
CASTE కథ అందరికీ కనెక్ట్ అవుతుంది – వరుణ్ సందేశ్
వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి ప్రధాన పాత్రల్లో ఎకె జంపన్న రచన & దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘CASTE’. కశికా కపూర్, దివి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ గ్లింప్స్ లాంచ్ చేశారు.
గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇలా నలుగురితో కలిసి 2007లో ‘హ్యాపీ డేస్’ సినిమా చేశాం. 17 ఏళ్లు అయ్యింది. ఇప్పుడు మళ్లీ నలుగురితో కలిసి సినిమా చేశాం. ఆలోచిస్తుంటే చాలా క్రేజీగా అనిపిస్తోంది. ఈ కథ విన్నప్పుడు చాలా కొత్త, డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపించింది. ఇందులో చాలా బలమైన క్యారెక్టర్ చేశాను. ఇందులో ప్రతి క్యారెక్టర్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. గగన్ చాలా డెడికేషన్‌తో చేశారు. యాంకర్ రవి నుంచి యాక్టర్ రవిగా తన చాప్టర్ ప్రారంభించబోతున్నారు. తను కూడా చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. సత్యం రాజేష్ గారితో నా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ‘సత్యం’ సినిమా నేను యూఎస్‌లో చూశాను. అది చాలా పెద్ద హిట్. ఇప్పుడు కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఆయన పాత్ర అదిరిపోతుంది. డైరెక్టర్ జంపన్న చాలా అద్భుతంగా ఈ సినిమా తీశారు. చాలా కొత్త ఆలోచనలతో వచ్చారు. ఆ ఆలోచనను ఎంకరేజ్ చేసిన మా నిర్మాత కోటేశ్వరరావు గారికి థాంక్యూ సో మచ్. ఆయనలాంటి ప్రొడ్యూసర్ ఉండడం ఇండస్ట్రీకి చాలా ముఖ్యం. ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఏ విధంగా సినిమా తీస్తుందో అదే రేంజ్లో ఈ సినిమా తీశారు. ఈ సినిమాతో ఆయనకి పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. చాలా మంచి పాయింట్ తీసుకుని చాలా బ్యూటిఫుల్‌గా చూపించారు. అందరికీ కనెక్ట్ అవుతుంది. అందరికీ ధన్యవాదాలు.
గగన్ బాబు మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ‘పుష్ప’ సినిమా నాకు చాలా మందికి చేరువ చేసింది. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. డైరెక్టర్ జంపన్న గారు ఈ సినిమాలో నాకు అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు. ఇంతమంది మంచి ఆర్టిస్టుల మధ్యలో అవకాశం రావడం ఆనందంగా ఉంది. నేను నా 100% ఇచ్చాను. నిర్మాత ఈ సినిమాకు కావలసిన ప్రతిదీ ఇచ్చారు. వరుణ్ సందేశ్, సత్యం రాజేష్ గారు, రవి గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమాలో చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు పనిచేశారు. ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది. అందరూ సినిమాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.
సత్యం రాజేష్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని సెన్సిటివ్ పాయింట్‌తో డైరెక్టర్ గారు ఈ కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ చాలా కొత్తగా కనిపిస్తారు. తన లవర్ బాయ్ ఇమేజ్‌కు భిన్నంగా ఆయన పాత్ర ఉంటుంది. ఆయన పెర్ఫార్మెన్స్ చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి. గగన్ కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రవి ఈ సినిమాతో యాంకర్ నుంచి యాక్టర్ రవిగా మారుతాడు. కోటేశ్వరరావు గారి లాంటి ప్రొడ్యూసర్ ఉండడం ఇండస్ట్రీకి చాలా అవసరం.
రవి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. నేను యాంకర్ రవిగా మీ అందరికీ తెలుసు. ఎప్పటినుంచో యాక్టర్ రవిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కథ చెప్పగానే నాకు చాలా నచ్చింది. ఒక పెద్ద సినిమా చేస్తున్న అనుభవం ఈ సినిమా ఇచ్చింది. కమర్షియల్‌గా చాలా ఎంటర్టైనింగ్గా సినిమా వచ్చింది. డైరెక్టర్ గారు అద్భుతంగా తీశారు. కోటేశ్వరరావు గారి లాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఉండాలి. నా నుంచి 100% ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందరికీ థాంక్యూ సో మచ్.
డైరెక్టర్ ఏకే జంపన్న మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మా సినిమా ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసిన వివి వినాయక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మనం చేసే పనిని బట్టి కులాన్ని నిర్ణయించే రోజుల్లో అంత బాగుండేది. కానీ మనిషి పుట్టుకను బట్టి కులాన్ని నిర్ణయించడం మొదలైనప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. కులం అనేది మనిషికి మనిషికి మధ్య ఒక అడ్డు గోడగా మారింది. ఈ సినిమాను చాలా కమర్షియల్‌గా చెబుతున్నాను. కులం మన నిత్యజీవితంలో ఎలా ప్రభావం చూపుతుందో ఇందులో చూపించాం. కులం గురించి మాట్లాడటానికి చాలామంది వెనుకాడుతారు, కానీ ఇది జీవితంలో ఎంత ముఖ్యమో చూపించాం. ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చిన కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు. వరుణ్ సందేశ్, గగన్ బాబు, సత్యం రాజేష్, రవి అందరూ అద్భుతంగా నటించారు. ఈ సినిమా మీకు చాలా రోజులు గుర్తుండిపోతుంది అని నమ్ముతున్నాను.
నిర్మాత కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన మా డైరెక్టర్ జంపన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది మా బ్యానర్లో తొలి సినిమా. చాలా అద్భుతంగా వచ్చింది. వరుణ్ సందేశ్ హీరోగా, కశికా కపూర్, దివి హీరోయిన్స్‌గా నటించారు. నాగబాబు, పృథ్వి కీలక పాత్రలు పోషించారు. ఎక్కడా ఇబ్బంది పడకుండా అందరూ చాలా సహకరించారు. సినిమా అద్భుతంగా వచ్చింది. జూన్‌లో విడుదల చేయాలని అనుకుంటున్నాం. 90% షూటింగ్ పూర్తయ్యింది. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.
తారాగణం: వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి, కశికా కపూర్, దివి, నాగబాబు, పృద్వి తదితరులు
దర్శకత్వం: ఎకె జంపన్న
నిర్మాత: తోట లక్ష్మీ కోటేశ్వర రావు
బ్యానర్: గోల్డెన్ ప్రొడక్షన్స్
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
పీఆర్వో: వంశీ శేఖర్
