Vijay Antony Badhrakali Releasing On September 5th Through Asian Suresh Entertainment

Paradha Releasing On August 22nd – Yatra Naryastu Song Unveiled
Director Praveen Kandregula of Cinema Bandi fame is coming up with another intriguing project Paradha, backed by the celebrated duo Raj and DK, known for The Family Man series. Raj recently delivered a blockbuster, alongside Samantha as producers with the movie Subham. Vijay Donkada bankroll the movie, alongside Sreenivasulu PV and Sridhar Makkuva on Ananda Media banner. Anupama Parameswaran plays the lead, alongside Darshana Rajendran, and Sangitha in other key roles. Rag Mayur also essays a pivotal role in the movie.
The makers who announced the film’s release date have also released the song called Yatra Naryastu. The movie Paradha will be hitting the screens on August 22nd. The release date poster shows Anupama Parameswaran, draped in a traditional saree, exudes fierce determination, while the serene presence of a goddess idol looms in the background, setting the tone for the film’s spiritual and emotional core.
Scored wonderfully by Gopi Sundar, Yatra Naryastu is a soul-stirring track that celebrates the strength and divinity of women. Deeply rooted in the concept of the divine feminine, the song reflects themes of resilience, ritual, and emotional endurance. Vanamali’s poignant lyrics paired with Anurag Kulkarni’s evocative vocals lend the song both emotional depth and spiritual gravitas.
Visually, the song delivers a moving portrayal. While villagers impose a heart-breaking tradition upon Anupama’s character, who appears in a white saree, embodying grief and fortitude, while her family mourns with heavy hearts. The scene powerfully captures societal challenges faced by women and sets the emotional tone for the narrative.
Paradha promises to be a hard-hitting yet uplifting tale, with its roots deep in tradition and its message firmly grounded in empowerment. The first song, glimpse, and other promotional material sparked enthusiasm for the movie.
The film has cinematography by Mridul Sujit Sen, while Dharmendra Kakarala is the editor.
Cast: Anupama Parmeswaran, Darshana Rajendran, Sangitha, Rag Mayur
Technical Crew:
Banner: Ananda Media
Director: Praveen Kandregula
Producers: Vijay Donkada, Sreenivasulu PV, Sridhar Makkuva
Executive Producer: Rohit Koppu
Music: Gopi Sundar
Lyrics: Vanamali
Writers: Poojitha Sreekanti, Prahaas Boppudi
Script Doctor: Krishna Prathyusha
DOP: Mridul Sujit Sen
Editor: Dharmendra Kakarala
Sound Design: Varun Venugopal
Art Director: Srinivas Kalinga
Costume Designer: Poojitha Tadikonda
PRO: Vamsi-Shekar
Publicity Designs: Anil & Bhanu
‘పరదా’ కంటెంట్ చాలా యూనిక్ గా ఉంది. యత్ర నార్యస్తు సాంగ్ అద్భుతంగా వుంది. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది: ప్రెస్ మీట్ లో హీరో సత్యదేవ్
-అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత, ప్రవీణ్ కాండ్రేగుల, విజయ్ డొంకడ, ఆనంద మీడియా ‘పరదా’ ఆగస్టు 22న థియేట్రికల్ రిలీజ్, యత్ర నార్యస్తు సాంగ్ లాంచ్
సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. రాజ్ ఇటీవల ‘శుభం’ సినిమాతో సమంతతో కలిసి బ్లాక్‌బస్టర్‌ను అందించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాగ్ మయూర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ యత్ర నార్యస్తు అనే పాటను కూడా లాంచ్ చేశారు. ‘పరధ’ సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్లో అనుపమ పరమేశ్వరన్ సాంప్రదాయ చీరలో కనిపించారు. బ్యాక్ డ్రాప్ లో దేవత విగ్రహం ఆధ్యాత్మిక, ఎమోషనల్ కోర్ ని యాడ్ చేసింది.
గోపి సుందర్ అద్భుతంగా స్వరపరిచిన యత్ర నార్యస్తు మహిళల బలం, దైవత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే ట్రాక్. మహిళల శక్తిని, పవిత్రతను స్ఫూర్తిదాయకంగా చూపిస్తూ.. దైవత్వాన్ని ప్రజెంట్ చేస్తోంది. వినిపించే ప్రతి లైన్ వెనక ఓ బలమైన భావం వుంది. వనమాలి రాసిన అర్థవంతమైన పదాలు, అనురాగ్ కులకర్ణి వోకల్స్.. పాటను భావోద్వేగాలతో నింపేస్తాయి.
పాటలో కనిపించే సన్నివేశాలు ఎంతో మనసుని కదిలించేలా వున్నాయి. తెలుపు చీర కట్టుకున్న అనుపమ పాత్రపై గ్రామస్తులు ఓ బాధాకరమైన సంప్రదాయాన్ని అమలు చేస్తారు. ఆమె కుటుంబం బాధతో కనిపిస్తుంది. ఈ సీన్ మహిళలు ఎదుర్కొంటున్న సమాజపు సమస్యల్ని స్పష్టంగా చూపిస్తూ, సినిమాకి భావోద్వేగతతో కూడిన టోన్‌ను ప్రజెంట్ చేస్తోంది.
పరదా సినిమా సంచలనకరమైన కథను చెప్పబోతుందని టీజర్, పాట, ప్రమోషన్స్ చూస్తే అర్థమవుతోంది. ఫస్ట్ సాంగ్, గ్లింప్స్, మిగతా ప్రమోషనల్ మెటీరియల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రాఫర్‌గా, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
రిలీజ్ డేట్ అండ్ సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్ కి హీరో సత్యదేవ్, నిర్మాత సురేష్ బాబు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ప్రెస్ మీట్ లో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఆగస్టు 22న ఈ సినిమా వస్తుంది. చాలా అద్భుతమైన డేట్ అది. కచ్చితంగా సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది. సురేష్ బాబు గారు మంచి సినిమాని ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. ఈ సినిమా నిర్మాతలతో నేను ఇంతకుముందు ఒక సినిమా చేశాను. చాలా పాషన్ అన్న ప్రొడ్యూసర్స్. ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు డైరెక్టర్ ప్రవీణ్ కి ఈ సినిమా మరెన్నో అద్భుతమైన అవకాశాల్ని తీసుకొస్తుంది. అనుపమ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఈ సాంగ్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. అందరికీ విష్ యు ఆల్ ద వెరీ బెస్ట్. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూడండి. ఇలాంటి సినిమాలు సపోర్టు చేయాలని కోరుకుంటున్నాను’అన్నారు.
ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. మనం జీవితంలో ముందువెళ్తున్న కొద్ది భయం మోటివేషన్ అనే రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి. విజయ్ తీస్తున్నప్పుడు ఎందుకంత రిస్క్ చేస్తున్నారు అనే భయం ఉండేది. ఈ సినిమా ట్రైలర్ చూపించాడు. షాక్ అయ్యాను. అంత అద్భుతంగా తీశారు. తర్వాత సినిమా చూస్తానని చెప్పా.ను సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. ఒక కొత్త రకమైన కథ చెప్పాలి అనే తపన కనిపించింది. ఇలాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు. చాలా ఎక్స్పెన్సివ్ సినిమా ఇది. ఇంత అద్భుతమైన విజువల్స్ తో మంచి నటీనటులతో సినిమా తీసినందుకు నిర్మాతలకు అభినందనలు. అనుపమ, దర్శన… ఈ సినిమాలో ఉన్న అందరూ అద్భుతంగా పెర్ఫాం చేశారు. టీమ్ అందరికీ విష్ యు ఆల్ ది వెరీ. ఆగస్టు 22న ఈ సినిమా వస్తుంది. మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అందరూ వచ్చి సినిమాని చూడాలని కోరుతున్నాము’అన్నారు
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన సత్యదేవ్ గారికి సురేష్ బాబు గారికి థాంక్యూ వెరీ మచ్. ఇది చిన్న సినిమా అంటున్నారని ఈ సినిమా ద్వారా మేము చెప్పదలుచుకున్న కంటెంట్ చాలా పెద్దది. ఇందులో చాలా కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి. మీరు తప్పకుండా సినిమా చూడండి. అది మీకు అర్థమవుతుంది. ఆగస్టు 22న ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. ఫైనల్ గా సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరుపేరునా థాంక్యూ సో మచ్. ఇది చాలా బోల్డ్ స్టెప్. ఇలాంటి సపోర్ట్ లేకపోతే మేము ఏమి చేయలేం. పరదా సినిమాని మీరందరూ కూడా బిగ్ స్క్రీన్ లో చూడాలనేది మా డ్రీమ్. ఒక స్టిరియోటైప్ బ్రేక్ చేయడం మా అందరి అల్టిమేట్ గోల్. దానికి మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా చూడండి. కచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. థాంక్యూ వెరీమచ్’అన్నారు.
