ఈ నెల 30న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఉక్కు సత్యాగ్రహం
విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాత హీరో జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణం లో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం,”ఉక్కు సత్యాగ్రహం ” ఈ చిత్రాన్ని ఈ నెల 30 న విడుదల చేస్తున్నారు. జాతీయ ఉత్తమ ప్రముఖ దర్శకులు నిర్మాత బి.నర్సింగరావు. తెలంగాణా రాష్ట్ర గీతం రూపశిల్పి అందేశ్రీ, గద్దర్ తనయుడు సూర్యం, జానపద కవి గోరేటి వెంకన్న, ప్రొఫెసర్ కోదండరాం, నందిని సిద్ధారెడ్డి, అల్లం నారాయణ ప్రముఖులు సంయుక్తం గా పోస్టర్ విడుదల చేసి రిలీజ్ డేట్ నిర్ణయించి ప్రకటించారు. గద్దరన్న మూడు పాటలు పాడి రెండు పాటల్లో మరియు కొన్ని సందేశాత్మక సీన్స్ లో నటించారు. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు.
ఈసందర్బంగా చిత్ర దర్శక, నిర్మాత, కథానాయకుడు సత్యారెడ్డి మాట్లాడుతు : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కి వ్యతిరేకంగా, భూనిర్వశితులకి న్యాయం కోసం ఉక్కు సత్యాగ్రహం సినిమాని ఒక గ్రంధంలా, కళా ఖండంలా మూడు సంవత్సరాలు పాటు ఎంతో కస్టపడి నిర్మించామని నిజమైన స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్స్, ఎంప్లాయిస్, భూనిర్వాసితులు, ఎంతోమంది మేధావులు,కవులు కళాకారుల, రచయితలు కూడా ఈ చిత్రం లో నటించారని తెలిపారు. ఢిల్లీ ఇండియా గేట్, జంతర్ మంతర్, ఆంధ్రప్రదేశ్ భవన్, సింగరేణి కోల్ మైన్స్, విశాఖపట్నం ప్రాంతాల్లోని వివిధ లొకేషన్ లలో షూటింగ్ చేశామని చెప్పారు. ఈ ఆగస్టు నెల 30 వ తేదిన ప్రపంచం వ్యాప్తంగా రెండు వందల దియేటర్ల పైగా విడుదల చేస్తున్నట్లు సత్యారెడ్డి తెలిపారు.
నటీనటులు :
గద్దర్ గారు, సత్యా రెడ్డి, ‘పల్సర్ బైక్’ ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు, ఎం వి వి సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల
సాంకేతిక నిపుణులు:
సంగీతం : శ్రీకోటి
ఎడిటర్ : మేనగ శ్రీను
ప్రొడక్షన్ : జనం ఎంటర్టైన్మెంట్స్
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత మరియు దర్శకత్వం : పి. సత్యా రెడ్డి
పి ఆర్ ఓ : మధు VR
‘Ukku Satyagraham’ Releasing in theaters from August30
With the slogan Visakha Ukku Telugu Vari Hakku, director and producer Hero People Star Satya Reddy’s film starring public battleship and revolutionary poet Gaddar’s last film, Ukku Satyagraham is releasing on 30th of this month. National Best Famous Directors Producer B. Narsinga Rao. Telangana state anthem creator Ande Sri, Gaddar’s Son Suryam, folk poet Goreti Venkanna, Prof. Kodanda Ram, Nandini Siddha Reddy, Allam Narayana released the poster jointly and announced the release date. Gaddar Anna sang three songs and acted in two songs and some informative scenes. Goreti Venkanna and Suddala Ashok Teja have provided excellent lyrics.
On this occasion, the director, producer and Hero of the film Satya Reddy said : Steel plant union leaders, employees, land dwellers, many intellectuals, poets, artists and writers have worked hard to make the film Ukku Satyagraham as a book and art work for three years against the privatization of steel plant in Visakhapatnam and justice for the squatters. He said that he also acted in this film. The shooting was done at various locations in Delhi India Gate, Jantar Mantar, Andhra Pradesh Bhavan, Singareni Coal Mines and Visakhapatnam. Satya Reddy said that on the 30th of August, movie is going to release in more than 200 theatres all over the world.
Actors:
Gaddar Garu, Satya Reddy, ‘Pulsar Bike’ Jhansi, MLA Dharmashree Garu, MVV Satyanarayana, Prasanna Kumar, Vennela.
Technicians:
Music: Srikoti
Editor : Menaga Srinu
Production : Janam Entertainments
Story, Screenplay, Producer and Direction : P. Satya Reddy
P R O : Madhu VR