Barabar Premistha Teaser Launched by VV Vinayak
The much-awaited teaser of Attitude Star Chandra Hass’ upcoming film Barabar Premistha was released today by dynamic director V.V. Vinayak. Directed by Sampath Rudra, the film is produced by Geda Chandu, Gayatri Chinni, and AVR under the banners of CC Creations and AVR Movie Wonders, with Kakarla Sathyanarayana presenting it. Megna Mukherjee, a Miss India finalist, plays the lead heroine, while Arjun Mahi (known for Ishtangaa) plays the antagonist. The film is gearing up for a grand theatrical release soon.
The teaser of Barabar Premistha presents an engaging mix of love, action, and emotional elements. Set in the village backdrop of Rudraram, Telangana, the teaser hints at a compelling love story amid the conflicts of the town. The powerful performance of Chandra Hass stands out, with Megna Mukherjee showcasing her energetic presence. The conflict between Chandra Hass and Arjun Mahi adds an intense dynamic, with a standout dialogue from Chandra Hass, “Nuvvu Nannu Kodathante Noppi Nee Kallallo Thelusthundentraa…” The background music, cinematography, and production values are of top quality.
*Attitude Star Chandra Hass* , speaking at the teaser launch event, shared his excitement for Barabar Premistha. “The teaser has already impressed the audience, and with Dhruvan’s superb music, the film will be a hit. I am sure the audience will support us,” he said.
*Actor Arjun Mahi* , known for his work in Ishtangaa, expressed his happiness at being a part of this movie after a gap of six years and highlighted how the movie has grown in scale. He is excited to play the antagonist and hopes the audience will support the film.
*Director Sampath Rudra* thanked Director VV Vinayak for releasing the teaser and mentioned that Barabar Premistha is a carefully crafted intense love story that will appeal to all types of audiences. He expressed pride in working with such a talented cast and crew and assured that the film will be a hit.
*Heroine Megna Mukherjee* expressed her excitement about her debut as the heroine in Barabar Premistha and thanked Director Sampath and the producers for giving her this opportunity. She believes the film will receive the audience’s love and support.
*Producer Gayatri Chinni* shared her excitement about the project, expressing gratitude to Director VV Vinayak for launching the teaser. She mentioned that her journey in the direction department with Paruchuri Murali and Jayant C Paranjee had influenced her decision to produce the film. Despite the film’s growing budget, they did not compromise on quality, ensuring a high-standard production.
*Actor Muralidhar Goud* , who plays an important character in the film, thanked Director Sampath for giving him this opportunity. “I’m happy to portray such a great role in Barabar Premistha and I’m sure the audience will love the movie,” he said.
*Music Director RR Dhruvan* expressed his happiness in composing for a fresh concept set in a village backdrop, with four beautiful songs in the film. He also praised the chemistry between the lead pair, Chandra Hass and Megna.
*Cinematographer YR Sekhar* thanked the team for their trust in him and expressed confidence in the film’s success.
*Editor Bonthala Nageswar Reddy* shared his excitement about working with Director Sampath for the second time, praising the superb execution of the love and action aspects in the film.
*Lyricist Suresh Gangula,* expressed his happiness about writing songs for Barabar Premistha. “I wrote two wonderful songs for this film- one mass number and one melody. The songs have been beautifully composed by RR Dhruvan, and Director Sampath supported me throughout,” he said, wishing the film great success.
*Dialogue writer Ramesh Rai* noted that the film, set against the backdrop of Telangana, features dialogues that are as intense as the title suggests. He hopes to gain recognition as a dialogue writer through this project.
Cast: Attitude Star Chandra Hass, Meghna Mukherjee, Arjun Mahi, Muralidhar Goud, Laxman Meesala, Madhunandhan, Abhai Naveen, Rajasekhar Aningi, Dr. Bathini, Keerthilatha Goud, and Sunithaa Manohar
Technical Crew:
Director: Sampath Rudra
Producers: Geda. Chandu, Gayatri Chinny, and AVR
Story: MA Tirupathi
Screenplay: Sampath Rudra, and MA Tirupathi
Dialogues: Ramesh Rai
DOP: YR Sekhar
Music: RR Druvan
Editor: Bonthala Nageswar Reddy
PRO: Sai Satish
*డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్*
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా “బరాబర్ ప్రేమిస్తా “. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు.మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ మహీ (“ఇష్టంగా” ఫేమ్) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. త్వరలోనే “బరాబర్ ప్రేమిస్తా ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ “బరాబర్ ప్రేమిస్తా ” సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
టీజర్ ఎలా ఉందో చూస్తే – “బరాబర్ ప్రేమిస్తా ” టీజర్ లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. తెలంగాణలోని రుద్రారం అనే ఊరి నేపథ్యంగా ఆసక్తికరంగా కథా కథనాలు ఉన్నాయి . పరస్పరం గొడవలు పడే ఊరిలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని చూపించబోతున్నట్లు టీజర్ తో తెలుస్తోంది. హీరో చంద్రహాస్ రోల్ పవర్ పుల్ గా ఉంది. హీరోయిన్ మేఘనా ఎనర్జిటిక్ గా పర్ఫామ్ చేసింది. హీరో చంద్రహాస్, ప్రతినాయకుడు అర్జున్ మహీ మధ్య టగ్ ఆఫ్ వార్ ఆకట్టుకుంది. చంద్రహాస్ చెప్పిన ‘ నువ్వు నన్ను కొడతాంటె నొప్పి నీ కళ్లలో తెలుస్తుందేంట్రా..’ డైలాగ్ హైలెట్ గా నిలుస్తోంది. బీజీఎం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వ్యాల్యూస్ టాప్ క్వాలిటీతో ఉన్నాయి.
