Mega Power Star Ram Charan’s Peddi Releasing Worldwide In June

మిస్టర్ ఎక్స్ మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే స్పై యాక్షన్ థ్రిల్లర్ – ఆర్య
ఆర్య, గౌతమ్ కార్తీక్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్’. ఎఫ్ఐఆర్ సినిమాతో ఆకట్టుకున్న మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. మంజు వారియర్ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రంలో అతుల్య రవి, రైజా విల్సన్, అనఘ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 17న తెలుగు, తమిళ్ లో వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో ఆర్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకలో మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు మూడేళ్ల తర్వాత నా సినిమా తెలుగులో రిలీజ్ అవుతోంది. సైంధవ్‌లో ఒక గెస్ట్ రోల్ చేశాను. పూర్తిస్థాయిలో ‘మిస్టర్ ఎక్స్ తో రావడం చాలా ఆనందంగా ఉంది. మిస్టర్ ఎక్స్ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. డైరెక్టర్ మను ఆనంద్ గారి ఎఫ్ఐఆర్ సినిమా నాకు చాలా ఇష్టం. ఆయన మిస్టర్ ఎక్స్ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. ఇందులో యాక్షన్, ఎమోషన్స్, క్యారెక్టర్స్ అన్నీ కలిసి గొప్ప అనుభూతి కలిగించేలా తీర్చిదిద్దారు. గౌతమ్ చాలా కొత్త క్యారెక్టర్ చేశాడు. అతను ఇప్పటివరకు చేయని పాత్ర ఇది. మంజు మేడం అద్భుతమైన యాక్షన్ చేశారు. ఆమె యాక్షన్ బిగ్ స్క్రీన్ మీద చాలా మంచి అనుభూతి ఇస్తుంది. అలాగే అతుల్య పాత్ర కూడా చాలా బాగా చేసింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా మంచి థియేట్రికల్ అనుభూతి ఇస్తుంది. తప్పకుండా సినిమాకు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
మంజు వారియర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా మంచి టీంతో కలిసి చేసిన సినిమా ఇది. ఇంత మంచి సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ మను ఈ సినిమాలో నాకు చాలా బలమైన పాత్ర ఇచ్చారు. నా కెరీర్లో ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదు. ఈ సినిమాను ఇంత లావిష్‌గా నిర్మించిన మా నిర్మాతలకు ధన్యవాదాలు. ఆర్య ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అలాగే గౌతమ్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర చేశారు. ఈ సినిమాలో శరత్ కుమార్ గారితో కలిసి నటించే అవకాశం దొరికింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా. అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ పాత్ర పోషించాను. ఏప్రిల్ 17న తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను. ఇది కొత్త తరహా యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ. చాలా భిన్నంగా ప్రయత్నించాము. మంచి టీంతో కలిసి పని చేశాము. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను.
అతుల్య రవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా మంచి థియేట్రికల్ అనుభూతి ఇస్తుంది. ఏప్రిల్ 17న అందరూ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను. ఇందులో చాలా డిఫరెంట్ పాత్ర చేశాను. ఆర్య గారితో నటించడం మంచి అనుభవం. డైరెక్టర్ మను ఆనంద్ గారు నా మీద చాలా నమ్మకం పెట్టారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టానని భావిస్తున్నాను. మంజు మేడం నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపిస్తారు. వారి ప్రేమకు కృతజ్ఞతలు. తప్పకుండా ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ మను ఆనంద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. మిస్టర్ ఎక్స్ ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఏప్రిల్ 17న తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్లకు వెళ్లి ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఎక్స్ పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది చాలా క్లిష్టమైన కథ. అయితే మా నటీనటులందరూ పాత్రలను బాగా అర్థం చేసుకుని అద్భుతంగా నటించారు. ఆర్య గారు, గౌతమ్, మంజు గారు, శరత్ కుమార్ గారు అందరూ అద్భుతంగా నటించారు. వారి నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఏప్రిల్ 17న థియేటర్లలో చూడండి. మీరు కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ రైడ్ ని ఎక్స్ పీరియన్స్ చేస్తారు.
తారాగణం: ఆర్య, గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: మను ఆనంద్
నిర్మాత: ఎస్ లక్ష్మణ్ కుమార్
బ్యానర్: ప్రిన్స్ పిక్చర్స్
సంగీతం: ధిబు నినన్ థామస్
డీవోపీ: తన్వీర్ మీర్
ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్
ఆర్ట్: ఇందులాల్ కవీద్
పీఆర్వో: వంశీ-శేఖర్
