
BAALI Movie Poster and Glimpse Unveiled
The film “Baali”, produced jointly by Palik Studios, BSRK, DRS, and RS Creation Team Work Media, is being directed by Palik, who is also responsible for the story and screenplay. The movie is inspired by a true incident that took place in a remote tribal region. It presents a unique perspective on the concept of reincarnation, centered around the idea: “What if God stood by a human?”
“Baali” is set to be a complete rural drama blending five songs, spine-chilling scenes, comedy, sentiment, and engaging storytelling. Director Palik shared that the film aims to deliver a gripping narrative through an authentic folk backdrop.
On the auspicious occasion of Vijayadashami, the makers released the first poster and a glimpse from the film, generating curiosity among movie lovers.
The film has been shot in stunning locations including Medaram, Eturunagaram, along the Chhattisgarh border, and around Hyderabad. The ensemble cast includes Gabbar Singh Sai, Suman Shetty, Jeeva, Sriman, Mohana, Raghu, Anirudh, Aishwarya, Revathi, Sanjay Patil, Manasa, among others.
Crew Details:
Music: John Bhushan, Lyrics: Suresh Gangula, Cinematography: Anam Venkat, Art: Naresh, Satya Nagesh, Naidu, Editing: Nishant, PRO: Chandu Ramesh, Dialogues: Thotapalli Sainath, Story, Screenplay, Direction: Palik
The movie is slated for a theatrical release in 2026, and the team is planning a multi-language release in Telugu, Tamil, Hindi, Malayalam, and Kannada.As the project involves multiple producers, the team has decided to operate under the banner “Team Work Media”, with all collaborators working collectively under this label.
విజయదశమి సందర్బంగా “బాలి” చిత్రం పోస్టర్, గ్లింప్స్ రిలీజ్
పాలిక్ స్టూడియోస్, బి ఎస్ ఆర్ కె, డి ఆర్ ఎస్ మరియు ఆర్ ఎస్ క్రియేషన్ టీమ్ వర్క్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “బాలి”. ఈ చిత్రానికి పాలిక్ కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. మారుమూల ప్రాంతంలోని ఒక తాండాలో జరిగిన యధార్థ కథని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు జన్మలకు సంబంధించిన ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ మనిషికి భగవంతుడు తోడైతే అనే ఒక మంచి కథ నేపథ్యంతో నిర్మిస్తున్న చిత్రం “బాలి”. ఈ చిత్రంలో ఐదు పాటలు, ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు, కామెడీ, సెంటిమెంట్ అన్ని కల కలుపుకొని ఒక చక్కటి జానపద చిత్రంగా మీ ముందుకు రాబోతుంది అన్నారు దర్శకుడు పాలిక్. విజయదశమి సందర్బంగా ఈ చిత్రం యొక్క పోస్టర్ మరియు గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రం ఇటీవల మేడారం, ఏటూరు నాగారం, ఛత్తిష్ ఘడ్ సరిహద్దుల్లో మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్నో అద్భుతమైన లొకేషన్ల లో చిత్రీకరించారు. ఈ చిత్రం లో గబ్బర్ సింగ్ సాయి, సుమన్ శెట్టి, జీవ,శ్రీమన్, మోహన, రఘు, అనిరుద్, ఐశ్వర్య, రేవతి, సంజయ్ పాటిల్ , మానస.. తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం జాన్ భూషణ్, పాటలు: సురేష్ గంగుల, కెమెరామెన్: ఆనం వెంకట్, ఆర్ట్ :నరేష్ , సత్య నగేష్, నాయుడు, ఎడిటర్: నిశాంత్, పి ఆర్ ఓ : చందు రమేష్, మాటలు. తోటపల్లి సాయినాథ్, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: పాలిక్.
ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం 2026 లో థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు మేకర్స్.
నిర్మాతలు ఎక్కువ మంది ఉండడంతో టీం వర్క్ మీడియా అని ఒక బ్యానర్ పేరుని ఖరారు చేసి అందరూ ఆ బ్యానర్ లో పని చేస్తున్నట్లు తెలిపారు.