దేవకీ నందన వాసుదేవ లొ డివైన్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు అదిరిపోతాయి –
The Birthday Boy will Connect to Youth
The Birthday Boy will Connect to Youth
చిత్రం – ది బర్త్ డే బోయ్
నటీనటులు – రవికృష్ణ, రాజీవ్ కనకాల, సమీర్ మళ్ల తదితరులు
సినిమాటోగ్రఫీ – సంకీర్త్ రాహుల్
మ్యూజిక్ డైరెక్టర్ – ప్రశాంత్ శ్రీనివాస్
నిర్మాత – ఐ భరత్
దర్శకత్వం – విస్కీ
విడుదల తేదీ – 19.7.2024
ఫిల్మీబజ్ రేటింగ్ – 3\5
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కిన చిత్రం “ది బర్త్ డే బోయ్”. సినిమా ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో అంచనాలు పెరిగాయి. మరి ఈ అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
ఉన్నత చదువుల కోసం 5 గురు ఫ్రెండ్స్ కలిసి విదేశాలకు వెళతారు. అందులో ఒక ఫ్రెండ్ బర్త్ డే పార్టీని ఎంజాయ్ చేయడానికి ఒక చోట చేరతారు. పార్టీలో మద్యం సేవించి, బర్త్ డే బోయ్ ని ఆటపట్టిస్తారు. బర్త్ డే బంప్స్ వల్ల బర్త్ డే బోయ్ చనిపోతాడు. అనుకోకుండా జరిగిన ఈ విషాదంతో మిగతా ఫ్రెండ్స్ భయపడిపోతారు. మరి వీరి కెరీర్ ఎలాంటి ఇబ్బందుల్లో పడిపోతుంది… వీరిని ఎవరు కాపాడతారు… తదితర అంశాలతో సినిమా తెరకెక్కింది.
ప్లస్ పాయింట్స్
నిజ జీవితంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా డైరెక్టర్ విస్కీ ఈ సినిమాని తెరకెక్కించారు. యూత్ బర్త్ డే పార్టీలను ఎంజాయ్ చేయడం, ఒక్కోసారి ఈ పార్టీల్లో అనుకోకుండా జరిగిన సంఘటనలతో ఆ పార్టీని సెలబ్రేట్ చేసుకున్న కుర్రకారు ఇబ్బందుల్లో పడటం వింటూనే ఉంటాం. సరిగ్గా ఇలాంటి సంఘటనలతో తెరకెక్కిన ది బర్త్ డే బోయ్ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. 5గురు ఫ్రెండ్స్ జీవితంలో జరిగిన సంఘటనలను చాలా చక్కగా తెరకెక్కించారు డైరెక్టర్ విస్కీ. సస్పెన్స్ అంశాన్ని ఇంట్రస్టింగ్ స్ర్కీన్ ప్లే తో తెరకెక్కించడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. క్లయిమ్యాక్స్ లో వచ్చిన ట్విస్ట్ ఆడియన్స్ ని థ్రిల్ కు గురి చేస్తుంది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరింది. దాంతో ప్రతి సీన్ ఎలివేట్ అయ్యింది. నైట్ టైమ్ లో జరిగిన సంఘటన కాబట్టి… సినిమా మొత్తం రాత్రిపూట జరుగుతుంది. సో… విజువల్స్ పరంగా చాలా కేర్ తీసుకున్నారు. సినిమాటోగ్రఫీ బాగుంది. రవికృష్ణ యాక్టింగ్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది. తన ఫ్రెండ్స్ గా నటించిన వారు కొత్త వారు అయినప్పటికీ, చక్కటి నటన కనబర్చి ఆకట్టుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్
ఫస్టాప్ లో ఎంగేజింగ్ గా అనిపించిన సినిమా, సెకండాఫ్ లో స్లో అయిపోవడం సినిమాకి మైనస్ పాయింట్. సెకండాఫ్ లో ప్రారంభమవ్వగానే సస్పెన్స్ రివీల్ అవ్వడంతో, మిగతా సినిమా అంతా అంత ఇంట్రస్టింగ్ గా అనిపించదు. ఇంకా గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే తో ఈ సినిమా కొనసాగి ఉంటే, సినిమాకి చాలా ప్లస్ అయ్యేది. కొన్ని ల్యాగ్ సీన్స్ కూడా ఈ సినిమాకి మైనస్. ఎడిటింగ్ లో కేర్ తీసుకుని ఉంటే, సినిమా ఫాస్ట్ గా సాగినట్టు అనిపించేది. రాజీవ్ కనకాల లాంటి ఆర్టిస్ట్ ని కూడా పూర్తిగా వినియోగించుకోకపోవడం ఓ మైనస్.
ఫైనల్ గా చెప్పాలంటే…
యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా ది బర్త్ డే బోయ్. సస్పెన్స్ ఎలిమెంట్స్, క్లయిమ్యాక్స్ ఆడియన్స్ ని మెప్పిస్తాయి. యూత్ ఫుల్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమా కాబట్టి… యూత్ ఈ సినిమాని సరదాగా థియేటర్స్ లో ఎంజాయ్ చెయ్యొచ్చు.