![Dada is now Pa.. Pa.. – Movie Releasing on January 3](https://filmybuzz.com/wp-content/uploads/2024/12/papa-1-850x560.jpg)
Dada is now Pa.. Pa.. – Movie Releasing on January 3
The Tamil blockbuster movie ‘Dada’ is all set to entertain Telugu audiences under the title Pa.. Pa… Produced by Neeraja Kota under the JK Entertainments banner, the movie will hit theaters in Andhra Pradesh, Telangana, the USA, and Australia on January 3. The recently released trailer, launched by director Maruthi, has received an overwhelming response, raising high expectations for the film.
Released last year in Tamil, Dada became a sensational hit. Featuring Kavin and Aparna Das in lead roles, the film was directed by Ganesh K Babu and was widely acclaimed by Tamil audiences. Despite being made on a modest budget, the movie grossed around ₹30 crores, becoming a massive success in Kollywood and earning significant profits for distributors. The heartwarming songs added to the movie’s charm, with the team confident that they will remain evergreen classics.
Centered on the bond between a father and son, Dada touched hearts in Tamil Nadu and is expected to do the same in Telugu as Pa.. Pa… Producer Neeraja Kota expressed confidence that the film, with its perfect blend of emotions, romance, and comedy, will deeply connect with Telugu audiences and emerge as a blockbuster. Achhibabu from MGM is distributing the film in the Telugu states.
Key Details:
– Production House: JK Entertainments
– Producer: Neeraja Kota
– Hero: Kavin
– Heroine: Aparna Das
– Cast: Bhagyaraj, VTV Ganesh, Aishwarya, Pradeep Shakti
– Music: Jen Martin
– Lyrics: Ravivarma Akula
– PROs: Kadali Rambabu, Ashok Dayyala
జనవరి 3న వచ్చేస్తున్న ‘పా.. పా..’ మూవీ
తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘డా..డా’
‘పా.. పా..’ పేరుతో తెలుగులో విడుదల
జనవరి 3న ఆంధ్ర, తెలంగాణ, అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్లలో విడుదల
తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘డా..డా’ మూవీ తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు. జనవరి 3న ఈ మూవీ ఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవల డైరెక్టర్ మారుతి విడుదల చేసిన ‘పా.. పా..’ మూవీ ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
గత ఏడాది తమిళంలో విడుదలైన ‘డా..డా’ మూవీ సెన్సేషనల్ హిట్ సాధించింది. కవిన్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రదారులుగా, డైరెక్టర్ గణేష్ కె బాబు తెరకెక్కించిన ‘డా..డా’ చిత్రం తమిళ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించింది. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 30 కోట్లు వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. హార్ట్ టచ్ అయ్యే పాటలు ఈ సినిమాకు మరో హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పటి పాపులర్ సాంగ్స్ మాదిరిగానే ఈ సినిమా పాటలు స్థిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.
తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కి తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘డా..డా’ చిత్రం ‘పా.. పా..’ పేరుతో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుందని నిర్మాత నీరజ కోట తెలిపారు. భావోద్వేగం, ప్రేమ, కామెడీ.. ఇవన్నీ సరైన స్థాయిలో మిక్స్ చేసిన ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా.. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్టు అవుతుందని, బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమన్నారు. జనవరి 3న విడుదులయ్యే ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు విడుదల చేయబోతున్నారని చెప్పారు.
ప్రొడక్షన్ హౌస్: JK ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: నీరజ కోట
హీరో: కవిన్,
హీరోయిన్: అపర్ణా దాస్
నటీనటులు: భాగ్యరాజా, వీటీవీ గణేష్, ఐశ్వర్య, ప్రదీప్ శక్తి
మ్యూజిక్: జెన్ మార్టిన్
సాహిత్యం: రవివర్మ ఆకుల
పీఆర్వో: కడలి రాంబాబు, అశోక్ దయ్యాల.