వాసు క్యారెక్టర్ తో ఆడియన్స్ డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు – హీరో
సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నపొట్టేల్ – ప్రేక్షకులకు థాంక్ చెప్పిన టీం
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేసిన రెవల్యూషనరీ బ్లాక్ బస్టర్ ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ పవర్ ఫుల్ రోల్ లో అదరగొట్టారు. నిసా ఎంటర్టైన్మెంట్స్పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, విమర్శకులు ప్రశంసలు అందుకొని ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీం సక్సెస్ మీట్ ని నిర్వహించింది.
డైరెక్టర్ సాహిత్ మోత్ఖూరి మాట్లాడుతూ.. సినిమాకి 80 శాతం రివ్యూలు పాజిటివ్ గా వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఇంత పాజిటివ్ ఏ సినిమాకి రాలేదు. అందరూ హానెస్ట్ సినిమా అని చెబుతున్నారు. యువ, అనన్య, అజయ్, నోయల్ అందరి పెర్ఫార్మెన్స్ లకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి థియేటర్ లో సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ వస్తోంది. ఇంత గొప్పగా రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ. అజయ్ అన్న కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను, యువ ని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. అనన్య పెర్ఫామెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్. ఈ సినిమా చేసినందుకు చాలా ప్రౌడ్ గా ఫీలౌతున్నాను. అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.
హీరో యువ చంద్ర కృష్ణ మాట్లాడుతూ..ఈ సినిమా చూసిన అందరూ నేను కొత్త యాక్టర్ లా కాకుండా అనుభవం వున్న నటుడిగా నటించానని చెప్పారు. ఇది చాలా పెద్ద కాంప్లిమెంట్. ఇంత మెమరబుల్ క్యారెక్టర్ ఇచ్చిన సాహిత్ కి థాంక్ యూ. నిర్మాతలు చాలా పాషన్ తో ఈ సినిమా చేశారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ వుంటే ఇంకా అద్భుతమైన కంటెంట్ ని క్రియేట్ చేయొచ్చు. ఆడియన్స్ ఎర్లీబుకింగ్స్ లో చూశారు. మాలాంటి అప్ కమింగ్ యాక్టర్స్ కి అది గొప్ప ఎనర్జీ. థియేటర్స్ లో మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వర్డ్ అఫ్ మౌత్ చాలా స్ట్రాంగ్ గా వుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్. చాలా పాషన్ వున్న టీం ఇది. అజయ్ అన్న విక్టరీని ఆడియన్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అనన్య ని అందరూ బుజ్జమ్మ అని పిలుస్తున్నారు. నోయల్ చాలా డెప్త్ వున్న క్యారెక్టర్ చేశాడు. ఆడియన్స్ సపోర్ట్ ఇంకా కావాలి. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడండి’ అన్నారు.
హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ… సినిమాకి ప్రేక్షకులు నుంచి వస్తున్న రెస్పాన్స్ అద్భుతం. మేము ఊహించిన దాని కంటే చాలా గొప్పగా రెస్పాన్స్ వస్తుంది. ప్రీమియర్స్, ఫస్ట్ డే కి ఆడియన్స్ వచ్చి ఇంత సపోర్ట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. థాంక్యూ సో మచ్ ఆడియన్స్. ధియేటర్స్ 100% ఫీల్ అయ్యాయి. ఒక చిన్న సినిమాకి ఈ మధ్య కాలంలో ఇంత మంచి రెస్పాన్స్ రాలేదు. సాహిత్ ఒక అద్భుతమైన కథని చాలా గొప్ప గా మలిచాడు. చూసినకొద్ది చూడాలనిపిస్తుంది. నా రోల్ గురించి చాలా మంది ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఆడియన్స్ బుజ్జమ్మ అని పిలుస్తుంటే చాలా ఆనందంగా వుంది. నిర్మాతలు చాలా పాషన్ తో సినిమా చేశారు. యువ చాలా అద్భుతంగా నటించారు. అందరికీ థాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా రావాలి. మాత్రుదేవో భవ సినిమాకి ఎలా కనెక్ట్ అయ్యారో ఈ సినిమాకి కూడా అలానే కనెక్ట్ అవుతారు. అందరూ వచ్చి ఈ సినిమాని థియేటర్స్ లోనే ఎక్స్ పీరియన్స్ చేయాలి’ అన్నారు.
యాక్టర్ నోయల్ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఈ సినిమా చూశాను. అందరూ చాలా మంచి సినిమా చేసావ్ ఈ సినిమాలో నువ్వు పార్ట్ అవడం చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది అని చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది సినిమాలో అవకాశం ఇచ్చిన సాహిత్ కి థాంక్యూ. నా కెరీర్లో చాలా మంచి రోల్ ఇది. యువ చించేసాడు. ఫస్ట్ టైమర్ లా అనిపించలేదు. ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ చేశారు .చాలా ప్యాషన్ తో ఈ సినిమా తీశారు. సినిమా మీద ఎంత పెట్టారో ప్రమోషన్స్ మీరు కూడా అంతే పెట్టారు. అనన్య ఈ సినిమాతో స్టార్ లెవెల్ కి వెళ్లి పోవాలి. తన క్యారెక్టర్ కి చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఇంత మంచి సినిమాలో పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు.
ప్రొడ్యూసర్ సురేష్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఒక మంచి సినిమా తీశాం. నిన్న థియేటర్స్ కి వెళ్ళాం. థియేటర్ రెస్పాన్స్ అదిరిపోయింది. ప్రతిచోట స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు. ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందం ఇచ్చింది. సినిమా నమ్మి తీసాం. ఆడియన్స్ కూడా థియేటర్స్ కి వచ్చి చూస్తున్నారు. తెలంగాణతోపాటు ఏపీ లో పికప్ అవ్వడం సర్ప్రైజింగ్ గా అనిపించింది. చూసిన ప్రతి ఒక్కరూ మెస్మరైజింగ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఒక మంచి సినిమా క్లాసిక్ సినిమా తీస్తున్నామని తెలుసు. ఆడియన్స్ మేము ఊహించిన దాని కంటే అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తున్నారు. యువ, అనన్య, అజయ్ గారు ఇలా ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. చాలామంది కంటతడి కూడా పెట్టుకున్నారు. థియేటర్స్ లో చూసింది చెప్తున్నాను. సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.అందరూ థియేటర్స్ కి వెళ్లి చూసి ఎంజాయ్ చేయండి. థాంక్యూ.”అన్నారు