GADDAR AWARDS TO TELUGU FILM INDUSTRY
At the outset, the Telugu Film Industry conveys its sincere thanks to Sri A. Revanth Reddy garu, Hon’ble Chief Minister of Telangana State and Sri Komatireddy Venkatreddy garu, Hon’ble Minister for Cinematography for evincing keen interest for development of Telugu Film Industry in the State of Telangana.
Our sincere appreciation to Sri Revanth Reddy for hearing us and discussing the recent strides made by the Telugu Film Industry in expanding its footprint PAN India and raising its standards to match the Hollywood films. We are very happy to note that the Government of Telangana is instituting “Gaddar” Awards to felicitate artistes and technicians not limiting to Telugu Film Industry but extending the same to other fields representing Art and Craft. Keeping this in view, we had a discussion about forming a Committee in coordination with Telangana State TV & Film Development Corporation.
We, Telugu Film Chamber of Commerce and Telugu Film Producers’ Council will constitute a Committee consisting of Representatives from Telugu Film Industry and formulate required guidelines in consultation with Telangana State TV & Film Development Corporation and present the same to Hon’ble Chief Minister and Hon’ble Cinematography Minister at the earliest.
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గద్దర్ అవార్డ్స్
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, మరియు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తరుపున తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు మరియు, గౌరవ సినిమాటోగ్రాఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు చేస్తున్న కృషికి ధన్యవాధాలు తెలియజేసారు . గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబందించిన సంస్థల ప్రతినిదులకు వారి సమయం ఇచ్చి ఆ మీటింగులో పరిశ్రమ గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. మన తెలుగు సినిమా ప్రపంచస్థాయిలో మంచి పేరు తెచ్చుకుంటున్నందుకు సంతోషం వ్యక్తపరుస్తూ కొత్త గవర్నమెంటు తెలుగు చలన చిత్ర పరిశ్రమ తెలంగాణాలో అన్నిరకాల అభివృద్ధికి కృష్హి జేస్తారని తెలియజేసారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి ఇకపై సినిమా పరిశ్రమకు చెందిన వారికి “గద్దర్ అవార్డులు” ప్రదానం చేస్తామని దానికి సంబందించిన విధివిధానాలు తయారు చేయాల నికోరారు.
ఈ విషయంలో, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, మరియు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి “గద్దర్” అవార్డ్స్ గైడ్ లైన్స్ ను తెలంగాణ FDC వారికి తెలియజేయడం జరిగింది. ఆవిధంగా త్వరలో “గద్దర్ అవార్డు” కొరకు మార్గదర్శకాలు తెలంగాణ FDC వారి సంప్రదింపులతో తయారు జేసి గౌరవ ముఖ్యమంత్రి గార్కి మరియు గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి గార్కి త్వరలో ఇవ్వడం జరుగుతుంది.
గద్దర్ గారిని చూసి మేము గర్విస్తున్నాము. ఆయన నటునిగా, కళాకారులుగా, జానపద పాటలందు మరియు పేదలకు చేసిన సేవలకు సేవా రంగంలో ఆయన చేసిన విలువైన కృషికి లెజెండ్ గా ఆయన పట్ల మాకు చాలా గౌరవం ఉంది అని తెలియజేస్తున్నాము.
తెలంగాణ రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీ మరింత అభివృద్ధికి తోడ్పడుచున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ A. రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన విషయముల గురించి వివరముగా చర్చించిన మీదట ఎన్నో సంవత్సరముల నుండి పెండింగ్ లో వున్న అవార్డ్స్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ” గద్దర్ అవార్డ్స్ ” పేరు మీద ఇక నుండి ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వగలమని తెలియచేయగా ఫిలిం ఇండస్ట్రీ వారు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ విషయం మీద తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో అవార్డ్స్ కు సంబంధించిన కమిటీ గురించి చర్చించడం జరిగిందని, దీని మీద తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి మరియు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి వారు ఒక కమిటీ ని నియమించి సదరు విధి విధానాలను తయారు చేసి, ఆ విధి విధానాలను తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ A. రేవంత్ రెడ్డి గారికి అతి త్వరలో అందజేయడం జరుగుతుందని తెలియచేయుచున్నాము.