భర్త మహాశయులకు విజ్ఞప్తి లో మంచి సర్ప్రైజ్ ఉంది. ఇది అందరికీ కనెక్ట్

Super Response for Ammulu
అమ్ములు కు అనూహ్య స్పందన – అప్పాజీకి అభినందనలు
ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ధీరజ అప్పాజీ తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన లఘు చిత్రం “అమ్ములు”. The CRY never heard – The TEARS never seen” అనే ట్యాగ్ లైన్ తో 7 నిమిషాల నిడివితో రూపొందిన ఈ సందేశాత్మక చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే వెయ్యి “ఆర్గానిక్ వ్యూస్” రాబట్టిన ఈ షార్ట్ ఫిల్మ్ లోని మెసేజ్ అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. మొదటి ప్రయత్నంలోనే రచయితగా, దర్శకుడిగా, నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న అప్పాజీని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు.
వెంకట్ విహారి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అందించిన ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్ ప్లే-నిర్మాణం-దర్శకత్వం: ధీరజ అప్పాజీ!!
