
సీతా పయనం టీజర్ బ్యూటీఫుల్ గా వుంది – డైరెక్టర్ సుకుమార్
మల్టీ ట్యాలెంటెడ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా, నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అర్జున్, ధ్రువ సర్జా పవర్ ఫుల్ పవర్ ఫుల్ పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. మేకర్స్ ఈ రోజు టీజర్ ని లాంచ్ చేశారు. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా హాజసయ్యారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం . కొంచెం టెన్షన్ గా ఉంది. ఇక్కడ ఇద్దరు లెజెండ్స్ ఉన్నారు. ఇద్దరు యాక్టర్స్ మాత్రమె కాదు డైరెక్టర్స్ కూడా. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు అర్జున్ గారిని చూశా.ను ఆయన చూస్తే ఎవరైనా ఎడ్మైర్ అయిపోతారు. అంత కూల్ గా కంపోజ్ గా ఉంటారు. ఇప్పటికీ అలానే ఉన్నారు. ఆయనతో పాటు ఈ స్టేజ్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. కూతురు కోసం సినిమా చేస్తున్నప్పుడు ఆ ఎమోషన్ నాకు తెలుసు. ఈ జర్నీనే ఒక సినిమాగా తీయవచ్చు. ఆయన కోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఓం, ఏ. ఉపేంద్ర… ఇలాంటి కల్ట్ సినిమాలు తీసిన తర్వాత ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చు. నేను ఆ మూడు సినిమాలు తీసి ఉంటే రిటర్న్ అయిపోయే వాడిని. అంత కల్ట్ మూవీస్ మాకు ఇచ్చిన ఉపేంద్ర గారికి థాంక్యూ. ఈరోజు నా స్క్రీన్ ప్లే ఇలా ఉందంటే కారణం ఆ మూడు సినిమాలే. ఎప్పటికప్పుడు ఆడియన్స్ సర్ప్రైజ్ చేయడం ఉపేంద్ర గారికి అలవాటు. ఆయన చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్. ఇందులో ఒక పాట విన్నాను. చాలా నచ్చింది. ఆ పాట వినగానే అది చంద్రబోస్ గారు రాసిన పాటనే నాకు తెలిసిపోయింది. అనూప్ మ్యూజిక్ డైరెక్టర్ కాకముందే కీ బోర్డ్ ప్లేయర్ గా పాపులర్. ఇందులో మంచి మ్యూజిక్ చేశారు. సాంగ్లో మూమెంట్స్ చాలా బాగున్నాయి. ఆ మూమెంట్స్ ఎవరు చేశారంటే సృష్టి అని చెప్పారు. సూసేకి సాంగ్ లో 80% మూమెంట్స్ తనే కంపోజ్ చేసింది. నిరంజన్ ఐశ్వర్య టీజర్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపించారు. సాంగ్స్ ఫైట్స్ చాలా బాగున్నాయి. సీత పయనం చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.’అన్నారు
రియల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ. .. అందరికి నమస్కారం. యాక్షన్ కింగ్ అంటే అర్జున్ గారు. ఇండియాలో అర్జున్ గారు ఒక బ్రూస్ లీ లాగా. కన్నడలో మామూలు క్రేజ్ కాదు. వెంటనే తమిళ్ లో సినిమాలు చేశారు. ఆయన అప్పుడే పాన్ ఇండియన్ స్టార్. నేను కాలేజీ చదివిన రోజుల్లోనే నాకు డైలాగ్ రైటర్ గా అవకాశం ఇచ్చిన హీరో అర్జున్ గారు. ఆయనతో స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. అప్పుడు నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మా అన్నయ్య కొడుకుకి అవకాశం ఇచ్చారు. టీజర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సుకుమార్ గారికి నేనే కాదు చాలామంది డైరెక్టర్ ఆయన ఫ్యాన్స్. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ నీ కమర్షియల్ గా ఎలా చూపించాలి అని పంచ్ కొట్టిన డైరెక్టర్ సుకుమార్ గారు. