Celebrities shared their opinions on Revu Movie
The film Revu, starring Vamsi Ram Pendyal, Ajay, Swathi Bheemireddy, and Epuri Hari in the lead roles, has garnered acclaim from cinema personalities. Produced by Dr. Murali Ginjupalli and Naveen Parupalli under the banners of Sanmith Entertainment and Parupalli Production, the film was directed by Harinath Puli. The movie was released on August 23 and has been running successfully. Celebrities who watched the film have shared their opinions.
Hero Srikanth said, “I didn’t expect Revu to be this good. Thanks to Murali for producing a film with such a great concept. It’s a must-watch for everyone. All the actors performed wonderfully. Even though everyone was new, they acted very naturally. Congratulations to the entire team.”
SV Krishna Reddy stated, “Revu is outstanding, especially the second half, which is next level. The actors have performed exceptionally well. I recommend it to everyone. The direction and making are superb. Make sure to watch this film in theaters.”
Producer Atchi Reddy said, “When I heard the title Revu, I thought it might be a documentary. However, it turned out to be an excellent commercial film. Even though the director, producers, and artists are all new, they made this movie beautifully. Journalist Prabhu played a pivotal role as the backbone of this film. It is truly magnificent.”
Hero Tharun said, “Revu is very impressive. It’s rare to see a film with such a backdrop. It maintained the same tempo from the first frame to the last. The camera work is excellent. Vamsi and Ajay performed brilliantly. The villains also acted well. Despite everyone being new, they did an amazing job. Best wishes to Murali for producing such a great film. It has good action and emotions. Every character has an emotional aspect. Prabhu worked as the line producer and Rambabu as the executive producer. Watch this film in theaters.”
Jabardasth Rakesh mentioned, “When senior journalists like Prabhu are behind such films, they are sure to be successful. I hope they encourage newcomers like us. Revu is a fantastic film. Everyone should definitely watch it.”
Responding to the positive buzz and reviews surrounding Revu, the renowned director Ram Gopal Varma took to social media to express his thoughts. He posted, “CONGRATS to the entire team of #revu for the WONDERFUL reviews you got
“రేవు” కు ప్రశంసల జల్లు
వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రేవు’. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా.మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ సూపర్ విజన్‌గా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరించారు. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం ఆగస్ట్ 23న రిలీజ్ అయి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. సెలెబ్రిటీ షోల్లో సినిమాను వీక్షించిన ప్రముఖులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘రేవు సినిమా ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు. ఇంత మంచి కాన్సెప్ట్‌తో సినిమాను నిర్మించిన మురళీ గారికి థాంక్స్. అందరూ చూడాల్సిన సినిమా. నటీనటులంతా కూడా అద్భుతంగా నటించారు. అందరూ కొత్త వారైనా కూడా ఎంతో సహజంగా నటించారు. టీం అందరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.
ఎస్వీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ‘రేవు సినిమా అద్భుతంగా ఉంది.. మరీ ముఖ్యంగా సెకండాఫ్ నెక్ట్స్ లెవెల్లో ఉంది. ఆర్టిస్టులంతా అద్భుతంగా నటించారు. నేను రికమండ్ చేస్తున్నాను. ఇది అందరూ చూడాల్సిన సినిమా. డైరెక్టర్ టేకింగ్, మేకింగ్ అదిరిపోయింది. అందరూ తప్పకుండా థియేటర్లో ఈ సినిమాను చూడండి’ అని అన్నారు.
నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ‘రేవు టైటిల్ వినగానే ఓ డాక్యుమెంటరీలా ఉంటుందని అనుకున్నాను. కానీ ఓ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా అద్భుతంగా తీశారు. దర్శక నిర్మాతలు, ఆర్టిస్టులంతా కొత్త వాళ్లే. అందరూ కొత్త వాళ్లే అయినా ఈ మూవీని అద్భుతంగా తీశారు. ఈ మూవీకి ప్రభు గారు, జర్నలిస్ట్ గారు బ్యాక్ బోన్‌లా నిలిచారు. ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంది’ అని అన్నారు.
హీరో తరుణ్ మాట్లాడుతూ.. ‘రేవు చిత్రం చాలా బాగుంది. ఇలాంటి బ్యాక్ డ్రాప్లో సినిమా రావడం అరుదు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఒకే టెంపోలో సాగింది. కెమెరామెన్ పనితనం అద్భుతంగా ఉంది. వంశీ, అజయ్ అద్భుతంగా నటించారు. విలన్స్ కూడా బాగా నటించారు. అంతా కొత్త వాళ్లే అయినా అద్భుతంగా నటించారు. ఇలాంటి సినిమాను నిర్మించిన మురళీ గారికి ఆల్ ది బెస్ట్. మంచి యాక్షన్, ఎమోషన్స్ ఉన్న చిత్రమిది. ప్రతీ పాత్రకు ఓ ఎమోషన్ ఉంటుంది. ప్రభు గారు లైన్ ప్రొడ్యూసర్‌గా, రాంబాబు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. ఈ సినిమాను కచ్చితంగా థియేటర్లో చూడండి’ అని అన్నారు.
జబర్దస్త్ రాకేష్ మాట్లాడుతూ.. ‘ప్రభు లాంటి సీనియర్ జర్నలిస్టులు ఇలాంటి చిత్రాల వెనుక ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతాయి. మా లాంటి కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. రేవు సినిమా చాలా అద్భుతంగా ఉంది. ప్రతీ ఒక్కరూ ఈ మూవీని తప్పకుండా చూడండి’ అని అన్నారు.
రేవు సినిమాకు వచ్చిన మౌత్ టాక్, పాజిటివ్ రివ్యూల మీద సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తన సోషల్ మీడియాలో రేవు గురించి ప్రత్యేకంగా పోస్ట్ వేశారు. రేవు గురించి వస్తున్న రివ్యూలు, పబ్లిక్ టాక్ వింటున్నాను.. సినిమా టీంకు కంగ్రాట్స్ అని పోస్ట్ వేశారు.