
Veteran Actress and Classical Dancer *Vijayabhanu* Passes Away!!
Though the present generation may be unfamiliar with her name, Vijayabhanu was a prominent figure in Telugu cinema during the 1970s, also appearing in Tamil, Kannada, and Hindi films. Her pairing with comedy legend Rajababu was extremely popular, and she acted alongside many leading heroes of her era. Within just a decade, she starred in over 100 films, earning the moniker “Vijayabhana Majaka” and establishing herself as a true pan-Indian actress.
Born in Anantapur but raised and made famous in Chennai, Vijayabhanu fell in love with an American during the peak of her career and eventually moved to Los Angeles, leaving behind both her profession and India. A trained dancer and recipient of the Natyamayuri title, she founded Sri Shakti Sharada Nritya Niketan in L.A., training thousands in Bharatanatyam, Kuchipudi, Kathak, and Kathakali. She gave numerous performances worldwide and was known for her warm hospitality to any visiting Telugu film personalities.
Though she became an American daughter-in-law, she never forgot her Indian roots. She contributed significantly to the development of the Shiva Narayana Panchamukha Anjaneya Temple in Anantapur, built by her mother. Known for her humanitarian nature, Vijayabhanu helped hundreds of people in need.
Last month, during a visit to Chennai to check on her house, she suffered a heatstroke and passed away suddenly. Her end came quietly and poignantly in the very city where her acting journey had begun—leaving many to wonder if she returned from the U.S. just to spend her final days in the home she loved.
Her performance in Idi Katha Kaadu (with Chiranjeevi, Kamal Haasan, and Jayasudha) earned her the Nandi Award for Best Supporting Actress. She also acted in classics like Nippulanti Manishi (with NTR), Kiladi Bullodu (Shoban Babu), Oka Naari Vanda Thupakulu (Vijaya Lalitha), Chandana (Ranganath’s debut), Priyabandhavi (Sharada), Stree (Krishnam Raju), Shabash Papanna (Jaggayya), and Chinni Krishnudu (Ghatamaneni Ramesh Babu, Jandhyala).
Her sister, Kalaimamani Dr. Sindhoori Jayasinghe, also a renowned classical dancer settled in the U.S., said:
> “My sister was an angel and a true warrior. She illuminated countless lives and was a role model for many. As a tribute, we plan to publish a comprehensive book on her life. Jayaprada, a close friend of hers, attended her funeral rituals in Chennai. It was my sister’s inspiration that brought me to the U.S. as well, where I now run a dance school. We aim to involve everyone who worked with her to ensure her story is told with dignity.”
Condolences poured in from actress and former MP Jayaprada, actor Suman, director Y.V.S. Chowdary, and many others in the industry, mourning the sudden loss of this beloved artist.
ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి విజయభాను ఇకలేరు!!
విజయభాను అనే పేరుతో ఒక నటీమణి ఉండేవారని, తెలుగు సినిమా రంగంలో విజయపతాకం ఎగురవేయడమే కాకుండా… తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించారని ఈతరం వారికి తెలియకపోవచ్చు. కానీ 70వ దశకంలో ఒక వెలుగు వెలిగి అప్పటి అగ్ర కథానాయకులందరి సినిమాల్లోనూ నటించారు విజయభాను. ముఖ్యంగా అప్పట్లో “రాజబాబు – విజయభాను” జంటకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేదని చెబుతారు!!
కేవలం పదేళ్ల వ్యవధిలోనే వందకు పైగా సినిమాలు చేసి… “విజయభానా మజాకా” అనిపించుకుని… తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి.. అప్పట్లోనే “పాన్ ఇండియా పాపులర్ యాక్ట్రెస్”గా పేరు గడించిన విజయభాను… ఇటీవల ఇండియాకు వచ్చి… తిరిగి అమెరికాకు వెళ్లకుండా… తిరిగి రాని లోకాలకు తరలిపోయారు. ఆమె వయసు 68.. ఆమె ఏకైక కుమార్తె అమెరికాలోని ఓ ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. అనంతపురం విజయభాను స్వస్థలం. అయితే ఆమె పుట్టింది, పెరిగింది, పేరు తెచ్చుకుంది చెన్నైలోనే!!
కెరీర్ పీక్స్ లో ఉండగానే ఓ అమెరికన్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయి… కెరీర్ తో పాటు ఇండియానూ విడిచిపెట్టి అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో స్థిరపడిపోయారు విజయభాను. స్వతహా నాట్యకారిణి కావడంతోపాటు…”నాట్యమయూరి” బిరుదాంకితురాలైన విజయభాను…లాస్ ఏంజెల్స్ లో “శ్రీ శక్తి శారదా నృత్యనికేతన్” పేరుతో నృత్య కళాశాల స్థాపించి, వేలాది మందికి తర్ఫీదు ఇచ్చారు. మన భారతీయ నాట్యకళలైన “భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకేళి” వంటి అన్ని నృత్యరీతులలోనూ నిష్ణాతురాలైన విజయభాను ప్రపంచవ్యాప్తంగా లెక్కకుమిక్కిలిగా నాట్య ప్రదర్శనలు ఇచ్చి ఉండడం విశేషం. మన తెలుగు సినిమా రంగం నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఎవరు వెళ్లినా… విజయ భాను ఎంతో ఆత్మీయంగా ఆతిధ్యమిచ్చేవారు!!
