I will entertain with Darling – Priyadarshi
జూలై 19 న మిమ్మల్ని ఎంగేజ్ చేస్తా – ప్రియదర్శి
ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. డార్లింగ్ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. నెక్స్ట్ మంత్ సరిపోదా శనివారం ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయి. దర్శి వలన కొంచెం ముందుగానే స్టార్ట్ అయినయ్. ఈ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా వుంది. డార్లింగ్ టీజర్ ట్రైలర్ చాలా ఎంటర్ టైనింగ్ గా వున్నాయి. ఈ మధ్య యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయి కామెడీ, లవ్ స్టొరీలని మిస్ అవుతున్నాం. లాస్ట్ ఇయర్ లవ్ స్టొరీ, ఎమోషన్ కలిపి హాయ్ నాన్నతో వచ్చాను. ఈ ఏడాది దర్శి లవ్ స్టొరీ, కామెడీ కలిపి డార్లింగ్ తో వస్తున్నారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి. కామెడీ ఎమోషన్ లవ్ యాక్షన్..ఇలా అన్నీ జోనర్ సినిమాలు రావాలి. దర్శి లాంటి ట్యాలెంటెడ్ యాక్టర్ అలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా వుంది. స్ల్పిట్ పర్సనాలిటీ కాన్సెప్ట్ అదిరిపోయింది. లేడి అపరిచితుడు. ఇలాంటి కాన్సెప్ట్ తో సరిగ్గా చేస్తే ఎంత లాఫ్టర్ జనరేట్ చేయొచ్చో వూహించగలను. ట్రైలర్ చూస్తుంటే పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ అనిపిస్తుంది. నిరంజన్ గారు, చైతన్య గారి హనుమాన్ అంత సక్సెస్ డార్లింగ్ కావాలని కోరుకుంటున్నాను. వివేక్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. తనకి ఓ కల్ట్ ఫాలోయింగ్ వుంది, డార్లింగ్ తో మరో బ్లాక్ బస్టర్ అందుకుంటాడు. డైరెక్టర్ అశ్విన్ గారి ఆల్ ది వెరీ బెస్ట్, ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. నభా ‘డార్లింగ్’ తో న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది అద్భుతంగా వుండాలని కోరుకుంటున్నాను. దర్శి అంటే నాకు చాలా ఇష్టం. హాయ్ నాన్న గోవా షూటింగ్ లో ఓ రోజు సరదాగా బయటికి వెళ్లాం. సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. తను చేసే నటన, పాత్రలు ఇష్టం. ఈ డకేడ్ లోనే నాకు మోస్ట్ ఫేవరేట్ ఫిల్మ్ బలగం. బలగం హీరో ఫ్యాన్ గా ఈ ఈవెంట్ కి వచ్చాను. డార్లింగ్ కూడా దర్శి కెరీర్ లో ఒక మైల్ స్టోన్ అవ్వాలని కోరుకుంటున్నాను. జూలై 19న సినిమా రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా చూస్తాను. ఈ శుభ సందర్భంలో మీతో ఒక విషయం చెప్పాలి. నా వాల్ పోస్టర్ బ్యానర్ నెక్స్ట్ సినిమాలో దర్శినే హీరో. జగదీశ్ ఈ మూవీకి డైరెక్టర్. జానర్ మిగతా వివరాలు త్వరలో చెప్తాం. డార్లింగ్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చిన్నప్పుడు చిరంజీవి గారిని చూసి యాక్టర్ కావాలని ఇన్స్పిరేషన్ అయితే ఇప్పుడు నాని అన్న ఇన్స్పిరేషన్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి రావాలనుకునే ఇప్పటి జనరేషన్ కి నాని అన్న ఇన్స్పిరేషన్. కల్కి సినిమాలా ఆలోచిస్తే నాని అన్న రధం నడిపే కృష్ణుడైతే ఆ దారిలో వెళ్ళే అర్జునుడిలా, నాని అన్నని ఫాలో అవుతున్నా. ఇంత ఇన్స్పిరేషన్ ఇస్తున్నందుకు థాంక్ యూ. ఈ వేడుకకు గెస్ట్ గా వచ్చిన శివలెంక కృష్ణప్రసాద్ గారితో పాటు అందరికీ థాంక్ యూ. అశ్విన్ రూపంలో నాకో బ్రదర్ దొరికాడు. డార్లింగ్ తో తెలుగు సినిమా అశ్విన్ ని అడాప్ట్ చేసుకుంటుంది.తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నిరంజన్ గారు, చైతన్య గారు ఈ కథని బిలివ్ చేశారు. వారితో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. వివేక్ సాగర్, విష్ణు, నరేష్, అనన్య, జీవన్ అన్న, కాసర్ల శ్యామ్, శీతారాం అన్న, టీం అందరికీ పేరుపేరునా థాంక్స్. నభా తీసుకొచ్చిన స్పిరిట్ ట్యాలెంట్రాఘవ క్యారెక్టర్ ని మోటివేట్ చేసింది. తను రెండేళ్ళ తర్వాత ఒక ఫ్లేమ్ లా తిరిగొచ్చారు. ఇక నుంచి తిరుగుండదు. ప్రేక్షకుడు ఇచ్చిన టైమ్ కి వాల్యూ యాడ్ చేయాలని అనుకుంటా. ఒక మంచి సినిమా మీకు మళ్ళీ తిరిగివ్వాలి. మీరు మాకిస్తున్న ప్రేమని రెండితలు తిరిగివ్వాలని నేను అనుకుంటున్నాను. జూలై 19. మీతో కమ్యునికేట్ చేస్తా, మిమ్మల్ని ఎంగేజ్ చేస్తా. మీరు థియేటర్ కి వస్తే మా టీం తరపున మీరు అనుకున్నదాని కంటే ఎక్కువ ప్రేమ ఇస్తా.. ఐ లవ్ యూ అల్’ అన్నారు.
డైరెక్టర్ అశ్విన్ రామ్ మాట్లాడుతూ.. నాని గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది. కొత్త దర్శకులకు కొత్త కథలు రాసుకునే స్ఫూర్తిని నమ్మకాన్ని ఇచ్చే హీరో నాని గారు. డార్లింగ్ టీం అందరికీ పేరుపేరునా థాంక్ యూ. మా ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు, చైతన్య గారు కంటెంట్ ని బలంగా నమ్మారు. చాలా సపోర్ట్ చేశారు. డార్లింగ్ నాకు చాలా స్పెషల్ ఫిలిం. డార్లింగ్ లో కొత్త నభాని చూస్తారు. దర్శి సపోర్ట్ మర్చిపోలేను. కంటెంట్ ని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు. తన ఎదుగుదల చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. జూలై 19న సినిమా వస్తుంది. తప్పకుండా చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.
హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ..నానికి గారిని నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన ఈ ఈవెంట్ కు రావడం చాలా ఆనందంగా వుంది. డార్లింగ్ సినిమా నాకు ఓ ఎమోషన్. ఇందులో నా డ్రీం రోల్ చేశాను. అశ్విన్ అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. ఇంకా గొప్పగా తీశారు. జూలై 19న డార్లింగ్ మ్యాజిక్ చూస్తారు. దర్శితో నటించడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. చాలా సపోర్ట్ చేశారు. నిరంజన్ గారు, చైతన్య గారు కంటెంట్ ని నమ్మే ప్రొడ్యూసర్. హనుమాన్ సక్సెస్ ని డార్లింగ్ కంటిన్యూ చేస్తుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. అమ్మా నాన్నల సపోర్ట్ లేకపోతే ఇక్కడివరకూ వచ్చేదాన్ని కాదు. డార్లింగ్ 19న వస్తోంది. పైసా వసూల్ ఎంటర్ టైన్మెంట్ వుంటుంది. మళ్ళీ మళ్ళీ చూస్తారు’అన్నారు.
యాక్ట్రస్ అనన్య నాగళ్ల మాట్లడుతూ.. డార్లింగ్ టీజర్ ట్రైలర్ అందరికీ నచ్చాయి. కథ విన్నప్పుడు చాలా నచ్చింది. హీరోయిన్ రోల్ ఇంకా బావుందనిపించింది. ఇందులో అద్భుతమైన ఎంటర్ టైన్మెంట్ వుంది. ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను. ఈ సినిమాతో అశ్విన్ పెద్ద హీరో కావాలని ఆశిస్తున్నాను. దర్శి ఏం చేసినా బ్లాక్ బస్టర్ అవుతుంది. మల్లేశం తర్వాత తనతో కలసి వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. నభా రోల్ ఇందులో చాలా కాంప్లికేటెడ్. చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. తప్పకుండా సినిమా థియేటర్స్ లో చూడండి’ అన్నారు.
