“Kanguva” Release Date Changed From Oct10 th to November14
Star hero Suriya’s prestigious movie Kanguva is set for a grand theatrical release worldwide on November 14. Originally scheduled for October 10, the release has been postponed to November 14, promising even more action and drama. The video released during the announcement has garnered impressive attention.
Directed by Siva, Kanguva is a major period action film featuring Disha Patani and Bobby Deol in pivotal roles. The movie is produced by KE Gnanavel Raja, Vamsi, and Pramod under the banners of Studio Green and UV Creations, boasting a substantial budget.
Notably, Mythri Movie Distributors, a prominent distribution company, will handle the film’s release in the Nizam area. The sizzle teaser, posters, and the fire song released thus far have received an overwhelmingly positive response, heightening audience anticipation.
Kanguva aims to captivate viewers with a unique concept not yet seen in the period action genre, adding to its expectations as one of the biggest films from the Indian film industry.
Cast: Suriya, Disha Patani, Bobby Deol, Yogi Babu and others.
Technical Team:
- Editor: Nishad Yusuf
- Cinematography: Vetri Palaniswamy
- Action: Supreme Sundar
- Dialogues: Madan Karke
- Story: Siva, Adi Narayana
- Songs: Vivek, Madan Karke
- Costume Designers: Anu Varthan, Dashta Pillai
- Costumes: Rajan
- Choreography: Shobhi
- Executive Producer: AJ Raja
- Co-Producer: Neha Gnanavel Raja
- PRO: GSK Media (Suresh – Sreenivas)
- Producers: KE Gnanavel Raja, Vamsi, Pramod
- Directed by: Siva
నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. అక్టోబర్ 10వ తేదీన రావాల్సిన ‘కంగువ’ మరిన్ని హంగులతో ముస్తాభై నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకురాబోతోంది. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. ‘కంగువ’ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు.
‘కంగువ’ నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన సిజిల్ టీజర్, పోస్టర్స్, ఫైర్ సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ భారీ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ మీద చూడాలనే ఆసక్తితో ప్రేక్షకులంతా వెయిట్ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ జానర్ లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్ తో ‘కంగువ’ ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీగా ‘కంగువ’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
నటీనటులు – సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటర్ – నిశాద్ యూసుఫ్
సినిమాటోగ్రఫీ – వెట్రి పళనిస్వామి
యాక్షన్ – సుప్రీమ్ సుందర్
డైలాగ్స్ – మదన్ కార్కే
కథ – శివ, ఆది నారాయణ
పాటలు – వివేక్, మదన్ కార్కే
కాస్ట్యూమ్ డిజైనర్ – అను వర్థన్, దష్ట పిల్లై
కాస్ట్యూమ్స్ – రాజన్
కొరియోగ్రఫీ – శోభి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఏ జే రాజా
కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
దర్శకత్వం – శివ