W/O Anirvesh would captivate audiences and achieve success – Allari Naresh
జినీవర్స్ ను సంప్రదించండి – విజయవంతంగా దూసుకెళ్లండి!!
ఓ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించేవి… కళ్ళు చెదిరే సెట్టింగ్స్, కళకళలాడే తారాగణం, ఫారిన్ లొకేషన్స్ కానే కాదు. ఓ సినిమా విజయాన్ని శాసించేవి.. కథ-కథనాలు, ప్రణాళికాబద్ధ నిర్మాణ దక్షత మాత్రమే. ముఖ్యంగా… నిర్మాతలుగా తమదైన ముద్ర వేయాలనే తహతహతో… ఈ రంగంలోకి అరంగేట్రం చేసే కొత్త నిర్మాతలు… సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో తడబడి, తీవ్రంగా నష్టపోతున్నారు. వారు నష్టపోతున్నది కోట్లాది రూపాయల తమ కష్టార్జితాన్ని మాత్రమే కాదు, రేయింబవళ్లు శ్రమించి, తమ రంగంలో కూడబెట్టుకున్న పేరు ప్రతిష్టలు కూడా!!
సినిమా విజయాన్ని శాసించే కథ – కథనాల ఎంపికలో కొత్తవాళ్లకు మాత్రమే కాకుండా… ఈ రంగంలో అనుభవజ్ఞులైన సీనియర్ నిర్మాతలకు కూడా ఉపకరించేందుకు ” జినీవర్స్ ” నడుం కట్టింది!!
సినిమా రంగంలో రచన – దర్శకత్వం – నిర్మాణం – పంపిణీ వంటి విభాగాల్లో అపారమైన అనుభవం కలిగినవారితోపాటు, మార్కెటింగ్ – ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ వంటి అంశాల పట్ల సైతం విశేష అనుభవం కలిగినవారిని ఒక టీమ్ గా ఏర్పాటు చేసి, బౌండెడ్ స్క్రిప్ట్ తోపాటు… ఒక డెమో ఫిల్మ్ ను నిర్మాతలకు అందించే ఓ బృహత్ ప్రణాలికను జినీవర్స్ సిద్ధం చేసింది. భారతీయ సినిమా చరిత్రలోనే ప్రప్రథమమైన విశిష్ట ప్రక్రియ ఇది!!
పద్మవ్యూహం లాంటి సినిమా నిర్మాణ రంగంలోకి ప్రవేశించడం మాత్రమే కాదు… దాన్నుంచి విజయవంతంగా బయటకు రావడం నేర్చుకోవాలనే ఔత్సాహిక నిర్మాతలు… మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కథలను ఎంపిక చేసుకుని ఈ పర్యాయం ఎట్టి పరిస్థితుల్లో హిట్టు కొట్టి తీరాలని తీర్మానించుకున్న సీనియర్ నిర్మాతలకు జినీవర్స్ ఓ కొంగు బంగారమని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు!!
సినిమా రంగంలో సుదీర్ఘమైన అనుభవంతోపాటు… సమర్ధత, విశ్వసనీయతలకు మారుపేరైన ఎన్.బల్వంత్ సింగ్ జినీవర్స్ కు సారధ్యం వహిస్తున్నారు!!
ఆసక్తి కలవారు ముందుగా తీసుకున్న అప్పాయింట్మెంట్ తో జినీవర్స్ ని సంప్రదించగలరు.
సంప్రదించవలసిన నెంబర్ :
+91-8297063000