The much-awaited celebration track from Ustaad Bhagat AURA OF USTAAD

Mass Maharaja Raviteja appriciates Little Hearts Team
లిటిల్ హార్ట్స్ సి నిమాకు మాస్ మహారాజా రవితేజ ప్రశంస
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన “లిటిల్ హార్ట్స్” సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు లభిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, నాని, నాగవంశీ, సాయి రాజేశ్, టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషాన్ జీవింత్ వంటి సెలబ్రిటీలు ఈ చిత్రాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. తాజాగా మాస్ మహారాజా రవితేజ “లిటిల్ హార్ట్స్” సినిమా బాగుందంటూ ట్వీట్ చేశారు. ‘హార్ట్, హ్యూమర్, హానెస్ట్ పర్ ఫార్మెన్సెస్.. అన్నీ ది బెస్ట్ అనేలా ఉన్నాయి. మూవీ టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు..’ అంటూ విశెస్ అందించారు.
“లిటిల్ హార్ట్స్” చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రేక్షకాదరణతో 4 రోజుల్లో 15.41 కోట్ల రూపాయల వసూళ్లు దక్కించుకుంది.
నటీనటులు – మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులు
టెక్నికల్ టీమ్
రచన, దర్శకత్వం – సాయి మార్తండ్
ప్రొడ్యూసర్ – ఆదిత్య హాసన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
మ్యూజిక్ – సింజిత్ యెర్రమల్లి
సినిమాటోగ్రఫీ – సూర్య బాలాజీ
ఎడిటర్ – శ్రీధర్ సొంపల్లి
ఆర్ట్ డైరెక్టర్ – దివ్య పవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – వినోద్ నాగుల, మురళి పున్న
డిస్ట్రిబ్యూషన్ – బన్నీవాస్, వంశీ నందిపాటి
డిస్ట్రిబ్యూషన్ బ్యానర్స్ – బీవీ వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్