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. అర్జున్ గారు ఈ కథ చెప్పినప్పుడే ఈ సినిమా నేను చూసేసాను. అంత బ్యూటిఫుల్ గా చెప్పారు. టీజర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చివర్లో అర్జున్ గారు ధ్రువ రావడం గొప్ప థ్రిల్ ఇచ్చింది, తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’ అని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ అర్జున్ సర్జా మాట్లాడుతూ.. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన సుకుమార్ గారికి మై ఫ్రెండ్ ఉపేంద్ర గారికి మా టీమ్ అందరికీ మీడియాకి అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు చాలా ఇష్టమైన ఇద్దరు దర్శకులు ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా రావడం చాలా ఆనందంగా ఉంది. నేను హనుమాన్ జంక్షన్ సినిమాలో హీరోగా నటించిన అప్పుడు ఒక ఆస్పైరింగ్ అసోసియేట్ డైరెక్టర్ ని చూశాను. అది ఎవరో కాదు మన సుకుమార్ గారు. ఈరోజు ఆయన ఒక మహా వృక్షంలో ఎదిగారు. ఇండియాలోనే తగ్గేదేలే. ఇండియాలోనే టాప్ డైరెక్టర్లు ఆయన ఒకరిని చెప్పడంలో చాలా గర్వంగా ఉంది. ఆయన చేసే ప్రతి సినిమా ఒక మైల్ స్టోన్. ఆయన ఈ వేడుకకు రావడం ఎప్పుడు మర్చిపోను. హీరోగా మా బ్రదర్ ఒక కన్నడ సినిమా తీశారు ఆ సినిమాకి మంచి డైలాగ్ కావాలనుకున్నాం. ఒక షార్ప్ కుర్రాన్ని పిలిపించాను. ఆయన చూస్తే మిథున్ చక్రవర్తిలా కనిపించారు. అతనే మన ఉపేంద్ర గారు. అలా ఫస్ట్ టైం ఆయన్ని కలిశాను తర్వాత అయినా డైరెక్ట్ అయ్యారు.ఆయన ఎలాంటి సినిమాలు తీశారో అందరికి తెలుసు. ఆయన టైటిల్స్ ఎంత వైవిధ్యంగా ఉంటాయో ఆయన సినిమాలు కూడా అంతే వైవిధ్యంగా ఉంటాయి. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఆయన ఫ్యాన్స్. ఆయన గెస్ట్ గా రావడం చాలా ఆనందంగా ఉంది. మా అమ్మాయి కోసం ఈ సినిమాని మొదలు పెట్టాను .తన టాలెంట్ హార్డ్ వర్క్ చూసి ఒక మంచి సినిమా తీయాలని స్టార్ట్ చేశాను. జనాలకి ఈ సినిమా నచ్చుతుందని నమ్మకం ఉంది. తెలుగు ఆడియన్స్ నాకు ఇచ్చిన ప్రేమ అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అంతే అభిమానం మా అమ్మాయి మీద చూపించాలని కోరుకుంటున్నాను. ఇందులో నిరంజన్ చాలా వర్సటైల్ గా ఉండే క్యారెక్టర్ చేశాడు. నిజానికి ఈ కథ మా అమ్మాయి కోసం రాసుకున్నాను. కానీ హీరో క్యారెక్టర్ చాలా బాగా ఎలివేట్ అయింది. తను ఉపేంద్ర గారి అన్నయ్య కొడుకు. చాలా అద్భుతంగా నటించాడు. చాలా మంచి ఫైటర్ డాన్సర్. తనలో చాలా డెడికేషన్ ఉంది. సత్య రాజ్ ప్రకాష్ రాజు గారు కూడా చాలా అద్భుతమైన పాత్రలో చేశారు. అనూప్ రూబెన్స్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ గారు ఈ సినిమాకి లిరిక్స్ రాయడం చాలా ఆనందాన్నిచ్చింది. తన వర్క్ నన్ను మెస్మరైజ్ చేసింది. అలాగే కాసర్ల శ్యామ్ కూడా మూడు పాటలు రాశారు. చాలా అద్భుతంగా వచ్చాయి. సృష్టి వర్మ చాలా చక్కగా కొరియోగ్రఫీ చేసింది. ఇందులో నాలుగు ఫైట్స్ ఉన్నాయి. అవన్నీ మీకు నచ్చేలా ఉంటాయి. ఈ కథని నేను ముందు చెప్పింది చిరంజీవి గారికి. ఈ కథ ఆయనకి చాలా నచ్చింది .పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా పూజా కార్యక్రమానికి వచ్చారు. నిజంగా నేను ఊహించలేదు. మేమంతా మీతో ఉన్నాం అని చెప్పడానికి వచ్చారు. అది అప్పటికి మర్చిపోలేను. అందరికీ ధన్యవాదాలు’అన్నారు
హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. సీతా పయనం నా ఫస్ట్ ఫిలిం. ఈ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. చాలా అద్భుతమైన టీం కలిసి ఈ సినిమా చేసింది. గొప్ప యాక్టర్స్ తో కలిసి పని చేసే అవకాశం అర్జున్ గారు ఇచ్చారు. ప్రకాష్ రాజు గారు సత్య రాజ్ గారు కోవై సరళ మేడం, అలాగే అద్భుతమైన టెక్నికల్ టీం ఈ సినిమాకి పనిచేసింది. ధ్రువ ఈ సినిమాలో ఒక కామియో రోల్ చేశారు. అది చాలా స్పెషల్ రోల్. ఈ సినిమాతో నాకు చైల్డ్ వుడ్ డ్రీమ్ ఫుల్ ఫిల్ అయింది. నేను మా డాడీకి బిగ్గెస్ట్ ఫ్యాన్ ని. ఆయనతో కలిసి ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాన్నగారిని నేనెప్పుడూ ఒక గురువు లాగా భావిస్తాను సుకుమార్ గారు ఈ వేడుకకు రావడం, మమ్మల్ని బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఉపేంద్ర గారు నాకు ఇష్టమైన ఫిలిం మేకర్. ఏ సినిమాని కొన్ని వందలసార్లు చూశాను. పవన్ కళ్యాణ్ గారు మా సినిమాని బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నిరంజన్ గ్రేట్ కోస్టార్. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది’అన్నారు
హీరో నిరంజన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాతో నన్ను పరిచయం చేసిన అర్జున్ గారికి ధన్యవాదాలు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టానని అనుకుంటున్నాను. మా బాబాయ్ ఉపేంద్ర గారి ఏ సినిమాలో ఒక చిన్న పాప లో నటించడం నా జర్నీ స్టార్ట్ అయింది. తెలుగులో ఇది నా ఫస్ట్ సినిమా. తప్పకుండా మీరందరూ ఆశీర్వదించి మీ మనసులో చిన్న స్థానాన్ని కల్పిస్తారని కోరుకుంటున్నాను. సుకుమార్ గారి సినిమాలకి నేను పెద్ద ఫ్యాన్. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఐశ్వర్య వండర్ఫుల్ కోస్టార్. చంద్రబోస్ గారు ఈ సినిమాకి మేజర్ పిల్లర్. తొందర్లోనే సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను’అన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అర్జున్ గారితో కలిసి వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను. బోస్ గారు అద్భుతమైన పాటలు రాశారు. మీరంతా పాటలు ఎంజాయ్ చేస్తారు. ఐశ్వర్య నిరంజన్ చాలా టాలెంటెడ్ యాక్టర్స్. పాటలు త్వరలో రిలీజ్ చేస్తాం. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. తప్పకుండా సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది
లిరిక్ రైటర్ చంద్రబోస్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఈ సినిమా పాటలకి భావాలు అందించాను. చాలా మంచి పాటలు. అర్జున్ గారికి సాహిత్యం సంగీతం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. ట్యూన్స్ కి కాకుండా ముందుగానే రాశాను. రంగస్థలం సినిమా కూడా అలానే వర్క్ చేయడం జరిగింది. ఆ సినిమా ఎంత విజయం సాదించిందో సీత పయనం కూడా అంత గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’అన్నారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
తారాగణం: ఐశ్వర్య అర్జున్, నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ, అర్జున్, ధ్రువ సర్జా
సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: అర్జున్ సర్జా
బ్యానర్: శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్
సంగీతం: అనుప్ రూబెన్స్
డిఓపి: జి బాలమురుగన్
ఎడిటర్: అయూబ్ ఖాన్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
సాహిత్యం: చంద్ర బోస్, కాసర్ల శ్యామ్
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్ మార్కెటింగ్: ఫస్ట్ షో