“Roti Kapda Romance” Paid Premieres from November 22 – Movie Releasing on Nov28
Prominent producer and head of Lucky Media, Bekkem Venugopal, known for youth-centric films like Hushaaru, Cinema Choopistha Mava, Mem Vayasuku Vacham, Prema Ishq Kaadhal, and Pagal, has collaborated with Srujan Kumar Bojja to produce the film Roti Kapda Romance. Directed by Vikram Reddy, the film features Harsha Narra, Sandeep Saroj, Tarun, Supraj Ranga, Sonu Thakur, Nuvveksha, Meghalekha, and Khushboo Choudhary in the lead roles.
Initially, the makers planned to release the movie on November 22. However, due to the unavailability of suitable theaters and with the intention of providing audiences a quality experience, the release has been rescheduled for a massive grand release on November 28.
The producers announced, “This youthful romantic entertainer is crafted to appeal to today’s youth. The film will now hit theaters on November 28, with paid premieres scheduled in major cities across both Telugu states starting November 22. We recently screened the film to a select group of viewers, including young audiences, and received overwhelmingly positive feedback.
A special screening for the media on Wednesday also garnered a great response. Many viewers remarked that they hadn’t seen such a feel-good love story in recent times, which made us immensely happy. The film has already earned positive reviews from critics, strengthening our confidence in its success.
We are excited to release this film on November 28 with the aim of reaching a wide audience. Without a doubt, Roti Kapda Romance will be recognized as one of the best feel-good love stories released in 2024.”
నవంబరు 28న రోటి కపడా రొమాన్స్ గ్రాండ్ విడుదల.. ఈ నెల 22 నుంచి గ్రాండ్ ప్రీమియర్స్
హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. తొలుత ఈ చిత్రాన్ని నవంబరు 22న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నారు మేకర్స్. అయితే ఓ మంచి చిత్రం చిత్రం అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాలనే సంకల్పంతో, థియేటర్స్ దొరకని కారణంగా చిత్రాన్ని ఈ నెల 28న మాసివ్ గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ”యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా, నేటి యూత్‌ను ఆకట్టుకునే అంశాలుతో రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేస్తున్నాం. ఈ నెల 22 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. ఇటీవల కొంత మంది సగటు ప్రేక్షకులకు, యూత్‌కు సినిమాను ప్రదర్శించాం. అందరికి నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. బుధవారం మీడియాకు వేసిన షోకు కూడా మంచి స్పందన వస్తోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీని చూడలేదు అని వాళ్లు ప్రశంసిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఓ మంచి చిత్రం అందరికి చేరువ కావాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని ఈ నెల 28న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. ముఖ్యంగా ఆల్రెడీ ఈ చిత్రానికి క్రిటిక్స్ నుండి మంచి రివ్యూలు వస్తున్నాయి. దీంతో మా చిత్ర విజయంపై మరింత నమ్మకం పెరిగింది. తప్పకుండా ఈ చిత్రం 2024లో విడుదలైన చిత్రాల్లో ఉత్తమ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా నిలుస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు.