
ఘనంగా గుడ్ టైమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఈ నెల 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
ఎకో క్రాఫ్ట్ మీడియా సమర్పణలో, మూవీ బ్రాట్స్ బ్యానర్ పై రమేష్ జిల్లా నిర్మాతగా, చాణక్య జిల్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “గుడ్ టైమ్”. ఈ చిత్రంలో నిఖిల్ గాజుల, అన్యుక్త నలాని, హృతిక్ శెట్టి, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. “గుడ్ టైమ్” సినిమా ఈ నెల 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్, హీరోయిన్ కామాక్షి భాస్కర్ల అతిథులు గా బుధవారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దినేష్ కార్తీక్ మాట్లాడుతూ – మా చిత్రం టీజర్, ట్రైలర్ మీరు చూశారు. టీజర్, ట్రైలర్ మీకు బాగా నచ్చాయి. ఇక మా మూవీని థియేటర్స్ లో చూడటమే మిగిలిఉంది. ఈ నెల 9న థియేటర్స్ కు వచ్చి మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
రైటర్ అభిరామ్ మాట్లాడుతూ – ఒక యావరేజ్ కుర్రాడి పీడకల ఈ సినిమా. అది ఎలా ఉంటుందో మీరే థియేటర్స్ లో చూడబోతున్నారు. మా టీమ్ ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
ఎడిటర్ సాయి తరుణ్ మాట్లాడుతూ – మా సినిమా మీకు రెండు గంటలు ఎంటర్ టైన్ మెంట్ అందిస్తుంది. ఎక్కడా బోర్ కొట్టదు. మంచి కంటెంట్ ను నమ్మి మేమంతా సినిమా చేశాం. థియేటర్స్ లో మా మూవీ చూడండి. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ నిర్వాణ్ ఆత్రేయ మాట్లాడుతూ – గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు చాలా హార్డ్ వర్క్ చేస్తూ వస్తున్నాం. మా మూవీ సాంగ్స్ మీకు బాగా నచ్చాయని నమ్ముతున్నాం. మా మూవీ టీజర్, ట్రైలర్ లాగే సినిమా కూడా మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. అన్నారు.
నటుడు ధన్ రాజ్ మాట్లాడుతూ – అల్వాల్ లో ఉండే ఒక లత్కోర్ గాని స్టోరీ ఇది. నిఖిల్, హృతిక్ శెట్టి, నా కాంబినేషన్ సీన్స్ హిలేరియస్ గా వచ్చాయి. మీ ఫ్రెండ్స్ తో మా సినిమా చూస్తే మరింతగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
నటుడు హృతిక్ శెట్టి మాట్లాడుతూ – అల్వాల్ బస్తీని దగ్గరగా చూసిన ఫీల్ మా సినిమాతో మీకు కలుగుతుంది. మా హీరో ఈ సినిమాలో అప్పులు తీసుకుంటాడు గానీ తిరిగి ఇవ్వడు. ఈ నెల 9న డేట్ సేవ్ చేసుకోండి. మా మూవీ చూస్తూ థియేటర్స్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
నటుడు హరి మున్నంగి మాట్లాడుతూ – రీసెంట్ గా అమీర్ లోగ్ చిత్రంలో నటించాను. ఆ సినిమాలో సాఫ్ట్ రోల్ చేశా. కానీ ఈ సినిమాలో మాత్రం కంప్లీట్ రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. పైసా వసూల్ సినిమా ఇది. థియేటర్స్ కు వెళ్లిన మీరు ఏమాత్రం డిజప్పాయింట్ కారు. అన్నారు.
నటి సౌందర్య లహరి మాట్లాడుతూ – ఈ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఈ జెనరేషన్ తో పాటు నిన్నటితరం వారికి కూడా మా సినిమా బాగా నచ్చుతుంది. ఈ గుడ్ టైమ్ సినిమా మా అందరికీ గుడ్ టైం తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు.
సీయీవో ఐశ్వర్య జిల్లా మాట్లాడుతూ – మా జర్నీలో ఇప్పటిదాకా 80 పర్సెంట్ సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. థియేటర్స్ లో మీరు సినిమా చూసి ఆదరిస్తే 100 శాతం సక్సెస్ అవుతాం. కాలేజ్ స్టూడెంట్స్ కు, పెళ్లి కాని బ్యాచ్ లర్స్ కు మా సినిమా బాగా నచ్చుతుంది. థియేటర్స్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
ప్రొడ్యూసర్ రమేష్ జిల్లా మాట్లాడుతూ – మా సినిమాకు పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. ఈ రోజు ఈవెంట్ కు వచ్చి మీరంతా సపోర్ట్ చేయడం హ్యాపీగా ఉంది. థియేటర్స్ లో ఈ నెల 9న మా సినిమా రిలీజ్ అవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రమిది. యూత్ కు అయితే ఇంకా బాగా నచ్చుతుంది. ప్రతి యూత్ ఆడియెన్ మా సినిమాతో రిలేట్ అవుతారు. వాళ్లను స్క్రీన్ మీద చూసుకున్నట్లు ఉంటుంది. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్, ఫన్ తో వస్తున్న మా సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నటి సునీత మనోహర్ మాట్లాడుతూ – ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ప్రతి ఏజ్ గ్రూప్ ఆఢియెన్ కు నచ్చే సినిమా ఇది. మా నిఖిల్, అన్యుక్త..ఇలా ప్రతి ఆర్టిస్ట్ పర్ ఫార్మెన్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మా ప్రొడ్యూసర్ కు ఈ సినిమా మంచి కలెక్షన్స్ తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.
