Hansika Motwani’s Sri Gandhari Ready to Release in December
Hansika Motwani is set to showcase her versatility in a dual role in her upcoming horror-thriller, Sri Gandhari. Directed and produced by filmmaker R Kannan under his Masala Pix banner, this marks a significant collaboration between Hansika and the director, who previously worked together on the 2013 film Settai, which was a remake of Delhi Belly.
The film is being brought to Telugu audiences by Raju Nayak of Lachhuram Productions, in partnership with Saraswati Developers, and is presented by Vikram Kumar Rejintala. The makers are planning to release the movie in December. The trailer and other promotional material received a superb response.
Hansika portrays a young woman who serves as the head officer of the Hindu Trust Committee. Her character embarks on an intriguing journey as she takes on a research project concerning the ancient monument of ‘Gandharva Kota’. This centuries-old fort, built by a king, holds deep secrets that set the stage for the unfolding suspense and horror in the story.
The film boasts an ensemble cast featuring talented actors such as Metro Sirish, Mayilsamy, Thalaivasal Vijay, Aadukalam Naren, Stunt Silva, Vinodhini, Pavan, Brigida Saga, Vadivel Murugan, and Kalairani.
The story of Sri Gandhari is provided by Tholkappiyan, with Dhananjayan penning the screenplay. The technical crew includes cinematographer Balasubramanian, music composer LV Ganesh Muthu, editor Jijinthra, and stunt director Silva.
With its blend of mystery, suspense, and horror, Sri Gandhari is poised to captivate audiences, and the film promises to offer a thrilling ride.
The makers will soon announce the exact release date soon.
హన్సిక ‘శ్రీ గాంధారి’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న రాజు నాయక్
హారర్ చిత్రాలపై ఆడియెన్స్‌కి ఎప్పుడూ ఓ అంచనాలుంటాయి. ఈ మధ్య నవ్విస్తూనే భయపెట్టించే చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. హారర్ జానర్ ఎప్పుడూ ఎవర్ గ్రీన్‌గానే ఉంటుంది. ఈ క్రమంలోనే అందాల తార హన్సిక ‘శ్రీ గాంధారి’ అంటూ భయపెట్టించేందుకు వస్తున్నారు. మసాలా పిక్స్ బ్యానర్‌పై ఆర్ కన్నన్ దర్శకత్వం వహిస్తూ నిర్మించారు. ఇక ఈ చిత్రాన్ని సరస్వతి డెవలపర్స్‌తో కలిసి లచ్చురం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాజు నాయక్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.. ఈ మూవీని వీకేఆర్ (విక్రమ్ కుమార్ రెజింతల) సమర్పిస్తున్నారు.
హిందూ ట్రస్ట్ కమిటీకి హెడ్ ఆఫీసర్‌గా పనిచేసే యువతిగా హన్సిక ఈ చిత్రంలో నటించారు. ఆమె ‘గంధర్వ కోట’ పురాతన స్మారకానికి సంబంధించిన పరిశోధన ప్రాజెక్ట్‌ను చేపట్టడంతో అసలు కథ మొదలవుతుంది. ఒక రాజు నిర్మించిన శతాబ్దాల నాటి ఈ కోటలో ఎన్నో రహస్యాలుంటాయి. ఆ రహస్యాల్ని ఎలా బయటకు తీసుకు వచ్చారు? అన్నది కథ.
ఈ మేరకు గతంలోనే రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక ట్రైలర్లో హన్సిక లుక్స్, యాక్టింగ్ చాలా కొత్తగా అనిపించాయి. ఇతర ఆర్టిస్టుల లుక్స్, వేరే భాషల్లో చెప్పిన డైలాగ్స్ ఆసక్తి రేకెత్తిస్తాయి. ఈ చిత్రంలో మెట్రో శిరీష్, మయిల్సామి, తలైవాసల్ విజయ్, ఆడుకాలం నరేన్, స్టంట్ సిల్వా, వినోదిని, పవన్, బ్రిగిడా సాగా, వడివేల్ మురుగన్, కలైరాణి వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.
శ్రీ గాంధారి కథను తొల్కప్పియన్, స్క్రీన్ ప్లేని ధనంజయన్ అందించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా బాల సుబ్రమణియన్, మ్యూజిక్ కంపోజర్‌గా ఎల్వీ గణేష్ ముత్తు, ఎడిటర్‌గా జిజింత్ర, సిల్వా స్టంట్ డైరెక్టర్‌గా పని చేశారు.
మిస్టరీ, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘శ్రీ గాంధారి’ చిత్రాన్ని డిసెంబర్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు రాజు నాయక్ సన్నాహాలు చేస్తున్నారు.
నటీనటులు : హన్సిక, మెట్రో శిరీష్, మయిల్సామి, తలైవాసల్ విజయ్, ఆడుకాలం నరేన్, స్టంట్ సిల్వా, వినోదిని, పవన్, బ్రిగిడా సాగా, వడివేల్ మురుగన్, కలైరాణి తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : సరస్వతి డెవలపర్స్, లచ్చురం ప్రొడక్షన్స్
నిర్మాత : రాజు నాయక్
సమర్పణ : వీకేఆర్ (విక్రమ్ కుమార్ రెజింతల)
దర్శకుడు : ఆర్ కన్నన్
సంగీతం : ఎల్వీ గణేష్ ముత్తు
కెమెరామెన్ : బాల సుబ్రమణియన్
ఎడిటర్ : జిజింత్ర
పీఆర్వో : సాయి సతీష్