అమెరికా కోడలుగా మారి, అక్కడే స్థిరపడినప్పటికీ… భారతీయ మూలాలు ఎన్నడూ మరువని ఈ భరతమాత ముద్దుబిడ్డ… అనంతపురంలో ఆమె మాతృమూర్తి కట్టించిన “శివ నారాయణ పంచముఖ ఆంజనేయ దేవాలయం” అభివృద్ధికి ఇతోధికంగా సాయం చేశారు. సేవాదృక్పధం, మానవతావాదం మెండుగా కలిగిన ఈ “అనంతపురం ఆడపడుచు” తన సహాయం కోరి వచ్చిన వందలాది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. గత నెలలో ఇండియా పర్యటనకు వచ్చి, చెన్నైలోని తన ఇంటిని చూసుకునెందుకు వెళ్లిన విజయభాను… ఎండ వేడి తట్టుకోలేక వడదెబ్బకు లోనై… అర్ధాంతరంగా అశువులు బాశారు. “తన ఇంట్లో చనిపోవడం కోసమే ఆమె పనిగట్టుకుని అమెరికా నుంచి ఇండియా వచ్చారా…?” అనిపించేలా.. ఎక్కడైతే ఆమె ఒంటరిపోరాటంతో ఒక నటిగా, విరాజిల్లారో… అక్కడే మృత్యువు ఒడిలో ఒంటరిగా ఒదిగిపోయారు!!
చిరంజీవి, కమల్ హాసన్, జయసుధలతో కె. బాలచందర్ తెరక్కించిన దృశ్యకావ్యం “ఇది కథ కాదు” చిత్రలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల మనసు దోచుకున్న విజయభాను… ఆ చిత్రంలో కనబరిచిన అత్యుత్తమ నటనకు “ఉత్తమ సహాయ నటి”గా నంది పురస్కారం అందుకున్నారు. నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చేతుల మీదుగా “నాట్యమయూరి” బిరుదునూ అందుకున్నారు. “నిప్పులాంటి మనిషి (ఎన్ఠీఆర్), ఇది కథ కాదు (చిరంజీవి – కమల్ హాసన్), కిలాడి బుల్లోడు (శోభన్ బాబు), ఒక నారి వంద తుపాకులు (విజయ లలిత), చందన (హీరోగా రంగనాద్ మొదటి చిత్రం),, ప్రియబాంధవి (శారద), స్త్రీ (కృష్ణంరాజు), శభాష్ పాపన్న (జగ్గయ్య), చిన్నికృష్ణుడు” (జంధ్యాల – ఘట్టమనేని రమేష్ బాబు) తదితర చిత్రాలు విజయభాను పేరు ఆరోజుల్లో మారుమ్రోగేలా చేశాయి!!
విజయభాను గురించి… అమెరికలోనే స్థిరపడిన ఆమె సోదరి “కలైమామణి డా. సిందూరి జయసింఘే” మాట్లాడుతూ… “మా అక్క నిజంగా ఒక దేవత. ఒక పోరాట శక్తి. ఎన్నో కుటుంబాలకు ఆమె జీవనజ్యోతి. ఎందరికో ఆదర్శమూర్తి. ఆమెకు నివాళిగా… అత్యంత స్ఫూర్తిదాయకమైన ఆమె జీవితంపై ఒక పుస్తకం తీసుకురావాలని మేము సంకల్పించాం. జయప్రదగారు మా అక్కకు చాలా సన్నిహితురాలు. చెన్నైలో నిర్వహించిన మా అక్క “దశదినకర్మ”కు కూడా వారు హాజరయ్యారు. మా అక్క ప్రేరణతోనే నేనూ అమెరికా వచ్చి, ఇక్కడే స్థిరపడి… నేను కూడా డాన్స్ ఇనిస్టిట్యూట్ నడుపుతున్నాను. అక్కతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నవారందర్నీ కలిసి… అక్క పుస్తకాన్ని వీలైనంత సమగ్రంగా తీసుకు రావాలని భావిస్తున్నాం” అన్నారు!!
విజయభాను ఆకస్మిక మృతి పట్ల ప్రముఖ కథానాయకి – మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద, ప్రముఖ నటులు సుమన్, ప్రముఖ దర్శకనిర్మాత వై.వి.ఎస్.చౌదరి తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు!!