అతిథిగా వచ్చిన డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ – గుడ్ టైమ్ టైటిట్ చాలా బాగుంది. ఏ సినిమాకైనా ఈ టైటిల్ పెట్టుకోవచ్చు. అంతా యంగ్ టాలెంట్ ఈ సినిమాకు వర్క్ చేశారు. హీరోగా నిఖిల్ మంచి పేరు తెచ్చుకుంటాడు. టీజర్ చాలా బాగుంది. ప్రతి షాట్ ఒరిజినల్ గా కనిపించింది. నా పొలిమేర 1 సినిమాను కూడా ఇలాగే రియలిస్టిక్ గా తెరకెక్కించాను. ఈ యంగ్ టీమ్ తో డైరెక్టర్ ఒక మంచి మూవీ చేశాడని నమ్ముతున్నా. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
అతిథిగా వచ్చిన హీరోయిన్ కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ – ఇండస్ట్రీలో సరైన గుర్తింపు కోసం నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నన్ను ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పిలిచనప్పుడు సర్ ప్రైజ్ అయ్యాను. మా పొలిమేర సినిమా రిలీజ్ టైమ్ లో ఎవరైనా మంచి గెస్ట్ వచ్చి ప్రమోట్ చేస్తే బాగుండును అని అనుకున్నాం. అలాగే ఈ రోజు ఈ యంగ్ టీమ్ కు మేము గెస్ట్ లుగా వస్తే వాళ్లకు మంచి జరుగుతుందని భావించాం. ఈ సినిమాతో హీరో నిఖిల్ కు మంచి పేరు రావాలి. అలాగే టీమ్ అందరికీ గుడ్ టైమ్ మొదలవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ అన్యుక్త నలాని మాట్లాడుతూ – ఈ సినిమాలో నిశ్చల పాత్రలో నటించాను. ఈ క్యారెక్టర్ ఏదైనా చేసిన తర్వాత ఆలోచిస్తుంది. కొంచెం తింగరిగా వ్యవహరిస్తుంది. కానీ ఆమె క్యారెక్టర్ ను మీరంతా ఇష్టపడతారు. నా లైఫ్ లో ఎన్నో అక్టోబర్ 9లు వచ్చి వెళ్లాయి. కానీ ఈ అక్టోబర్ 9 మా అందరికీ మెమొరబుల్ గా ఉంటుంది. మా సినిమాలో ఫ్రెండ్స్ మధ్య ఉండే రిలేషన్, ప్రేమికుల మధ్య బంధం..ఇలా అన్ని బాండింగ్స్ ఆకట్టుకునేలా తెరకెక్కించారు మా డైరెక్టర్. యూత్ ఆలోచనలు, వారి ప్రవర్తన, ఎమోషన్స్ ఎలా ఉంటాయో ఫన్నీగా మా సినిమాలో చూస్తారు. ఈ నెల 9న థియేటర్స్ లో మా సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో నిఖిల్ గాజుల మాట్లాడుతూ – సినిమా అనేది మా డ్రీమ్. మా మూవీని థియేటర్స్ లో చూసుకోవడం ఒక కల నిజమైన ఫీల్ కలిగిస్తుంటుంది. ఈ చిత్రంతో మేము అలాంటి అనుభూతి పొందబోతున్నాం. మా మూవీ క్వాలిటీ మీరంతా చూశారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయని రెస్పాన్స్ వస్తోంది. ఒక చిన్న చిత్రాన్ని రూపొందించి, ప్రమోట్ చేసి, రిలీజ్ చేయడం చాలా కష్టం. మా కంటెంట్ మీకు చూపించాం. థియేటర్స్ కు మీరంతా వస్తారని నమ్ముతున్నాం. 2 గంటల 17 నిమిషాలు మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసే చిత్రమిది. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో చెబుతున్నాం. మా మాట నమ్మి థియేటర్స్ రావాలని కోరుతున్నాం. అన్నారు.
డైరెక్టర్ చాణక్య జిల్లా మాట్లాడుతూ – ఈ రోజు మా మూవీ ఈవెంట్ కు అతిథులుగా వచ్చిన అనిల్ విశ్వనాథ్, కామాక్షి భాస్కర్ల గారికి థ్యాంక్స్. గుడ్ టైం మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమా. ప్రతి సీన్ మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. మిమ్మల్ని బాగా నవ్విస్తుంది. సినిమాను ఎక్కడా ల్యాగ్ ఫీల్ అవ్వరు. ప్రతి సీన్ లో ఎంటర్ టైన్ మెంట్, ఎనర్జీ కనిపిస్తాయి. మా లీడ్ యాక్టర్స్ అంతా బాగా పర్ ఫార్మ్ చేశారు. ఈ నెల 9న థియేటర్స్ లో మూవీ చూడండి. గుడ్ టైమ్ టైటిల్ లో ఉన్నట్లే మా అందరికీ గుడ్ టైమ్ తీసుకొస్తుందని నమ్ముతున్నాం. అన్నారు.
నటీనటులు: నిఖిల్ గాజుల, అన్యుక్త నలాని, హృతిక్ శెట్టి, ధనరాజ్, సునీత మనోహర్, సౌందర్య, హరి మున్నంగి, తదితరులు
టెక్నీషియన్స్
———————–
కథనం- మాటలు: అభిరామ్ రాయప్రోలు
ఎడిటర్: సాయి తరుణ్ రెడ్డి
సంగీతం: నిర్వాన్ ఆత్రేయ
డిఓపి: అన్వేష్ యాదవ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ కార్తీక్
సీ.ఈ.ఒ: ఐశ్వర్య జిల్లా
నిర్మాత: రమేష్ జిల్లా
