
సరస్వతి సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది – వరలక్ష్మి శరత్ కుమార్
వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం ‘సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.
థాంక్యూ మీట్లో హీరోయిన్ &డైరెక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. నేను నిన్న చాలా థియేటర్స్ కి వెళ్లాను. ప్రతి సీన్ కి ప్రతి డైలాగ్స్ చప్పట్లు కొడుతున్నారు. క్లైమాక్స్ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. అందరూ కూడా అద్భుతమైన రివ్యూస్ ఇచ్చారు. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా ఇప్పటివరకు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ.
ఇది కేవలం విమెన్ సెంట్రిక్ సినిమా కాదు. ఇది ఒక మంచి థ్రిల్లర్. యాక్షన్ , ఎమోషన్ లవ్ అని ఉన్నాయి. తప్పకుండా ఒకసారి వెళ్లి సినిమా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా చూసి అందరూ కూడా చాలా మంచి మెసేజులు పెట్టారు. మీ ప్రేమకి ధన్యవాదాలు. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఎంత ఎక్కువ మంది చూస్తే అంత సంతోషం. అందరికీ ధన్యవాదాలు.
నిచోలాయ్ సచ్దేవ్ మాట్లాడుతూ.. సరస్వతి టఫ్ స్టోరీ. ఇలాంటి సినిమాలు ఇలాంటి కథ చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. ఇది కేవలం మహిళల సినిమానే కాదు. ఇది ఒక మంచి థ్రిల్లర్ . ఒక సినిమా మనసుని కదిలిస్తే అది సక్సెస్ అయిట్లే. సరస్వతి కూడా అలా మనసుల్ని కదిలించిన సినిమా. తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఇదొక చిన్న సినిమా అయినప్పటికీ స్ట్రాంగ్ సినిమా. తప్పకుండా థియేటర్స్ లో సినిమా చూడాలని కోరుతున్నాను.
పూజా శరత్ కుమార్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సరస్వతి సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మీ అందరి థాంక్యూ సో మచ్. సినిమా వైరల్ గా మారడానికి మీరు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. ఇప్పటివరకు సినిమా చూసిన ఆడియన్స్ అందరు కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.
