వాసు క్యారెక్టర్ తో ఆడియన్స్ డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు – హీరో
Kaala Bhairava Tittle Confirmed for Raghava Lawrence Movie
The prominent producer, Koneru Satyanarayana, known for producing blockbuster films like Rakshasudu and Khiladi, is currently busy with multiple exciting projects under the A Studios LLP banner. This prestigious production house recently announced an intriguing new project in association with Goldmine Telefilms, Neeladri Productions, and Hawwish Productions.
The film stars the versatile and dynamic Raghava Lawrence in the lead role. This film will mark the prestigious 25th project for choreographer-turned-actor Raghava Lawrence. Blockbuster director Ramesh Varma, who previously directed Rakshasudu and Khiladi, is helming this prestigious project.
The big action adventure is currently in production, and today, the film’s first look and title were unveiled with a striking poster. The First Look revealed on the social media and internet has captivated the interests of everyone due to Raghava Lawrence look, which has raised the curiosity of fans of what the film could be all about.
RL25 is now titled “Kaala Bhairava.” The first look poster stuns with intriguing elements. The phrases “The World Within” and “A Pan India Super Hero Film” raise expectations to sky-high levels. This massive project is being made on a huge budget of 200 crores. Kaala Bhairava is produced by Koneru Satyanarayana and Manish Shah on a grand scale.
The makers have been working tirelessly with great care and utmost passion to provide a never-before theatrical experience to audiences. Kaala Bhairava will have a grand release in Telugu, Tamil, and Hindi. The shoot commences in November 2024, with the film set for a grand release in summer 2025. This film promises to bring together epic talents for an exciting adventure, with more details to be announced soon.
రాఘవ లారెన్స్ హీరోగా ఏ స్టూడియోస్ ఎల్ఎల్పి, గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా సూపర్ హీరో ఫిల్మ్ కాల భైరవ
రాక్షసుడు, ఖిలాడి వంటి చిత్రాలను రూపొందించన ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ ఇప్పుడు ఏ స్టూడియోస్ ఎల్ఎల్పి బ్యానర్‌పై మరో ప్రెస్టీజియస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ స్టూడియోస్ ఎల్ఎల్పి, గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నాయి.
వైవిధ్యమైన పాత్రలు, చిత్రాలతో మెప్పిస్తోన్న డైనమిక్ స్టార్ రాఘవ లారెన్స్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్‌గా తనదైన ముద్ర వేసిన లారెన్స్ కెరీర్లో 25వ చిత్రంగా ఇది రూపొందుతుండటం విశేషం. బ్లాక్ బస్టర్ మూవీ రాక్షసుడు, సెన్సేషనల్ మూవీ ఖిలాడి వంటి చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ రమేష్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతానికి ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ నిర్మాణాత్మక దశలో ఉంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాఘవ లారెన్స్ లుక్ అందరిలో ఆసక్తిని పెంచుతోంది.
RL25 చిత్రానికి ‘కాల భైరవ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్‌ను గమనిస్తే ఇంట్రెస్టింగ్ అంశాలను గమనించవ్చు. ‘ది వరల్డ్ విత్ ఇన్’, ‘ఏ ప్యాన్ ఇండియా సూపర్ హీరో ఫిల్మ్’ వంటి లైన్స్ అంచనాలను ఆకాశానికెత్తేస్తున్నాయి. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని కోనేరే సత్యనారాయణ, మనీష్ షా అత్యంత భారీగా రూపొందిస్తున్నారు.
ఇప్పటి వరకు ఇంత గొప్ప సినిమాను చూడలేదనేంత గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆడియెన్స్‌కు అందించటానికి మేకర్స్ ప్రతీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘కాల భైరవ’ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2025 వేసవిలో సినిమాను విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్నివివరాలను మేకర్స్ తెలియజేస్తారు.