మంచి సినిమాని ఆదరిస్తారని మరోసారి నిరూపించారు – రవికుమార్ చౌదరి&టీం
యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన హోల్సమ్ ఎంటర్టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటించింది. మన్నారా చోప్రా మరో కీలక పాత్రలో కనిపించింది. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 2న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి సూపర్బ్ రెస్పాన్స్ తో విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో టీం సక్సెస్ మీట్ నిర్వహించింది.
సక్సెస్ మీట్ లో డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ.. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా చేశాను. మా నిర్మాత శివకుమార్ గారికి థాంక్స్. రాజ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్పాండే, రఘు బాబు ఇలా మంచి యాక్టర్స్ ని ఇచ్చారు. మంచి లోకేషన్స్ ఇచ్చారు. జవహర్ రెడ్డి చాలా హార్ట్ ఫుల్ గా పని చేశారు. రాజ్ అద్భుతంగా పెర్ఫార్ చేశాడు. తెలుగు ప్రేక్షకులకు హ్యాట్సప్. నిన్నటి కంటే ఈ రోజు కలెక్షన్స్ థియేటర్స్ పెరిగాయి. మంచి సినిమాని ఏదీ అడ్డుకోలేదని నిరూపించారు ఆడియన్స్. జేబీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మాల్వి చాలా చక్కగా నటించింది. మన్నారా చోప్రా రాధబాయ్ పాటకు మాస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్’ అన్నారు.
హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాట్లాడుతూ.. ఈ సినిమాతో తెలుగులో పరిచయం చేసిన నిర్మాత శివకుమార్ గారికి థాంక్స్. మాస్ క్యారెక్టర్ చేశాను. డైరెక్టర్ బ్యూటీఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు. అందరూ అద్భుతంగా పెర్ఫార్ చేశారు. సినిమాని ఆదరిస్తున్న ఆడియన్స్ కి థాంక్స్. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. తప్పకుండా అందరూ థియేటర్ లో సినిమా చూసి సపోర్ట్ చేయాలి’ అన్నారు.
మన్నారా చోప్రా మాట్లాడుతూ.. మీ అందరికీ సపోర్ట్ కి చాలా థాంక్ యూ. ‘తిరగబడరసామీ’ పెద్ద హిట్. థియేటర్స్ పెరుగుతున్నాయి. చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. రవి గారికి థాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత శివగారికి థాంక్స్. రాజ్, మాల్వితో కలసి పని చేయడం ఆనందంగా వుంది. మకరంద్ దేశ్పాండే గారితో స్క్రీన్ చేసుకోవడం లక్కీగా భావిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు’ తెలిపారు.
నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. ‘‘ అందరికీ నమస్కారం. ‘తిరగబడరసామీ’ సక్సెస్ మీట్ జరుపుకోవడం చాలా ఆనందంగా వుంది. సినిమా 200 థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజు మరో 28 థియేటర్స్ పెరిగాయి. సినిమా పై మంచి రిపోర్ట్, రిజల్ట్ వుంది. సినిమాని సపోర్ట్ చేసున్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. రవి కుమార్ గా అద్భుతంగా సినిమా తీశారు. చాలా హ్యాపీగా ఈ ప్రాజెక్ట్ చేశాం. ఆయన చెప్పినదాని కంటే అద్భుతంగా చూపించారు. జవహర్ రెడ్డి విజువల్స్, జేబీ మ్యూజిక్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రేక్షకులు సినిమాని మరింతగా సపోర్ట్ చేయాలి’ అని కోరారు. ఈ సక్సెస్ మీట్ చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.
తారాగణం: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: ఎ ఎస్ రవికుమార్ చౌదరి
నిర్మాత: మల్కాపురం శివకుమార్
బ్యానర్: సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా
సంగీతం: జెబి &భోలే షావలి
డీవోపీ: జవహర్ రెడ్డి యం. ఎన్
ఎడిటర్: బస్వా పైడిరెడ్డి
ఆర్ట్: రవికుమార్ గుర్రం
ఫైట్స్ – పృద్వీ, కార్తీక్
లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, శ్రీమణి
పీఆర్వో: వంశీ శేఖర్