మోడ్రన్ గా వుండే నేటి ట్రెండ్ కు తగిన అమ్మాయిని – కావ్యథాపర్
Mahisha teaser has received a huge response – Ready for Release
The film “Mahisha,” starring Praveen K.V., Yashika, Prithviraj, Vaishnavi, and Maunika, is directed by Praveen K.V. under the Screenplay Pictures banner. The film has completed all its processes, including censor certification, and is gearing up for a grand theatrical release soon. The recently released teaser has received a huge response, prompting the film’s team to hold a press meet.
Music Director Sri Venkat: “Director Praveen has blended various genres to create an engaging film. ‘Mahisha’ addresses contemporary issues faced by women and includes all the elements that appeal to audiences. The music has received a positive response, and our teaser has reached many viewers, garnering good views. I’m confident the film will resonate with everyone.”
Director and Hero Praveen K.V.: “Our entire team has worked hard on ‘Mahisha.’ We received a UA certificate from the censor board, and they appreciated our film. It’s challenging for small films to reach audiences, and media support is crucial for that. Our teaser has received almost two lakh genuine views, indicating that it has resonated with viewers. Vijay Raj, who plays the villain, is sure to gain recognition from this film. We’re ready for the release and are confident that ‘Mahisha’will entertain while delivering a strong message. We hope audiences support our film.”
Actress Srilatha: “I played an important role in ‘Mahisha’ and hope it brings me recognition as an actress. Director Praveen and cinematographer Satish were very supportive. Please watch and support ‘Mahisha’ in theaters soon.”
Actor Vijay Raj: “I portrayed the villain in ‘Mahisha,’ and since the teaser release, I’ve received a lot of recognition. I’ve been praised for my performance, and it’s all thanks to Director Praveen. I believe the film will resonate with everyone.”
Actress Maunika: “I thank Director Praveen for the opportunity to act in ‘Mahisha.’ We all worked as a team, and everyone put in effort for the film’s success. I hope audiences support our film with good content.”
Actor P. Ramana Reddy: “Thank you to everyone supporting ‘Mahisha.’ I have a significant role in this film, and the response to everything we’ve released so far has been positive. Everyone is saying the teaser is good, and we hope to receive the same positive response in theaters.”
Cast: Praveen K.V., Yashika, Prithviraj, Vaishnavi, Maunika, Vijay, P. Ramana Reddy, and others.
Technical Team:
Banner: Screenplay Pictures
Music: Sri Venkat
Cinematography: Vivek, Satish
Editor: Nagu
PRO: B.veerababu
Director: Praveen.k.v
- వైభవంగా “మహీష” సినిమా టీజర్ సక్సెస్ మీట్, త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ*
ప్రవీణ్ కె.వి., యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి, మౌనిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “మహీష”. ఈ చిత్రాన్ని స్క్రీన్ ప్లే పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు ప్రవీణ్ కేవి రూపొందిస్తున్నారు. మహీష సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ మాట్లాడుతూ – మహీష చిత్రాన్ని వివిధ జానర్స్ కలిపి ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు ప్రవీణ్. ఇందులో ప్రెజెంట్ మహిళల మీద జరుగుతున్న ఘటనల అంశాలతో పాటు ప్రేక్షకులకు నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మహీష మూవీలో మంచి మ్యూజిక్ చేసే అవకాశం కలిగింది. పాటలకు రెస్పాన్స్ బాగుంది. అలాగే రీసెంట్ గా రిలీజ్ చేసిన మా మూవీ టీజర్ చాలా మందికి రీచ్ అయ్యింది. మంచి వ్యూస్ దక్కుతున్నాయి. సినిమా కూడా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. అన్నారు.
దర్శకుడు, హీరో ప్రవీణ్ కె.వి. మాట్లాడుతూ – మహీష సినిమాను మా టీమ్ అంతా ఎంతో కష్టపడి రూపొందించాం. సెన్సార్ యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. మంచి సినిమా చేశారంటూ సెన్సార్ వాళ్లు అభినందించారు. చిన్న సినిమాలు ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా చేయడం కష్టం. మీ మీడియా సపోర్ట్ ఉంటేనే అది సాధ్యం. రీసెంట్ గా రిలీజ్ చేసిన మా మూవీ టీజర్ కు దాదాపు రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. ఇవి జెన్యూన్ వ్యూస్. ఇది పెద్ద నెంబర్ కాకపోవచ్చు కానీ మా మహీష సినిమా టీజర్ ప్రేక్షకులకు నచ్చిందని చెప్పేందుకు ఈ వ్యూస్ నిదర్శనం. మా సినిమాలో విలన్ గా చేసిన విజయ్ రాజ్ గారికి మంచి పేరొస్తుంది. మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ కు రెడీగా ఉన్నాం. త్వరలోనే మూవీని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తాం. మహీష సినిమాలో మంచి మేసేజ్ తో పాటు ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. ప్రేక్షకులు మా మహీష మూవీని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
నటి శ్రీలత మాట్లాడుతూ – మహీష మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేశాను. నటిగా నాకు ఈ సినిమా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా. డైరెక్టర్ ప్రవీణ్, సినిమాటోగ్రాఫర్ సతీష్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. త్వరలోనే థియేటర్స్ లో మహీష మూవీని చూసి ఆదరించండి. అన్నారు.
నటుడు విజయ్ రాజ్ మాట్లాడుతూ – మహీష మూవీలో విలన్ క్యారెక్టర్ లో నటించాను. మా సినిమా టీజర్ రిలీజ్ తర్వాత నాకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. బాగా నటించాననే ప్రశంసలు వస్తున్నాయి. డైరెక్టర్ ప్రవీణ్ గారి వల్లే ఈ రోల్ ఇంత బాగా చేయగలిగాను. మహీష సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. అన్నారు.
నటి మౌనిక మాట్లాడుతూ – మహీష మూవీలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ప్రవీణ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాకు మేమంతా టీమ్ వర్క్ చేశాం. సినిమా బాగా వచ్చేందుకు ప్రతి ఒక్కరం కష్టపడ్డాం. మంచి కంటెంట్ తో వస్తున్న మా మహీష చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు పి.రమణా రెడ్డి మాట్లాడుతూ – మహీష సినిమాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ లో కనిపిస్తాను. ఇప్పటిదాకా మా మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్ బాగుందని అందరూ చెబుతున్నారు. ఇదే పాజిటివ్ రెస్పాన్స్ థియేటర్ లోనూ దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
నటీనటులు – ప్రవీణ్ కె.వి., యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి, మౌనిక, విజయ్, పి.రమణా రెడ్డి, తదితరులు
టెక్నికల్ టీమ్
బ్యానర్ – స్క్రీన్ ప్లే పిక్చర్స్
మ్యూజిక్ – శ్రీ వెంకట్
సినిమాటోగ్రఫీ – వివేక్, సతీష్
ఎడిటర్ – నాగు
పీఆర్ఓ – వీరబాబు
రచన, దర్శకత్వం – ప్రవీణ్ కె.వి.