Narne Nithin in Dussehra race with Sri Sri Sri Rajavaru
Narnne Nithin is speeding ahead with hit youthful entertainer films like “Mad” and “Ayy.” Entering the film industry as the brother-in-law of NTR, Narnne Nithin is now looking for a hat trick with his streak of hits. Directed by national award-winning director Satish Vegesna, known for “Shatamanam Bhavati,” he is starring in the film “Sri Sri Sri Rajavaru.” The film features Sampada as the female lead and is produced by Chintapalli Rama Rao under the Sri Vedakshara Movies banner. This action entertainer, packed with all commercial elements, is set to release as a Dussehra gift to the audience.
Producer Chintapalli Rama Rao shared that their hero, Narnne Nithin, has recently been delivering feel-good, youthful entertainer movies with consistent success. However, their movie will be different, being a full-fledged commercial film with a large star cast, directed by Satish Vegesna, who selected this story with NTR’s approval. The director has ensured that the film meets all expectations, without any compromises. They strongly believe that this Dussehra, Narnne Nithin will achieve a hat trick hit, similar to “Ayy” and “Mad.”
The film also stars Rao Ramesh, Naresh, Raghu Kunche, Praveen, Racha Ravi, Sarayu, Ramya, Priya Machiraju, Bhadram, Anand, and Jabardasth Nagi in other roles. The music is composed by Kailash Menon, with cinematography by Damu Narravula, editing by Madhu, lyrics by Sreemani, publicity design by Eshwar, PR by B. Veerababu, and presentation by Rangapuram Raghavendra and Murali Krishna Chintalapati. The executive producers are CH. V. Sharma and Rajeev Kumar, with producers Chintapalli Rama Rao and M. Subbareddy. The film is written and directed by Satish Vegesna.
దసరా బరిలో నార్నె నితిన్ శ్రీ శ్రీ శ్రీ రాజావారు
మ్యాడ్, ఆయ్ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల హిట్ తో దూసుకుపోతున్నారు నార్నె నితిన్. చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్… వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఇదే ఊపుతో ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. జాతీయ అవార్డు విన్నర్ , “శతమానం భవతి” దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తాజాగా శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకులకు ముందుకు రానుంది.
ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ… ‘మా చిత్ర హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి ఫీల్ గుడ్, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్నారు. వీటికి భిన్నంగా మా సినిమా వుంటుంది. పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో భారీ తారాగణంతోతెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న.ఎన్టీఆర్ ఎంతో మెచ్చి… ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా ఈ దసరాకి నార్నె నితిన్ ఖాతాలోఆయ్ , మ్యాడ్ తరహాలో హ్యాట్రిక్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం. అని అన్నారు.
ఈ చిత్రంలో రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి సంగీతం: కైలాష్ మీనన్, కెమెరా: దాము నర్రావుల, ఎడిటర్: మధు, పాటలు: శ్రీమణి, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్, పిఆర్వో: బి. వీరబాబు, సమర్పణ: రంగాపురం రాఘవేంద్ర, మురళీ కృష్ణ చింతలపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: CH. V. శర్మ, రాజీవ్ కుమార్, నిర్మాతలు: చింతపల్లి రామారావు, ఎమ్.సుబ్బారెడ్డి, రచన – దర్శకత్వం: సతీష్ వేగేశ్న