వాసు క్యారెక్టర్ తో ఆడియన్స్ డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు – హీరో
‘Naa Nireekshana’ Movie Launched grandly
Renowned producers Suresh Babu and Dil Raju launched the upcoming film “Naa Nireekshana” under the banner of Peacock Movie Makers. The movie, produced by Santhosh Reddy, features Amardeep as the hero and Lishi Ganesh Kallapu as the heroine, with Sai Varma Datla as the director.
On the auspicious occasion of Dussehra, the film’s pooja ceremony was held in a grand manner. Dil Raju, Suresh Babu, and Raja Ravindra graced the event as chief guests. Suresh Babu inaugurated the proceedings, while Dil Raju clapped for the mahurat shot and Raja Ravindra handed over the script. Producer Ganapathi Reddy switched on the camera. Addressing the gathering, Suresh Babu wished the team all the best for “Naa Nireekshana.”
Director Sai Varma Datla says, ” Thanks to Suresh Babu garu, Dil Raju garu, and Raja Ravindra garu for blessing the team attending the event on the eve of Dussehra. Although I cannot reveal the story now, I assure you that we’re making a good film.”
Hero Amardeep said, “This is my second film as a lead. This is the first script I have selected after Bigg Boss. The director and producers worked on this project for seven months. The project came this far because of them only. I’m thankful for this opportunity.”
Heroine Lishi Ganesh Kallapu said,” This is my second film. I thank the director and producers for the role and seek the audience’s blessings.”
Chaitanya Varma said, ” Thanks to Suresh Babu garu, Dil Raju garu and Raja Raveendra garu for giving us their blessings. You have seen me in Hit, Jhansi and Surrender films. I got a very good role in this film. I hope the audience will love our film.”
Other key crew members include Tirumalesh Bandaru as dialogue writer, V. Ravi Kumar as cinematographer, and Shekhar Chandra as music director.
Cast:
Amardeep Chowdary, Chaitanya Varma, Lishi Ganesh Kallapu, Ramya Priya and Others
Crew:
Banner: Peacock Movie Makers
Producer: P. Santosh Reddy
Story-Screenplay-Direction: Sai Varma Daatla
Dialogues: Tirumalesh Bandaru
Cinematographer: V. Ravi Kumar
Music Director: Sekhar Chandra
PRO: Mohan Thummala, Chandra Vattikuti
ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు చేతుల మీదుగా లాంచనంగా ప్రారంభమైన పికాక్ మూవీ మేకర్స్ బ్యానర్ ‘నా నిరీక్షణ’ చిత్రం
పికాక్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద పి. సంతోష్ రెడ్డి నిర్మాణంలో అమర్ దీప్ హీరోగా, లిషి గణేష్ కల్లపు హీరోయిన్గా సాయి వర్మ దాట్ల దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం ‘నా నిరీక్షణ’. దసరా సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా జరిగాయి. నా నిరీక్షణ మూవీ పూజా కార్యక్రమాలకు దిల్ రాజు, సురేష్ బాబు, రాజా రవీంద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
సురేష్ బాబు ఆశీస్సులతో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ కొట్టగా.. రాజా రవీంద్ర స్క్రిప్ట్ అందజేశారు. నిర్మాత గణపతి రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ ..నా నిరీక్షణ చిత్రానికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇంకా..
డైరెక్టర్ సాయి వర్మ దాట్ల మాట్లాడుతూ.. ‘దసరా పండుగ అయినా మా టీంను ఆశీర్వదించేందుకు వచ్చిన సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, రాజా రవీంద్ర గారికి థాంక్స్. సినిమా కథ గురించి ఇప్పుడే చెప్పలేను కానీ ఓ మంచి చిత్రాన్ని అయితే తీస్తున్నాను’ అని అన్నారు.
అమర్ దీప్ మాట్లాడుతూ.. ‘హీరోగా ఇది నా రెండో చిత్రం. బిగ్ బాస్ తరువాత సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ స్క్రిప్ట్ ఇది. దర్శక, నిర్మాతలు ఈ మూవీ మీదే ఏడు నెలలు పని చేశారు. వారి వల్లే ఈ మూవీ ఇక్కడికి వరకు వచ్చింది.నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చిన వారికి థాంక్స్’ అని అన్నారు.
లిషి గణేష్ కల్లపు మాట్లాడుతూ.. ‘ఇది నా రెండో చిత్రం. ఇంత మంచి పాత్రను తనకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఆడియెన్స్ మా సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
చైతన్య వర్మ మాట్లాడుతూ.. ‘మా చిత్రాన్ని ఆశీర్వదించేందుకు వచ్చిన సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, రాజా రవీంద్ర గారికి థాంక్స్. ఇది వరకు నన్ను హిట్, ఝాన్సీ, సరెండర్ వంటి సినిమాల్లో చూశారు. ఈ చిత్రంలో నాకు మంచి పాత్ర లభించింది. మా చిత్రాన్ని ఆడియెన్స్ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ఈ చిత్రానికి తిరుమలేష్ బండారు మాటలు అందిస్తుండగా.. వి.రవి కుమార్ కెమెరామెన్‌గా పని చేయనున్నారు. శేఖర్ చంద్ర సంగీత సారథ్యంలో ఈ మూవీ రానుంది.
నటీనటులు: అమర్దీప్ చౌదరి, చైతన్య వర్మ, లిషి గణేష్ కల్లపు, రమ్య ప్రియ తదితరులు
సాంకేతిక నిపుణులు:
బ్యానర్ : పీకాక్ మూవీ మేకర్స్
నిర్మాత : పి.సంతోష్ రెడ్డి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం :సాయి వర్మ దాట్ల
మాటలు : తిరుమలేష్ బండారు
కెమెరామెన్ : వి.రవి కుమార్
సంగీత దర్శకుడు : శేఖర్ చంద్ర
PRO : మోహన్ తుమ్మల, చంద్ర వట్టికూటి