నిర్మాత చైతన్య రెడ్డి మాట్లాడుతూ..నాని గారికి థాంక్స్. మా సినిమాకి సపోర్ట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ పేరుపేరునా థాంక్స్. దర్శి అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. నభా కోసం రిలీజ్ తర్వాత స్పెషల్ గా ఈవెంట్ పెడతాను. ఈ సినిమా చూసిన తర్వాత తను హార్డ్ వర్క్ ని అందరూ అభినందిస్తారు. మా ప్రొడక్షన్ తో తనతో మరిన్ని సినిమాలు చేయాలని వుంది. అనన్య థాంక్ యూ. డార్లింగ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అశ్విన్ మరో ట్యాలెంటెడ్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకుంటారు. ఇది టీం వర్క్, మీ అందరి సపోర్ట్ కి థాంక్ యూ అన్నారు.
యాక్టర్ అభినవ్ గోమఠం మాట్లాడుతూ..డార్లింగ్ టీజర్ ట్రైలర్ ప్రామెసింగ్ గా వున్నాయి. వివేక్ సాగర్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. అశ్విన్ ఆల్ ది బెస్ట్. తను చాలా కమర్షియల్ గా సినిమా చేశాడు. దర్శి హార్డ్ వర్క్ రిజల్ట్ దొరుకుతుంది. నభా క్యారెక్టర్ చాలా బావుంది. చాలా మంచి టీం. హనుమాన్ సక్సెస్ ని డార్లింగ్ కంటిన్యూ చేస్తుంది’ అన్నారు.
దర్శకుడు వేణు యెల్దండి మాట్లాడుతూ.. నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య గారు హనుమాన్ తో సూపర్ సక్సెస్ కొట్టారు. డార్లింగ్ తో సక్సెస్ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ అశ్విన్ గారు.. వెల్ కం టు తెలుగు సినిమా. ఇందులో చాలా రోజుల తర్వాత యాక్టర్ గా నాకో రోల్ ఇచ్చారు. దర్శి సక్సెస్ లిస్టు లో డార్లింగ్ వుండాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ అభినందనలు’ చెప్పారు.
దర్శకుడు వీఐ ఆనంద్ మాట్లాడుతూ.. డార్లింగ్ సినిమా ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ కె నిరంజన్ రెడ్డి, చైతన్య గారి మరో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. దర్శి టైమింగ్ నెక్స్ట్ లెవల్. ఈ సినిమా తనని మరో లీగ్ కి తీసుకువెళుతుంది. నభాతో కలసి డిస్కో రాజా లో పని చేశాం, తన ఎనర్జీ , హార్డ్ వర్క్ అద్భుతం. అశ్విన్ కి మంచి హ్యుమర్ సెన్స్ వుంది. సినిమా ప్రొడక్షన్ వైజ్ చాలా బిగ్ ఫిల్మ్ గా కనిపిస్తుంది. జూలై 19న వస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. ముందుగా నాని గారు.. సరిపోదా శనివారానికి ఆల్ ది బెస్ట్. అందరం వెయిటింగ్. డార్లింగ్ అందరూ చాలా క్లోజ్ వాళ్ళు తీసిన సినిమా. దర్శిగారు, నభా గారు, నిరంజన్ గారు, చైతన్య గారు అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద హిట్ కావాలి’ అని కోరుకున్నారు.
డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి వచ్చిన నాని గారికి, ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిరంజన్ రెడ్డి, చైతన్య గారికి ధన్యవాదాలు. హనుమాన్ తరవాత ఈ సినిమా మాకు ఇవ్వడం చాలా ఆనందంగా వుంది. నాని గారిలానే అందరి ఆదరణ వున్న హీరో ప్రియదర్శి. ఈ సినిమా మంచి ఎంటర్ టైనర్ అని అందరూ ఆశిస్తున్నారు. వారి అంచనాలని సినిమా అందుకుంటుందని నమ్ముతున్నాను. హనుమాన్ లానే ఈ సినిమా కూడా పెద్ద రేంజ్ కలెక్షన్స్ రావాలని, ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
చిత్ర యూనిట్ సభ్యులంతా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.