టీజర్ రిలీజ్ కార్యక్రమంలో…
*ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడుతూ -* నా రీసెంట్ మూవీ రామ్ నగర్ బన్నీ ఆడియెన్స్ కు బాగా రీచ్ అయ్యింది. నేను నా నెక్ట్స్ మూవీ ఎలా ఉండాలని అనుకున్నానో అలాంటి సినిమా “బరాబర్ ప్రేమిస్తా”తో మీ ముందుకు రాబోతోంది. ఈ సినిమా టీజర్ లాంఛ్ చేసిన డైరెక్టర్ వినాయక్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలో నేను హీరోగా నటించడానికి కారణం మా డీవోపీ శేఖర్. ఆయన నా బ్లాక్ డాగ్ వైట్ చిక్ సినిమా టీజర్ చూసి ఈ టీమ్ కు పరిచయం చేశారు. శేఖర్ బ్రదర్ కు థ్యాంక్స్. అలాగే ఈ మూవీని సంపత్ గారు ఎంతో క్లారీటీతో, మంచి క్వాలిటీతో రూపొందించారు. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ చందు, వెంకి, చిన్ని గారికి థ్యాంక్స్. మేఘన అద్భుతంగా నటించింది. అర్జున్ బ్రదర్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. “బరాబర్ ప్రేమిస్తా ” టీజర్ ఇన్ స్టంట్ గా మీ అందరికీ నచ్చింది. మీరు వన్స్ మోర్ అనడం చూస్తుంటే ఆ విషయం తెలుస్తోంది. మా టీజర్ తప్పకుండా వైరల్ అవుతుంది. మా సినిమాకు ద్రువన్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్బ్ గా ఉంటుంది. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరొస్తుందని చెప్పగలను. “బరాబర్ ప్రేమిస్తా ” సినిమాకు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.
*యాక్టర్ అర్జున్ మహి మాట్లాడుతూ -* 2018లో ఇష్టంగా సినిమాతో మీ ముందుకు వచ్చాను. డైరెక్టర్ సంపత్ గారు ఆ మూవీ రూపొందించారు. ఇదే ప్రొడక్షన్ లో వచ్చింది. ఇష్టంగా సినిమా చాలా బాగుందనే ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఇదే టీమ్ “బరాబర్ ప్రేమిస్తా ” సినిమాను చేస్తోంది. చిన్న చిత్రంగా మొదలైన ఈ సినిమా రోజు రోజుకూ స్పాన్ పెంచుకుంటూ వచ్చింది. దాదాపు 200 మంది జూనియర్ ఆర్టిస్టులు షూటింగ్ లో ఉండేవారు. ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. నేను “బరాబర్ ప్రేమిస్తా ” చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాను. మా మూవీకి మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.
*దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ -* “బరాబర్ ప్రేమిస్తా ” సినిమా టీజర్ లాంఛ్ చేసిన మా ఫేవరేట్ డైరెక్టర్ వినాయక్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. నేను గతంలో ఇష్టంగా, ఏక్ అనే చిత్రాలు చేశాను. మంచి ప్రయత్నంగా ఆ సినిమాలకు పేరు వచ్చింది. ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరి చేయాలని అనుకుని “బరాబర్ ప్రేమిస్తా ” ప్రారంభించాం. చంద్రహాస్ హీరోగా ఈ మూవీ స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఆటిట్యూడ్ స్టార్ గా ఆయన గుర్తింపు తెచ్చుకోవడం హ్యాపీగా ఉంది. అన్ని వర్గాల ఆడియెన్స్ కు నచ్చేలా మా సినిమా ఉంటుంది. కాస్ట్ అండ్ క్రూ మాకు బాగా సపోర్ట్ చేశారు. “బరాబర్ ప్రేమిస్తా ” సినిమా గురించి మరిన్ని వివరాలు ట్రైలర్ లాంఛ్, ఇతర ఈవెంట్స్ లో చెబుతాను అన్నారు.
