షణ్ముఖ్ జస్వంత్ హీరోగా ఎమోషనల్ లవ్‌స్టోరీ
బుల్లితెరతో పాటు సోషల్‌మీడియా, యూట్యూబ్‌లో స్టార్‌గా పాపులరైన నటుడు షణ్ముఖ్ జస్వంత్ హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రం దసరా పర్వదినాన ప్రారంభమైంది.
లక్కీ మీడియా, ఎబీ సినిమాస్ పతాకంపై బెక్కెం వేణుగోపాల్ అనిల్ కుమార్ రవడ, భార్గవ్ మన్నె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విస్సా భీమశంకర్ దర్శకుడు. హీరో షణ్ముఖ్ జస్వంత్‌పై ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ నివ్వగా, బాలీవుడ్ నిర్మాత ఘు నిహాలాని కెమెరా స్వీచ్చాన్ చేశారు. హీరో విశ్వక్సేన్ దర్శకుడికి బౌండెడ్ స్క్రిప్ట్‌ను అందజేశారు. ముహుర్తపు సన్నివేశానికి నటుడు శివాజీ దర్శకత్వం వహించారు.
ఈసందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ ఎమోషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరో పాత్ర అందర్ని ఎంటర్టైన్చేస్తుంది. ఈ పాత్రకు నటుడు షణ్ముఖ్ జస్వంత్ యాప్ట్ అయ్యాడు. నవంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు.