Marrichettu Kinda Manollu movie opening ceremony held grandly
Under the banner of Sri Naarasimha Chitralaya, the film “Marrichettu Kinda Manollu” was officially launched with a pooja ceremony at Sarathi Studios. Directed by Naresh Varma Mudham, the movie features Promod Deva, Ranadeer, Keerthana Swargam, and Muskaan Rajender in the lead roles. Senior actor Babu Mohan gave the first clap, and the camera was switched on by artist Nag Mahesh. The event was graced by prominent industry figures like Thirtieth Years Prithvi, Rajeev Kanakala, TFCC President Damodar Prasad, producer C. Kalyan, and TMAA President Rashmi Thakur, who extended their best wishes to the team.
Highlights from the Event
Actor Babu Mohan
“The banner, title, and director—all are powerful assets for this film. The name Sri Naarasimha Chitralaya itself conveys strength and positivity. Marrichettu Kinda Manollu is an excellent title. I’m also acting in this movie, and I’m confident it will be a big hit. Best wishes to the entire team.”
Director Naresh Varma Mudham
“This film is being made with an engaging subject that will entertain everyone. The title Marrichettu Kinda Manollu has already received a positive response. Even before the launch, this movie has created buzz among audiences. I urge everyone to support and encourage this project.”
Actor Thirty Years Prithvi
“It’s a joy to attend this launch with fellow senior actors like Babu Mohan. I hope the film achieves grand success. Best wishes to the entire team.”
Co-Producer Akula Rishendra Narasayya
“This is a story that provides proper guidance to the youth. My son, Promod Deva, is debuting as one of the heroes in this movie. Thank you to all the esteemed guests for attending the launch.”
Co-Producer Bisu Chander Goud
“Everyone has memories associated with a banyan tree. This film revolves around the concept of a banyan tree, which will surely resonate with audiences. This is a subject with the potential to become a landmark film. We are consistently producing films, and this project carries a positive wave that ensures a super hit.”
Actor Gharshana Srinivas
“Director Naresh Varma is crafting this film with a brilliant concept. I wish for its massive success.”
Heroes Promod Deva and Ranadeer
“It’s exciting to be part of such a unique project. We are grateful to director Naresh Varma for this opportunity. Following in the footsteps of our parents, we aim to fulfill their dreams.”
Heroines Keerthana Swargam and Muskaan Rajender
“This movie will undoubtedly be a great help to our careers. We are thankful to the director and producers for giving us this opportunity.”
Cast & Crew
Lead Cast:
Promod Deva, Ranadeer, Keerthana Swargam, Muskaan Rajender, Lirisha, Prabhavati (of Baby fame), Babu Mohan, Annapurnamma, Kunthi Srinivas, Nag Mahesh, Appaji, Raghu Babu, Sunitha Manohar, Ashok Kumar, Gharshana Srinivas, Duvvasi Mohan, Ramesh Chinna, Sammeta Gandhi, Prithvi, and others.
Banner: Sri Naarasimha Chitralaya
Producers: Sri Naarasimha Chitralaya and Team
Story-Screenplay-Direction: Naresh Varma Mudham
Co-Producers: Akula Rishendra Narasayya, Bisu Chander Goud
DOP: Vinod K. Singham
Music Director: Arham
Editor: Pawan Shekar
Production Executive: Balaram Prasad
PROs: Kadali Rambabu, Dayyala Ashok
ఘనంగా ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’ మూవీ ప్రారంభోత్సవం
శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేందర్ హీరోహీరోయిన్లుగా “మర్రిచెట్టు కింద మనోళ్ళు” మూవీ సారథి స్టూడియోలో పూజ కార్యక్రమంతో ప్రారంభమైంది. సీనియర్ నటుడు బాబు మోహన్ నటీనటులపై క్లాప్ కొట్టారు. ఆర్టిస్టు నాగ మహేష్. కెమెరా స్విఛాన్ చేశారు. థర్టీ ఇయర్స్ పృథ్వీ, రాజీవ్ కనకాల, తెలుగు ఫిలించాంబర్ అధ్యక్షలు దామోదర ప్రసాద్, నిర్మాత సీ కళ్యాణ్, టీ ఎం ఏ ఏ ప్రెసిడెంట్ రష్మీ ఠాగుర్ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా నటుడు బాబుమోహన్ మాట్లాడుతూ.. “బ్యానర్, టైటిల్, డైరెక్టర్.. ఇలా ఈ సినిమాకు అన్నీ పవర్ ఫుల్‌గానే ఉన్నాయి. బ్యానర్ నారసింహుడి పవర్ఫుల్ రూపాన్ని చూపించడం సినిమాపై పాజిటివ్ పెంచుతుంది. “మర్రిచెట్టు కింద మనోళ్ళు” చాలా మంచి టైటిల్. నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నమ్మకం ఉంది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్.” అని అన్నారు.