*మిస్ ఇండియా ఫైనలిస్ట్, హీరోయిన్ మేఘనా ముఖర్జీ మాట్లాడుతూ -* “బరాబర్ ప్రేమిస్తా ” సినిమాతో హీరోయిన్ గా మీకు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సంపత్, ప్రొడ్యూసర్స్ చందు, చిన్ని, ఎవిఆర్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా మీ అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. మా టీమ్ అంతా సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. త్వరలోనే మిమ్మల్ని అలరించేందుకు థియేటర్స్ లోకి వస్తాం. మీ సపోర్ట్ మాకు ఉంటుందని కోరుకుంటున్నా అన్నారు.
*నిర్మాత చిన్ని గాయత్రి మాట్లాడుతూ -* “బరాబర్ ప్రేమిస్తా ” సినిమా టీజర్ లాంఛ్ చేసిన డైనమిక్ డైరెక్టర్ వినాయక్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. నేను పరుచూరి మురళి, జయంత్ సి పరాన్జే గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశాను. “బరాబర్ ప్రేమిస్తా ” సినిమా కథ వినగానే నచ్చి నా ఫ్రెండ్స్ తో కలిసి ప్రొడ్యూస్ చేశాను. సినిమా బాగా రావాలని డేస్ పెరిగినా, బడ్జెట్ పెరిగినా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మంచి క్వాలిటీతో మూవీ చేశాం. “బరాబర్ ప్రేమిస్తా ” సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. అన్నారు.
*నటుడు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ -* “బరాబర్ ప్రేమిస్తా ” సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సంపత్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి రోల్ తో మీ ముందుకు రావడం హ్యాపీగా ఉంది. “బరాబర్ ప్రేమిస్తా ” సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు.
*సినిమాటోగ్రాఫర్ వైఆర్ శేఖర్ మాట్లాడుతూ -* డైరెక్టర్ సంపత్ గారితో ఎన్నో రోజులుగా ట్రావెల్ చేస్తున్నాను. నన్ను నమ్మి ఈ చిత్రానికి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్నా. “బరాబర్ ప్రేమిస్తా ” సినిమా విజయంపై మేమంతా పూర్తి నమ్మకంతో ఉన్నాం అన్నారు.
*మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ద్రువన్ మాట్లాడుతూ -* “బరాబర్ ప్రేమిస్తా ” సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ తో వస్తోంది. ఈ చిత్రంలో నాలుగు బ్యూటిఫుల్ సాంగ్స్ చేశాను. బీజీఎం బాగా కుదిరింది. ఇలాంటి కొత్త తరహా చిత్రానికి పనిచేయడం హ్యాపీగా ఉంది. లీడ్ పెయిర్ గా చేసిన చంద్రహాస్, మేఘనా జంట మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. “బరాబర్ ప్రేమిస్తా ” సినిమా మీ అందరినీ ఆకట్టుకుందని నమ్మకం ఉంది అన్నారు.
*ఎడిటర్ బొంతల నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ -* డైరెక్టర్ సంపత్ గారితో నాకిది రెండో సినిమా. ఆయన లవ్ స్టోరీ బాగా రూపొందిస్తాడు. అయితే “బరాబర్ ప్రేమిస్తా ” చిత్రంలో లవ్ అండ్ యాక్షన్ రెండూ సూపర్బ్ గా తెరకెక్కించారు. పోస్ట్ ప్రొడక్షన్ టైమ్ లో ఈ సినిమా ఎంత బాగా వస్తుందో చూసి హ్యాపీగా అనిపించింది అన్నారు.
*గీత రచయిత సురేష్ గంగుల మాట్లాడుతూ -* “బరాబర్ ప్రేమిస్తా ” సినిమాకు పాటలు రాసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో రెండు అద్భుతమైన పాటలు రాసే అవకాశం దక్కింది. ఒక మాస్ సాంగ్, ఒక మెలొడీ సాంగ్ రాశాను. ద్రువన్ గారు బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. డైరెక్టర్ సంపత్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. “బరాబర్ ప్రేమిస్తా ” సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
*డైలాగ్ రైటర్ రమేష్ రాయ్ మాట్లాడుతూ -* “బరాబర్ ప్రేమిస్తా ” సినిమా తెలంగాణ నేపథ్యంతో సాగుతుంది. సినిమా టైటిల్ లాగే డైలాగ్స్ కూడా తగ్గేదెలే అన్నట్లు ఉంటాయి. ఈ చిత్రంతో నాకు డైలాగ్ రైటర్ గా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.
నటీనటులు – ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘనా ముఖర్జీ, అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్, తదితరులు
టెక్నికల్ టీమ్
డైలాగ్స్ – రమేష్ రాయ్
డీవోపీ – వైఆర్ శేఖర్
మ్యూజిక్ – ఆర్ఆర్ ద్రువన్
ఎడిటర్ – బొంతల నాగేశ్వర రెడ్డి
కథ – ఎంఏ తిరుపతి
స్క్రీన్ ప్లే – సంపత్ రుద్ర, ఎంఏ తిరుపతి
పీఆర్ఓ – సాయి సతీష్
ప్రొడ్యూసర్స్ – గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్
డైరెక్టర్ – సంపత్ రుద్ర