకటేష్ మాట్లాడుతూ… “ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం చేపట్టిన 20వ కార్యక్రమం ఇది. మా గ్రూప్ లో వున్న సభ్యులుకే కాకుండా మానవత్వంతో కష్టాల్లో వున్న వెంకటేష్ అభిమానులకి కూడా హెల్పింగ్ హ్యాండ్స్ టీం సంపూర్ణ సహకారం అందిస్తున్నాం. థియేటర్స్ దగ్గర చేసే అనవసర ఖర్చులను తగ్గించుకొని, సాటి అభిమానుల కుటుంబాలకు సాయ పడాలన్న ఒక సంకల్పంతో ఈ టీం ఏర్పాటు చేసుకున్నాం. టీం సభ్యులందరూ ఒకే మాట మీద వుండటం వలన ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం” అని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన విచ్చేసిన ధీరజ అప్పాజీకి కృతజ్ఞతలు తెలిపారు!!