పాంచ్ మినార్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కలసి ఎంజాయ్ చేసే సినిమా – రాజ్

Manchu Manoj Announces his entry into the music industry
Manchu Manoj announces the launch of his new music project “Mohana Raga Music”,. This announcement marks an emotional milestone for Manoj and his family as Manoj embarks his Journey into the Music Industry.
Manchu Manoj, known for his versatility and strong screen presence, has built a distinct identity in Telugu cinema from his early days as a child artist to his rise as a leading actor known for mass entertainers like Bindaas, Current Theega, and Potugadu, as well as intense dramas and experimental roles. His passion for cinema is reflected not only in his acting but also in his commitment to performing his own stunts, creative involvement on sets, and shaping memorable characters with individuality.
Music has always been a deep part of Manchu Manoj’s life. Over the years, he has showcased his musical talent by singing “Pyar Mein Padipoya” in Potugadu, releasing the uplifting “Antha Baguntamra” during the COVID pandemic, and writing lyrics for “Pistha Pistha” from Mr. Nookayya. He also wrote the lyrics for “Yenno Yenno” from Nenu Meeku Thelusa and “Pranam Poye Badha” from Mr. Nookayya. His expressive, raw, and emotional singing style reflects his natural musical instinct.
Beyond playback singing, he has contributed significantly behind the scenes. Manoj has worked in music and directed action sequences in several films of his father Dr. Manchu Mohan Babu, brother Manchu Vishnu, and sister Lakshmi Manchu since the beginning of his journey. He has also rapped in multiple songs across his family’s films. Adding to his global footprint, he collaborated with composer Achu Rajamani to compose music for the Hollywood film ‘Basmati Blues’, starring Brie Larson (Captain Marvel) in the lead role.
With “Mohana Raga Music” Company, Manchu Manoj begins a new creative chapter one that combines legacy, innovation, and heartfelt emotion. The label aims to support emerging talent, encourage fresh and experimental sounds, and produce original music that resonates with Indian and international audiences. The name itself carries deep significance. And it’s both father and son’s favourite Raga
The label’s upcoming lineup includes original singles, collaborations, and innovative music projects. Wait for more details soon on the biggest international collaboration with “Mohana Raga Music”, marking a major step toward taking Telugu music to the global stage.
మోహన రాగ మ్యూజిక్ కంపెనీతో సంగీత ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తోన్న మంచు మనోజ్
వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనదైన గుర్తింపు దక్కించుకున్న రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. సంగీత పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారాయన. అందులో భాగంగా మంచు మనోజ్ తన కొత్త మ్యూజిక్ ప్రాజెక్ట్ ‘మోహన రాగ మ్యూజిక్’ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఈ అనౌన్స్మెంట్ ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఓ ఎమోషనల్ మైల్ స్టోన్ అనే చెప్పాలి.
వెండితెరపై తనదైన నటన, పాత్రలతో విలక్షణ నటుడుగా తెలుగు సినిమాల్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు మంచు మనోజ్. చెల్డ్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. బిందాస్, కరెంట్ తీగ, పోటుగాడు వంటి మాస్ ఎంటర్‌టైనర్స్‌తోపాటు ప్రయోగ్రాత్మక చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. సినిమాల్లో తన అభిరుచిని నటనలోనే కాకుండా సొంతంగా స్టంట్స్ కంపోజ్ చేయటం, సెట్స్ రూపకల్పనలో ఇన్వాల్వ్కావటం, గుర్తుండి పోయే పాత్రను రూపొందించటంలో ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు.
ప్రారంభం నుంచి మంచు మనోజ్ జీవితంలో సంగీతం అనేది ఓ అంతర్భాగంగా ఉంటోంది. ఎందుకంటే ‘పోటుగాడు’ సినిమాలో ‘ప్యార్ మే పడిపోయానే..’ పాటను పాడి ప్రేక్షకులను మెప్పించారు. కోవిడ్ సమయంలో అందరినీ ఉత్తేజరపరిచేలా ‘అంతా బాగుంటాంరా’ పాటను విడుదల చేశారు. ‘మిస్టర్ నూకయ్య’ చిత్రంలో ‘పిస్తా పిస్తా.. ’ పాటతో పాటు ‘నేను మీకు తెలుసా’ సినిమాలో ‘ఎన్నో ఎన్నో..’, ‘మిస్టర్ నూకయ్య’ సినిమాలో ‘ప్రాణం పోయే బాధ..’ పాటలకు సాహిత్యాన్ని అందించారు. ఆయన హృదయానికి హత్తుకునేలా, భావోద్వేగంతో కూడుకున్న, విలక్షణమైన గాత్రం ఆయనలోని సహజమైన సంగీత ప్రతిభను తెలియజేస్తోంది.
తెరపై పాటలు పాడటం, రాయటం వంటి సంగీత సంబంధమైన విషయాలే కాదు.. తెర వెనుక ఎన్నో విశేషమైన సేవలను అందించారు. మనోజ్ తన సినీ ప్రయాణంలో తండ్రి డా.మంచు మోహన్ బాబు, అన్నయ్య మంచు విష్ణు, సోదరి లక్ష్మి మంచు చిత్రాలకు సంగీత విభాగంలో వర్క్ చేయటంతో పాటు వారి చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను డైరెక్ట్ కూడా చేశారు. తన కుటుంబ సభ్యులు నటించిన ఎన్నో చిత్రాలకు ఆయన పాటలను పాడారు. అంతర్జాతీయ స్థాయిలో తన గుర్తింపును పెంచుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణితో కలిసి హాలీవుడ్ సినిమా ‘బాస్మతి బ్లూస్’కు సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో కెప్టెన్ మార్వెల్ పాత్ర పోషించిన బ్రీ లార్సన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు.
‘మోహన రాగ మ్యూజిక్’ అనేది కొత్త ఆలోచనలు, భావోద్వేగాలను కలిపే వేదిక. ఈ కంపెనీతో మంచు మనోజ్ ఒక కొత్త సృజనాత్మక అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటం, ప్రయోగాత్మక సంగీతాన్ని ప్రోత్సహించటం..భారతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సరికొత్త సంగీతాన్ని రూపొందించటమే దీని ప్రధాన లక్ష్యం. ఈ పేరుకీ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. తండ్రీ కొడుకులిద్దరికీ అత్యంత ఇష్టమైన రాగం – మోహన రాగం.
ఒరిజినల్ సింగిల్స్, కొలాబ్రేషన్స్, కొత్తరకమైన మ్యూజిక్ ప్రాజెక్ట్స్ ఈ లేబల్ నుంచి రాబోతున్నాయి. మోహన రాగ మ్యూజిక్ కంపెనీతో జరగబోయే అతి పెద్ద ఇంటర్నేషనల్ కొలాబ్రేషన్ గురించి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇది తెలుగు సంగీతాన్ని ప్రపంచ వేదిక పైకి తీసుకెళ్లే కీలకమైన పరిణామంగా నిలుస్తుంది.