ప్రొడ్యూసర్ విజయ్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఓ బేబీ సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు సురేష్ ప్రొడక్షన్లో పనిచేస్తున్నాను అని ఆనందపడ్డాను. సురేష్ బాబు గారి దగ్గర డైరెక్ట్ గా ఇండైరెక్టుగా చాలా విషయాలు నేర్చుకున్నాను. సురేష్ బాబు గారితో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. సత్య వెరీ టాలెంటెడ్ యాక్టర్. సురేష్ బాబు గారు సత్య ఇద్దరు కూడా ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాటకు వనమాలి గారు గోపి సుందర్ అనురాగ్ అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు. అనుపమ ఒప్పుకోకపోతే ఈ సినిమా ఉండేది కాదు. దర్శన, సంగీత గారికి థాంక్యూ. డైరెక్టర్ ప్రవీణ్ అద్భుతంగా సినిమా తీశారు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’అన్నారు.
ప్రొడ్యూసర్ శ్రీధర్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. సురేష్ బాబు గారు ఈ కార్యక్రమానికి రావడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. సత్యదేవ్ గారు మాకు చాలా సన్నిహితుడు. మా మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ఆయన ఈవెంట్ కు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇష్టంగా చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. మూడేళ్ల ప్రయాణం. చాలా మంచి డేట్ కి సినిమా వస్తోంది. ఈ సినిమా ప్రయాణంలో సురేష్ బాబు గారు మాకు చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు. ఇలాంటి సినిమాలు రావాలంటే ఖచ్చితంగా అలాంటి పెద్దల సహాయ సహకారాలు ఉండాలి. ఆయన సపోర్ట్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అనుపమ గారికి సంగీత గారికి దర్శన రాజేంద్ర గారికి గోపి సుందర్ గారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్ డే ఆగస్టు 22న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇది మాకు చాలా మెమొరబులిటీ. తప్పకుండా మీరందరూ సినిమాని ఆశీర్వదించి గొప్ప విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’అన్నారు.
డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడుతూ… ఆగస్టు 22 మన మెగాస్టార్ గారి బర్త్‌డే. అంతకుమించి మంచి డేట్ దొరకదు. సురేష్ బాబు గారికి థాంక్యూ సో మచ్. సురేష్ బాబు గారు మాకు ఇన్స్పిరేషన్. సురేష్ బాబు గారికి సినిమాలు అంత ఈజీగా నచ్చవు. కానీ ఈ సినిమా చూసి కంట్లో నీరు పెట్టుకున్నారు. సత్యదేవ్ గారు సాంగ్ ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. గోపీసుందర్ గారు అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. ఈ సినిమాలో పాటలన్నీ మనసుకి హత్తుకుంటున్నాయి. సినిమా బండి, శుభం తర్వాత ఈ సినిమా నాకు చాలా పెద్ద ఫిల్మ్. చాలా హానెస్ట్ గా ఈ సినిమా చేశాం. చాలా ఇంట్రెస్టింగ్ ఫిలి. మాకిది బాహుబలి లాంటి సినిమా. తప్పకుండా మా సినిమాని మీరందరూ ఎంకరేజ్ చేస్తారని మన ఆశిస్తున్నాను. థాంక్యూ సో మచ్’అన్నారు,. మూవీ యూనిట్ అంతా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.
తారాగణం: అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: ఆనంద మీడియా
దర్శకత్వం: ప్రవీణ్ కాండ్రేగుల
నిర్మాతలు: విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రోహిత్ కొప్పు
సంగీతం: గోపీ సుందర్
సాహిత్యం: వనమాలి
రచయితలు: పూజిత శ్రీకాంతి, ప్రహాస్ బొప్పూడి
స్క్రిప్ట్ డాక్టర్: కృష్ణ ప్రత్యూష
డీవోపీ: మృదుల్ సుజిత్ సేన్
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
సౌండ్ డిజైన్: వరుణ్ వేణుగోపాల్
ఆర్ట్ డైరెక్టర్: శ్రీనివాస్ కళింగ
కాస్ట్యూమ్ డిజైనర్: పూజిత తాడికొండ
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను