Legally Veer Movie Releasing on Dec 27 – Pre Release Event held grandly
The much-anticipated and unique legal thriller ‘Legally Veer’ Movie is gearing up to hit the screens on December 27. Starring Veer Reddy, Dayanand Reddy, Delhi Ganeshan, and Giridhar in pivotal roles, the movie is directed by Ravi Gogula. Produced by Shanthamma Malikireddy under the Silver Cast Creations banner, the film has created a buzz as it explores the rare genre of legal thrillers.
A grand pre-release event was held at Prasad Labs in Hyderabad recently, garnering significant attention.
Speaking at the event, lead actor Veer Reddy shared, “I have no background in cinema. During the COVID-19 pandemic, I explored podcasting, which introduced me to the film world. That’s when the idea of doing a good film struck me. Being a legal lawyer myself, this role came naturally to me. There haven’t been many legal thrillers in Indian cinema, and we wanted to depict what a real courtroom drama looks like. The movie has shaped up wonderfully, and we are excited to present it to the audience on December 27.”
Director Ravi Gogula added, “I feel fortunate for the opportunity Veer Reddy gave me. It’s a rare subject, and we hope both the media and the audience appreciate our work.”
Distributor Vishwanath Chowdary said, “The teaser has created a good buzz. We are releasing this film in 70 theaters, and we believe it will be well-received.”
Producer Shanthamma Malikireddy expressed, “In a democratic nation, the judicial system holds immense importance. We are proud to present a rare film on the subject of law. We hope everyone supports this film, releasing on December 27.”
Technical Team:
Banner: Silver Cast Creations
Producers: Malikireddy Shanthamma
Dialogue, Screenplay & Direction: Ravi Gogula
Music: Shankar Tamiri
Cinematography: Jackson Johnson, Anush Gorak
Editor: S.B. Uddhav
Executive Producer: Shiva Chaitanya
Choreographers: Prem Rakshit Master, Vallam Kaladhar
Lyricists: Veerinchi, Shyam Kasarla, Roll Rida, Bhardwaj Gali
Art Director: Hari Varma.
VFX: Magic B.
Fights: Ramakrishna.
Colorist: Pankaj.
DI & Sound Mixing: Sri Saradhi Studios.
Sound Design: Raju
PROs: Kadali Rambabu, Dayyala Ashok
27న వచ్చేస్తున్న ‘లీగల్లీ వీర్’
హాట్ టాపిక్ గా మారుతూ అరుదైన లీగల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై శాంతమ్మ మలికిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా ఫ్రీరిలీజ్ ఫంక్షన్ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో వీర్ రెడ్డి మాట్లాడుతూ.. “నాకు ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు. కరోనా టైమ్లో పాడ్ కాస్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ సమయంలో సినిమా వాళ్ళతో పరిచయం ఏర్పడింది. ఓ మంచి సినిమా చేద్దాం అనుకుని, లీగల్ లాయర్ను కాబట్టి నాకు ఈ పాత్ర చేయడం సులభంగా అనిపించింది. ఇంత వరకు మన దగ్గర లీగల్ థ్రిల్లర్ సినిమాలు అంతగా రాలేదు.” అని అన్నారు.
రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నామని చెప్పారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. డిసెంబర్ 27 ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.
ఇక దర్శకుడు రవి మాట్లాడుతూ.. “వీర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనిపించింది. అరుదైన సబ్జెక్టు. మా సినిమాను మీడియాతో పాటు ప్రేక్షకులు ఆదరించాలి.” అని కోరారు.
డిస్ట్రిబ్యూటర్ విశ్వనాథ్ చౌదరి మాట్లాడుతూ.. “టీజర్ కు మంచి బజ్ వచ్చింది. మేము ఈ సినిమాను 70 థియేటర్లలో విడుదల చేస్తున్నాం.
డైరెక్టర్ రవి గోగుల మాట్లాడుతూ.. అందరు చూడదగిన సినిమా. వీర్ రెడ్డి చాలా నాచురల్ గా చేశారు. ప్రతి సీన్ మన కళ్ళ ముందే జరిగినట్టు ఉంటుంది. మన చుట్టూ జరిగే వాస్తవిక సంఘటనలా ఉంటుంది.
ప్రొడ్యూసర్ శాంతమ్మ మలికిరెడ్డి మాట్లాడుతూ.. “ప్రజాస్వామ్య దేశంలో న్యాయ వ్యవస్థ ఎంతో కీలకం. లా సబ్జెక్టుపై అరుదైన సినిమా తీసుకు వస్తున్నాం. ఈ నెల 27న విడుదలయ్యే ఈ సినిమాను అందరు ఆదరించాలని కోరుకుంటున్నాం.” అని అన్నారు.
సాంకేతిక బృందం:
బ్యానర్: సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్
నిర్మాతలు: మల్కిరెడ్డి శాంతమ్మ
సంభాషణలు – స్క్రీన్ప్లే-దర్శకత్వం: రవి గోగుల
సంగీతం: శంకర్ తమిరి
సినిమాటోగ్రాఫర్: జాక్సన్ జాన్సన్, అనూష్ గోరక్
ఎడిటర్: S.B. ఉద్ధవ్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శివ చైతన్య
కొరియోగ్రాఫర్లు: ప్రేమ రక్షిత్ మాస్టర్, వల్లం కళాధర్
లిరిసిస్ట్: వీరించి శ్యామ్ కాసర్ల, రొల్ రైడా, భ్రద్వాజ్ గాలి
ఆర్ట్ డైరెక్టర్: హరి వర్మ
VFX: మ్యాజిక్ B
ఫైట్స్: రామకృష్ణ
కలరిస్ట్ – పంకజ్
DI & సౌండ్ మిక్సింగ్: శ్రీ సారధి స్టూడియోస్,
సౌండ్ డిజైన్: రాజు,
పీఆర్వోలు: కడలి రాంబాబు, దయ్యాల అశోక్