
Pre Wedding Show lyrical video Vayyari Vayyari grabs attention
Versatile actor Thiruveer pairs up with Teena Shravya in the film Pre Wedding Show. The movie is produced by Sandeep Agaram and Asmita Reddy Basini under the banners of 7PM and Puppet Show Productions, with direction by Rahul Srinivas. Kalpana Rao is serving as co-producer. The film is slated for release on November 7. Already, the teaser, glimpses, and title posters have raised strong expectations among the audience.
After the teaser’s release, the buzz around the film grew further. The story revolves around a wedding photographer, a love story, and a strange twist that generates comedy, promising to entertain audiences. Recently, the makers unveiled a catchy love song titled ‘Vayyari Vayyari’ from the film. Sanare’s lyrics are simple, relatable, and engaging, while the voices of Yashwanth Nag and Sindhuja Srinivasan add a special touch. Composer Suresh Bobbili’s music makes the song instantly appealing. The lyrical video of ‘Vayyari Vayyari’ also showcases the chemistry and love track between the lead pair, hinting that it will be a highlight of the movie.
The technical crew includes K. Soma Shekar as the cinematographer, Naresh Adapa as the editor, and Prajnay Konigiri as the executive producer. The film’s shoot has already been completed, and the makers are currently busy with post-production. The official release date announcement is expected soon.
*Cast:* Thiruveer, Tina Shravya, Master Rohan, and others
*Technical Crew:*
Story, Direction: Rahul Srinivas , Producers: Sandeep Agaram, Asmita Reddy Basini, Co-Producer: Kalpana Rao, Music: Suresh Bobbili , Cinematography: K. Soma Sekhar , Editor: Naresh Adapa, Executive Producer: Prajnay Konigiri , Production Designer: Phani Teja Musi , Costumes: Aarati Vinnakota, Priyanka Veeraboyina , Sound Designer: Ashwin Rajasekhar , PRO: Naidu Surendra Kumar – Phani Kandukuri (Beyond Media), Publicity Designer: Idle Dots , Marketing: Housefull Media
ఆకట్టుకుంటోన్న తిరువీర్ ‘ప్రీ వెడ్డింగ్ షో’ నుంచి ‘వయ్యారి వయ్యారి’ లిరికల్ వీడియో
వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ప్రీ వెడ్డింగ్ షో’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.నవంబర్ 7న సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి.
టీజర్ వచ్చిన తరువాత సినిమాపై అంచనాలు పెరిగాయి. వెడ్డింగ్ ఫోటో గ్రాఫర్ చుట్టూ ఓ ప్రేమ కథ, ఓ వింత సమస్య, దాన్నుంచి జెనరేట్ అయ్యే కామెడీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక తాజాగా ‘ప్రీ వెడ్డింగ్ షో’ నుంచి ‘వయ్యారి వయ్యారి’ అంటూ సాగే ఓ క్యాచీ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సనారే సాహిత్యం అందరికీ అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా ఉంది. ఇక యశ్వంత్ నాగ్, సింధూజ శ్రీనివాసన్ గాత్రం ఈ పాటకు మరింత ప్రత్యేకతను చేకూర్చింది. సురేష్ బొబ్బిలి బాణీ శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. ‘వయ్యారి వయ్యారి’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ సినిమాలో హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.
ఈ చిత్రానికి కెమెరామెన్‌గా కె. సోమ శేఖర్, ఎడిటర్‌గా నరేష్ అడుప, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ప్రజ్ఞయ్ కొణిగారి పని చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మేకర్లు.. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
*తారాగణం* : తిరువీర్, టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ తదితరులు.
*సాంకేతిక సిబ్బంది*
రచయిత & దర్శకుడు: రాహుల్ శ్రీనివాస్, నిర్మాతలు : సందీప్ అగరం & అశ్మితా రెడ్డి బసాని, సహ నిర్మాత : కల్పనారావు, సంగీతం : సురేష్ బొబ్బిలి, DOP : K సోమ శేఖర్, ఎడిటర్ : నరేష్ అడుప , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ప్రజ్ఞయ్ కొణిగారి , ప్రొడక్షన్ డిజైనర్ : ఫణి తేజ మూసి , కాస్ట్యూమ్ డిజైనర్లు : ఆర్తి విన్నకోట, ప్రియాంక వీరబోయిన , సాహిత్యం : సనారే , సౌండ్ డిజైనర్: అశ్విన్ రాజశేఖర్ , PRO : నాయుడు – ఫణి (బియాండ్ మీడియా) , పబ్లిసిటీ డిజైనర్: ఐడియల్ డాట్స్, మార్కెటింగ్: హౌస్‌ఫుల్