K-Ramp 3rd Single Tikkal Tikkal.. Released -Grand Theatrical Release on

Striking First Look Poster of Makutam Unveiled
Super Good Films, one of the pillars of South Indian cinema, marks its 99th prestigious production with Puratchi Thalapathy Vishal’s milestone 35th film, Makutam. Directed by Ravi Arasu and produced by RB Choudhary, the makers recently announced the title through a powerful glimpse.
Today, on the occasion of Vinayaka Chavithi, the makers have dropped a striking first look poster. The poster highlights Vishal in three dynamic avatars, each embodying a distinct persona—hinting at the film’s thrilling narrative and Vishal’s versatility as a performer.
Vishal’s leftmost look is a retro avatar with a laid-back posture, epitomizing a flamboyant, street-smart character. The centre look showcases him in an elegant avatar, exuding authority, wealth, and charisma as he stands in a commanding pose against a regal backdrop. His rightmost look features formal attire, embodying a disciplined professional.
These three diverse avatars imply Vishal’s character in Makutam will traverse multiple shades, promising a dynamic and multifaceted storyline.
The cast boasts talented heroines, with Dushara Vijayan taking the female lead and Anjali in a crucial role.
The technical crew is stacked with expertise. The cinematography is by Richard M. Nathan, music is by G.V. Prakash Kumar, editing is by NB Srikanth, and art direction is by Durairaj. The combination of visionary storytelling and top-tier craftsmanship positions Makutam as one of the most anticipated movies.
విశాల్ ‘మకుటం’ నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదల
వెర్సటైల్ హీరో విశాల్ ప్రస్తుతం ‘మకుటం’ అంటూ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. విశాల్ 35వ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ ‘మకుటం’ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. చూస్తుంటే ఈ మూవీని సముద్రం బ్యాక్ డ్రాప్ మాఫియా కథ అని అర్థం అవుతోంది.
ఇక ఈ మూవీలో విశాల్ సరసన అంజలి, దుషార విజయన్ నటిస్తున్నారు. తాజాగా ‘మకుటం’ నుంచి అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే విశాల్ ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌లో కనిపించబోతోన్నారని అర్థం అవుతోంది. విశాల్ యంగ్ లుక్, మిడిల్ ఏజ్ లుక్, ఓల్డేజ్ లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నారు.
‘మకుటం’ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
తారాగణం : విశాల్, దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై తదితరులు
సాంకేతిక సిబ్బంది
నిర్మాణ సంస్థ: సూపర్ గుడ్ ఫిల్మ్స్
నిర్మాత: ఆర్బి చౌదరి
దర్శకుడు: రవి అరసు
సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ఎం. నాథన్
ఎడిటర్: ఎన్బి శ్రీకాంత్
కళా దర్శకుడు: జి. దురైరాజ్
కాస్ట్యూమ్ డిజైనర్: వాసుకి భాస్కర్
పీఆర్వో : సాయి సతీష్