
విష్ణు విన్యాసం ష్యూర్ షాట్ సూపర్ హిట్ .. 100% నవ్వుకుంటారు – శ్రీ విష్ణు
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు హిలేరియస్ జాయ్‌రైడ్ ‘విష్ణు విన్యాసం’తో అలరించబోతున్నారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇపటికే ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం, విష్ణు విన్యాసం సినిమా మొదలవడానికి మొదటి కారణం చారి గారు. ఆయన ద్వారానే మారుతి పరిచయమయ్యారు. కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. అలాగే మన నిర్మాతలు సుబ్రమణ్యం గారు సుమంత్ గారు సినిమాని అద్భుతంగా ప్రొడ్యూస్ చేశారు. వారితో కలిసి పని చేయడం చాలా హ్యాపీగా ఉంది. మాకు చాలా ఫ్రీడం ఇచ్చారు. వారి బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమా కోసం చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటారు. చాలా రోజులు గుర్తుంటుంది. మా టెక్నీషియన్స్ డీవోపీ సాయి శ్రీరామ్ ఎడిటర్ కార్తీ, మ్యూజిక్ రధన్ అందరికీ థాంక్యు. ఈ సినిమాలో పనిచేస్తున్న ప్రతి నటీనటులకు థాంక్యూ సో మచ్. నయన్ సారిక చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. తను ముందు ముందు మరింత మంచి స్థాయికి వెళ్తుందని నమ్ముతున్నాను. దర్శకుడు మారుతి చాలా కూల్ గా ఉంటాడు. చాలా మంచి మనిషి. సినిమా తప్పితే మరో ప్రపంచం తెలీదు. విష్ణు విన్యాసం ఫస్టాఫ్ అంతా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ కి సినిమా ఫ్యామిలీ డ్రామాగా మారుతుంది. సినిమా పూర్తి అయ్యేసరికి ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ఇది ష్యూర్ షాట్ సూపర్ హిట్ సినిమా. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి నవ్వుకోడానికి రండి. 100% నవ్వుకుంటారు. ఆ బాధ్యత నాది. 27న థియేటర్స్ లో కలుద్దాం.
హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా బ్యాక్ బోన్ నిర్మాతలు. సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. అన్ని దగ్గరుండి సమకూర్చారు. నాకు మనీషా క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ మారుతి గారికి థాంక్యూ. ఆయన ఆయన కెప్టెన్ కూల్. చాలా క్లారిటీతో డైరెక్ట్ చేస్తారు. శ్రీ విష్ణు గారు చాలా సపోర్ట్, గైడ్ చేశారు. నాకు మనీషా లాంటి క్యారెక్టర్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీ విష్ణు గారి నుంచి మీరు ఏవైతే కోరుకుంటున్నారో అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. సినిమా అదిరిపోతుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.
కేకే రాధా మోహన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. శ్రీ విష్ణు గారి సినిమా చూస్తే మన కష్టాలు బాధలన్నీ ఒక రెండు గంటలపాటు మర్చిపోతాం. అందుకే ఆయన కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఆ టైటిల్ కి ఆయన అర్హుడు. ఆయన నాతో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. సుమంత్ సుబ్రమణ్యం గారు మేము మంచి ఫ్రెండ్స్. సుమంత్ యువకుడు. నిర్మాతగా ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. మారుతి చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తీశాడు. ఈ సినిమా తర్వాత తనకు మంచి మంచి అవకాశాలు రావాలి. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. నిర్మాతలకు మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. విష్ణు గారు నా మీద చాలా నమ్మకం పెట్టారు. నేను చెప్పిన కథ తీగలనని నన్ను నమ్మారు. ఈ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమా ఎంత అద్భుతంగా రావడానికి కారణం విష్ణుగారు, అలాగే మా నిర్మాతలకి ప్రత్యేక ధన్యవాదాలు, వారి సపోర్ట్ వల్లే సినిమా ఇంత బెటర్ గా వచ్చింది. ఈ సినిమాకి పనిచేస్తున్న ప్రతి టెక్నీషియన్ కి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు.
నిర్మాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా 27వ కి రావడానికి కారణం హీరో శ్రీ విష్ణు గారు. ఆయన లేకపోతే ఈ సినిమా అసలు వచ్చేది కాదు. ఆయన హెల్ప్ ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఆయన చేసిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన్ని జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటాం. ఈ సినిమా విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. విష్ణు గారు డబ్బులు తీసుకువచ్చారు, అలాగే మా బ్యానర్ కి పేరు కూడా తీసుకొచ్చారు. సారిక అద్భుతమైన హీరోయిన్. ఎలాంటి సన్నివేశమైన సింగల్ టేక్ లో చేస్తుంది. మారుతి చాలా కూల్ డైరెక్టర్. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు థాం.క్యూ 27న ఈ సినిమా వస్తుంది. విష్ణుగారి విన్యాసాలు చాలా బాగుంటాయి. యూత్ ఫ్యామిలీ అందరికీ కనెక్ట్ అవుతుంది.
నిర్మాత సుమంత్ మాట్లాడుతూ .. అందరికి నమస్కారం. సినిమా 27న రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాకి మీ అందరి సపోర్ట్ కావాలి, ఫ్యామిలీస్ తో కలిసి వెళ్లి చూడండి మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో విష్ణు గారి టైమింగ్ మామూలుగా ఉండదు. ఆయనతో కలిసి పనిచేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. 27న సినిమా వస్తుంది. అందరూ సినిమా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను
మ్యూజిక్ డైరెక్టర్ రధన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా పాటలు విని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా వెరైటీ పాటలు ఉన్నాయి. ఈ సినిమా చేస్తున్నప్పుడు విష్ణు గారి ఎంకరేజ్మెంట్ మర్చిపోలేను. మా నిర్మాత సుబ్రహ్మణ్యం గారు ఒక తండ్రి లాగా సపోర్ట్ చేశారు. తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరించేలా ఉంటుంది
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. విష్ణు గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. అలాగే నిర్మాత సుబ్రహ్మణ్యం గారు ఈ సినిమాని చాలా పాషన్ తో నిర్మించారు. ఆయన తీసిన సినిమాలన్నీ మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తీశారు. ఈ విష్ణు విన్యాసంతో సూపర్ హిట్ కొట్టబోతున్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని ఇండస్ట్రీ అంతా టాక్. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బె.స్ట్ తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించబోతుంది.