దర్శకుడు నరేష్ వర్మ ముద్దం మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరిని అలరించే విధంగా ఒక మంచి సబ్జెక్టుతో చేస్తున్న చిత్రమిది. “మర్రిచెట్టు కింద మనోళ్ళు” టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రారంభానికి ముందే ఈ సినిమా జనాల్లోకి వెళ్లిపోయింది. ఈ సినిమాను సపోర్టు చేసి, ఆదరించాలని అందరిని కోరుకుంటున్నాను.” అని అన్నారు.
థర్టీ ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ… “ఈ సినిమా ప్రారంభోత్సవానికి నా తోటి సీనియర్ నటుడు బాబు మోహన్ వంటి వారితో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉంది. ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. చిత్రయూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్.” అని అన్నారు.
సహ నిర్మాత ఆకుల రిషేంద్ర నరసయ్య మాట్లాడుతూ.. “యువతకు సరైన దిశ నిర్దేశం చేసే సబ్జెక్ట్ ఇది. ఇప్పటికే ఈ సినిమా పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది. ఇందులో మా కొడుకు ప్రమోద్ దేవా ఒక హీరోగా నటిస్తున్నాడు. సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరికి ధన్యవాదాలు.” అని అన్నారు.
సహ నిర్మాత బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ.. “మర్రి చెట్టు తెలియని వారు ఉండరు. జీవితంలో ప్రతి ఒక్కరికి మర్రిచెట్టుతో జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి మర్రి చెట్టు కాన్సెఫ్టుతో రానున్న ఈ సినిమా అందరిని అలరించడం ఖాయం. ఇండస్ట్రీలో ఒక మంచి సినిమాగా నిలబడే దమ్మున్న సబ్జెక్టు ఇది. వరుసగా సినిమాలు చేస్తున్నాము. ఈ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులకు ధన్యవాదాలు. పాజిటివ్ వేవ్‌తో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం.” అని అన్నారు.
ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “దర్శకుడు నరేష్ వర్మ మంచి కాన్సెఫ్టుతో సినిమా చేస్తున్నాడు. సినిమా భారీ హిట్ కావాలని కోరుకుంటున్నాను.” అని అన్నారు.
హీరోలు ప్రమోద్ దేవా, రణధీర్ మాట్లాడుతూ.. “ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో అవకాశం రావడం ఆనందంగా ఉంది. దర్శకుడు నరేష్ వర్మకు కృతజ్ఞతలు. తల్లిదండ్రులు చూపిన బాటలో నడుస్తూ వారి ఆశలు నిజం చేస్తాం.” అని అన్నారు.
హీరోయిన్లు కీర్తన స్వర్గం ముస్ఖాన్ రాజేందర్ మాట్లాడుతూ.. “కెరీర్‌కు మంచి హెల్ఫ్ అయ్యే సినిమా అని ఖచ్చితంగా చెప్పగలను. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు కృతజ్ఞతలు.” అని అన్నారు.
Cast & Crew
నటీనటులు:
ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన, ముస్ఖాన్ రాజేందర్, లిరిషా, ప్రభ( బేబీ ఫేమ్ ), బాబు మోహన్, అన్నపూర్ణమ్మ, కుంతి శ్రీనివాస్, నాగ మహేష్, అప్పాజీ, రఘుబాబు, సునీతా మనోహర్, అశోక్ కుమార్, ఘర్షణ శ్రీనివాస్, దువ్వాసి మోహన్, రమేష్ చిన్నా, సమ్మెట గాంధీ, పృథ్వీ తదితరులు.
బ్యానర్ పేరు: శ్రీ నారసింహ చిత్రాలయ
నిర్మాత: శ్రీ నారసింహ చిత్రాలయ అండ్ టీమ్
కథ -స్క్రీన్ ప్లే – దర్శకత్వం:
నరేష్ వర్మ ముద్దం
సహ నిర్మాతలు:
ఆకుల రిషేంద్ర నరసయ్య,
బీసు చందర్ గౌడ్
డీవోపీ: వినోద్ కే సినగం
సంగీత దర్శకుడు: అర్హమ్
ఎడిటర్: పవన్ శేఖర్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బలరాం ప్రసాద్
పీఆర్వోలు: కడలి రాంబాబు, దయ్యాల అశోక్.